Andhra Pradesh Govt Jobs: ఏపీలో–896 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అమరావతిలోని ఏపీ వైద్యవిధాన పరిషత్(ఏపీపీవీపీ)... వివిధ జిల్లాల్లో ఉన్న ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 896
పోస్టుల వివరాలు: సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్‌లు–794, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్–86, డెంటల్ అసిస్టెంట్ సర్జన్–16.
అర్హతలు
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్‌లు:
విభాగాలు: గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనెస్తీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉండాలి.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్: ఎంబీబీఎస్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
డెంటల్ అసిస్టెంట్ సర్జన్: బీడీఎస్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 01.12.2021
వెబ్‌సైట్: https://cfw.ap.nic.in/
చదవండి: Andhra Pradesh Govt Jobs: ఏపీపీఎస్సీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
Qualification | DIPLOMA |
Last Date | December 01,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |