Skip to main content

Staff Nurse Posts: డీఎంహెచ్‌వో, గుంటూరులో 324 పోస్టులు

DMHO Guntur

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌/యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 324
పోస్టుల వివరాలు: స్టాఫ్‌ నర్సు–137, ల్యాబ్‌ టెక్నీషియన్లు–47, డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈఓ)–69, ఎల్‌జీఎస్‌(అవుట్‌సోర్సింగ్‌)–71.
స్టాఫ్‌ నర్సు: 
అర్హత: జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. 
జీతం: నెలకు రూ.34,318 చెల్లిస్తారు.

ల్యాబ్‌ టెక్నీషియన్లు: 
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. 
వేతనం: నెలకు రూ.28,000 చెల్లిస్తారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈఓ): 
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పీజీడీసీఏ చేసి ఉండాలి. 
జీతం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

ఎల్‌జీఎస్‌(అవుట్‌సోర్సింగ్‌): 
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. 
జీతం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

చ‌ద‌వండి: DMHO Recruitment: డీఎంహెచ్‌వో, చిత్తూరులో 129 ఖాళీలు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో), గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021

వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in

Qualification 10TH
Last Date September 30,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories