Skip to main content

DMHO Recruitment: విశాఖపట్నంలో 305 పోస్టులు.. దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

DMHO Visakhapatnam

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌ /యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/పొరుగుసేవల ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 305
పోస్టుల వివరాలు: స్టాఫ్‌ నర్సులు–139, ల్యాబ్‌ టెక్నీషియన్లు–40, డేటా ఎంట్రీ ఆపరేటర్లు(డీఈఓ)–59, లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌(ఎల్‌జీఎస్‌)–67.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా(మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ), జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం, సంబంధిత కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ.34,318 వరకు చెల్లిస్తారు.

చ‌ద‌వండి: DMHO Recruitment: డీఎంహెచ్‌వో, కృష్ణాలో 263 పోస్టులు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021

వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in

Qualification 10TH
Last Date September 30,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories