Skip to main content

Andhra Pradesh Jobs 2024: వైద్యారోగ్య శాఖలో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాజమహేంద్రవరం జోన్‌–2 పరిధిలోని వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌(ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌)లో సేవలు అందించడానికి ఒప్పంద ప్రాతిపదికన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌/మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Mid Level Health Provider Recruitment Health Services Application Process     Contractual Basis Job Opportunity  MLHP Jobs in Rajamahendravaram Zone Medical Department    Andhra Pradesh Health Department

మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ (సీపీసీహెచ్‌) కోర్సుతో బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
వయసు: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.25,000.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్, ఓల్డ్‌ రిమ్స్, కడప చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.01.2024.
మెరిట్‌ జాబితా వెల్లడి తేది: 27.01.2024.
అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 31.01.2024.
తుది మెరిట్‌ జాబితా వెల్లడి తేది: 07.02.2024
తుది మెరిట్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 09.02.2024.
తుది ఎంపిక జాబితా Ðð ల్లడి తేది: 12.02.2024
కౌన్సిలింగ్‌ తేది: 14.02.2024.

వెబ్‌సైట్‌: http://hmfw.ap.gov.in/

చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 12,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories