Skip to main content

TSGENCO Notification 2023: బీటెక్‌ అర్హతతో 339 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాలు..

టీఎస్‌ జెన్‌కో 339 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీటెక్‌ అర్హతతో ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు. జెన్‌కో పరీక్ష తేదీని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. టీఎస్‌ జెన్‌కో ఏఈ పోస్ట్‌ల వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాలు..
tsgenco notification 2023 details and exam pattern
  • 339 ఏఈ పోస్ట్‌లకు టీఎస్‌ జెన్‌కో నోటిఫికేషన్‌
  • బీటెక్‌ ఉత్తీర్ణతతో పోటీ పడే అవకాశం
  • డిసెంబర్‌ 3న రాత పరీక్ష
  • రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా నియామకం

తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. టీఎస్‌ జెన్‌కోగా సుపరిచితం. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించే ఈ సంస్థ.. మానవ వనరుల నియామకం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ప్రతి ఏటా ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. తాజాగా.. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

నాలుగు బ్రాంచ్‌లు.. 339 పోస్ట్‌లు

  • టీఎస్‌ జెన్‌కో తాజా నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం నాలుగు బ్రాంచ్‌లలో 339 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–జనరల్‌ రిక్రూట్‌మెంట్‌–145 పోస్ట్‌లు, లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌– 42 పోస్ట్‌లు.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(మెకానికల్‌)–జనరల్‌ రిక్రూట్‌మెంట్‌–74 పోస్ట్‌లు; లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌–3 పోస్ట్‌లు.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రానిక్స్‌)–జనరల్‌ రిక్రూట్‌మెంట్‌–25 పోస్ట్‌లు.
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌)–జనరల్‌ రిక్రూట్‌మెంట్‌–1,లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌–49 పోస్ట్‌లు
  • నాలుగు బ్రాంచ్‌లకు సంబంధించి లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ పరిధిలో 94 పోస్ట్‌లు, జనరల్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో 245 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. 

చ‌ద‌వండి: 399 Jobs: జెన్‌కోలో ఏఈ జాబ్స్‌.. వేతనం, ఎంపిక ఇలా

విద్యార్హతలు

  • ఏఈ(ఎలక్ట్రికల్‌): ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌తో బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. n ఏఈ(మెకానికల్‌): మెకానికల్‌ బ్రాంచ్‌తో బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. 
  • ఏఈ(ఎలక్ట్రానిక్స్‌): ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(ఈసీఈ)/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ పవర్‌/పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి.

వయసు
జూలై 1, 2023 నాటికి 18–44 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ / ఎస్‌టీ/ ఓబీసీ(నాన్‌ –క్రీమీలేయర్‌)/ఈ డబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు ఇస్తారు.

వేతనం
తుది విజేతల జాబితాలో నిలిచి నియామకం ఖరారు చేసుకుంటే.. రూ.65,600–రూ.1,31,220 వేతన శ్రేణిలో ప్రారంభ వేతనం లభిస్తుంది.

ఎంపిక ఇలా
రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా రిజర్వేషన్లు, లోకల్‌ కేడర్‌ తదితర నిబంధనలను అనుసరించి తుది జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో నిలిచిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు. ఆ క్రమంలో ఆయా కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కుల నిబంధనను అమలు చేస్తారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, క్రీడాకారుల కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులు; బీసీ అభ్యర్థులు 35 శాతం మార్కులు; ఎస్‌సీ/ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు; పీహెచ్‌ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సా«ధించాలి.

వంద మార్కులకు రాత పరీక్ష

  • రాత పరీక్షను రెండు విభాగాలుగా 100 మార్కులకు నిర్వహిస్తారు.
  • పార్ట్‌–ఎలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న బ్రాంచ్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌ నుంచి 80 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
  • పార్ట్‌–బిలో ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్, అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, సంస్కృతి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నమోదైన అభివృద్ధి, బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అంశాల నుంచి 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. 
  • పరీక్షను ఓఎంఆర్‌ విధానంలో నిర్వహిస్తారు.

చ‌ద‌వండి: SSC Officer Posts in Indian Navy: భారత నౌకాదళంలో 224 పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రెండేళ్ల ప్రొబేషన్, శిక్షణ
నియామకం ఖరారైన వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్, శిక్షణ విధానాన్ని అమలు చేస్తారు. తొలి ఏడాదిని శిక్షణ సమయంగా, రెండో ఏడాదిని ప్రొబేషన్‌ పీరియడ్‌గా పరిగణిస్తారు. ప్రొబేషన్‌ నిబంధనలతోపాటు.. సర్వీస్‌ బాండ్‌ను కూడా టీఎస్‌ జెన్‌కో అమలు చేస్తోంది. నియామకం ఖరారు చేసుకున్న వారు ట్రైనింగ్, ప్రొబేషన్‌లకు కేటాయించిన రెండేళ్లతో కలిపి.. మొత్తం అయిదేళ్లపాటు జెన్‌కోలో విధులు నిర్వహిస్తామని సర్వీస్‌ బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ఎస్‌ఈ స్థాయికి చేరుకునే అవకాశం
టీఎస్‌ జెన్‌కోలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా కొలువు దీరిన వారు.. భవిష్యత్తులో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. సర్వీసు నిబంధనలను అనుసరించి.. ఏఈ తర్వా­త.. అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్, ఆ తర్వాత డివిజనల్‌ ఇంజనీర్, అనంతరం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ స్థానాలకు పదోన్నతులు లభిస్తాయి. చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయికి కూడా చేరుకోవచ్చు. 

రాత పరీక్షలో రాణించేలా

  • ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ అభ్యర్థులు.. ఎలక్ట్రికల్‌ మెటీరియల్స్, బేసిక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ బ్యాటరీస్, ఎలక్ట్రికల్‌ సర్క్యూట్స్,డీసీ మెషీన్స్, మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, ఏసీ మెషి­న్స్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, పవర్‌ సిస్టమ్స్, ఎలక్ట్రికల్‌ ఇన్‌స్టాలేషన్‌ అండ్‌ ఎస్టిమేషన్, యుటిలైజేషన్‌ అండ్‌ ట్రాక్షన్, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌కు, అనలాగ్‌ అండ్‌ డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్‌ ప్రాసెసింగ్, కంట్రోల్‌ సిస్టమ్, ఎలక్ట్రికల్‌ మెషీన్స్, పవర్‌ సిస్టమ్స్, పవర్‌ ప్లాంట్‌ ఇంజనీరింగ్, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ డ్రైవ్స్, థర్మోడైనమిక్స్, హీట్‌ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన అ­న్ని అంశాలపై పరిపూర్ణ అవగాహన పొందాలి.
  • మెకానికల్‌ బ్రాంచ్‌ అభ్యర్థులు.. ఇంజనీరింగ్‌ మెకానిక్స్, మెకానిక్స్‌ ఆఫ్‌ మెటీరియల్స్, థియరీ ఆఫ్‌ మెషీన్స్, వైబ్రేషన్స్, థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్‌ మెకానిక్స్, హీట్‌ ట్రాన్స్‌ఫర్, ఇంజనీరింగ్‌ మెటీరియల్స్, క్యాస్టింగ్, ఫార్మింగ్, జాయింగ్‌ ప్రక్రియలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా.. కంప్యూటర్‌ ఇంటిగ్రేటెడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్‌ అండ్‌ ప్లానింగ్‌ కంట్రోల్, ఇన్వెంటరీ కంట్రోల్, ఆపరేషన్స్‌ రీసెర్చ్‌ ఐసీ ఇంజన్స్, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషన్, పవర్‌ ప్లాంట్‌ ఇంజనీరింగ్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
  • సివిల్‌ ఇంజనీరింగ్‌ అభ్యర్థులు.. ఇంజనీరింగ్‌ మెకానిక్స్, సాలిడ్‌ మెకానిక్స్, స్ట్రక్చరల్‌ అనాలిసిస్, బిల్డింగ్‌ మెటీరియల్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్, ఫ్లూయిడ్‌ మెకానిక్స్, ఓపెన్‌ ఛానెల్‌ ఫ్లో, పైప్‌ ఫ్లో, హైడ్రాలజీ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఇంజనీరింగ్, వాటర్‌ సప్లై ఇంజనీరింగ్, వేస్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, జియో టెక్నికల్‌ ఇంజనీరింగ్, ఎయిర్‌ పొల్యూషన్, సర్వేయింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్, పవర్‌ ప్లాంట్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లోని అంశాల్లో దృష్టి పెట్టాలి.
  • ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్‌ అభ్యర్థులు.. నెట్‌వర్క్స్, సిగ్నల్స్, సిస్టమ్స్, ఎలక్ట్రానిక్‌ డివైసెస్, అనలా­గ్‌ సర్క్యూట్స్, డిజిటల్‌ సర్క్యూట్స్, కంట్రోల్‌ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్, బేసిక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెటీరియల్స్‌ సైన్స్, పవర్‌ ప్లాంట్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మెజర్‌మెంట్స్‌కు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి.
  • జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ కోసం ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. తెలంగాణకు సంబంధించి ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించాలి. తాజాగా అమలవుతున్న అభివృద్ధి పథకాలను తెలుసుకోవాలి. తెలంగాణ ప్రాంత భౌగోళిక స్వరూపం, విశిష్టతలు తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన చరిత్రపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తెలంగాణ తొలి ఉద్యమ దశ నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు పలు ముఖ్యమైన అంశాలను ఔపోసన పట్టాలి.వీటితోపాటు తెలంగాణ సంస్కృతి, సామాజిక పరిస్థితులు, కళలు, సాహిత్యం వంటి అంశాలను కూడా చదవాలి.
  • ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అనలిటికల్‌ ఎబిలిటీ విషయంలో గ్రాఫ్స్, డేటా అనాలిసిస్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్‌ గ్రామర్‌ను అభ్యసనం చేయాలి.

అన్వయ దృక్పథం
ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ముందుకు సాగాలి. ముఖ్యంగా సబ్జెక్ట్‌ విభాగానికి సంబంధించి బీటెక్‌ స్థాయిలోని అకడమిక్‌ పుస్తకాలను ఆలంబనగా చేసుకుని ప్రిపరేషన్‌ సాగించాలి. మోడల్‌ పేపర్లు, మాక్‌ టెస్ట్‌లు రాయడం కూడా పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్‌ 29, 2023
  • రాత పరీక్ష తేదీ: డిసెంబర్‌ 3, 2023
  • రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో.
  • వెబ్‌సైట్‌: https://tsgenco.co.in/
Qualification GRADUATE
Last Date October 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories