APPSC-AYUSH: 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. వివరాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. ఆయుష్ విభాగం(ఆయుర్వేద, హోమియోపతి, యునానీ)లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 151
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్లు(ఆయుర్వేద–72, హోమియోపతి–53, యునానీ–26).
అర్హతలు: ఆయుర్వేద/హోమియోపతి/యునానీ లో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో శాశ్వత మెడికల్ ప్రాక్టీషనర్‌గా నమోదు చేసుకొని ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.37,100–రూ.91,450 మధ్య ఉంటాయి.
చదవండి: Staff Nurse Posts: డీఎంహెచ్‌వో, గుంటూరులో 324 పోస్టులు
ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021
దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021
వెబ్‌సైట్: http://www.psc.ap.gov.in
Qualification | GRADUATE |
Last Date | October 25,2021 |
Experience | 1 year |
For more details, | Click here |