395 Jobs in UPSC: యూపీఎస్సీ–ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ (2)–2023 నోటిఫికేషన్ విడుదల..
మొత్తం పోస్టుల సంఖ్య: 395(నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370(ఆర్మీ–208, నేవీ–42, ఎయిర్‌ఫోర్స్–120) ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు, నేవల్ అకాడమీ(10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 25 ఉన్నాయి.
అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్(ఇండియన్ నేవల్ అకాడమీ)కు దరఖాస్తు చేయాలనుకుంటే.. ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీనితోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే.
వయసు: అవివాహిత çపురుష, మహిళా అభ్యర్థులు 02.01.2005కి ముందు, 01.01.2008కి తర్వాత జన్మించి ఉండకూడదు.
చదవండి: UPSC CDS Exam 2023: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుల్లో 349 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. రాతపరీక్ష, ఇంటెలిజెన్స్–పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 06.06.2023.
- దరఖాస్తు సవరణ తేదీలు: 07.06.2023 నుంచి 13.06.2023 వరకు .
- ఆన్‌లైన్ రాతపరీక్ష: 03.09.2023.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
- వెబ్‌సైట్: https://www.upsconline.nic.in/
చదవండి: Civils Practice Tests
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | June 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |