DMHO Recruitment: డీఎంహెచ్‌వో, కర్నూలులో స్టాఫ్ నర్స్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్/యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/పొరుగుసేవల ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 159
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సులు–76, ల్యాబ్ టెక్నీషియన్లు–22, డేటా ఎంట్రీ ఆపరేటర్లు(డీఈఓ)–30,లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్(ఎల్జీఎస్)–31
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం, సంబంధిత కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.34,318 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్ వెయిటేజి, కోర్సు వెయిటేజి ఆధారంగా ఎంపికచేస్తారు.
చదవండి: APPSC-AYUSH: 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. వివరాలు ఇవే..
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
వెబ్సైట్: https://kurnool.ap.gov.in
Qualification | 10TH |
Last Date | September 30,2021 |
Experience | 1 year |
For more details, | Click here |