Skip to main content

Andhra Pradesh Jobs: ఏపీలో పదోతరగతి అర్హత‌తో 1317 పారామెడికల్‌ పోస్టులు.. నెలకు రూ.28 వేల వరకూ వేతనం

AP Department of Medical, Health, Family Welfare

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 1317

ఎఫ్‌ఎన్‌ఓ(ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ)–839: 
అర్హత: పదో తరగతి తత్సమాన ఉత్తీర్ణతతోపాటు ఫస్ట్‌ ఎయిడ్‌ అర్హత సర్టిఫికెట్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలి. 
వయసు 42 ఏళ్లకు మించ‌కూడదు. 
వేతనం నెలకు రూ.12000 చెల్లిస్తారు. 

శానిటరీ అటెండెంట్‌ కమ్‌ వాచ్‌మెన్‌–312: 
అర్హత: పదోతరగతి తత్సమాన అర్హత ఉండాలి. 
వయసు 42ఏళ్లకు మించకూడదు. 
వేతనం నెలకు రూ.12000 చెల్లిస్తారు. 

ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2– 17: 
అర్హత: డీఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణత ఉండాలి. ఏపీ పారామెడికల్‌ కౌన్సెల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. 
వయసు 42ఏళ్లు మించకూడదు. 
వేతనం నెలకు రూ.28వేలు చెల్లిస్తారు. 

ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌ 2– 124: 
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలో డిప్లొమా ఉండాలి. ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి. 
వయసు 42ఏళ్లకు మించకూడదు. 
వేతనం నెలకు రూ.28వేలు చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్, పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 05.12.2021

చిరునామా: అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి పంపించాలి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు తమ జిల్లా వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: ఏపీలో–896 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification 10TH
Last Date December 05,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories