Skip to main content

Jobs in Telangana: కేఎంసీ/ఎంజీఎం హాస్పిటల్లో 135 పోస్టులు.. నెలకు రూ.1.25 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

KMC MGM Hospital Warangal Recruitment

తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయ మెడికల్‌ కాలేజ్, హన్మకొండ/మహాత్మాగాంధీ మెమోరియల్‌ హాస్పిటల్, వరంగల్‌ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 135
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–115, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌–20.
విభాగాలు: జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, ఓబీజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, అనెస్తీషియా.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌:
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబం«ధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ/తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అవ్వడంతో పాటు ఎంసీఐ/ఎన్‌ఎంసీ గుర్తింపు ఉండాలి. 
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు.

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌:
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.ఏపీ/తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.52,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: రిజిస్టర్డ్‌ పోస్టు/స్పీడ్‌ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది సూపరిండెంట్‌ మహాత్మా గాంధీ మెమోరియల్‌ హాస్పిటల్, ఎంజీ రోడ్, వరంగల్‌–506007 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 11.04.2022

వెబ్‌సైట్‌: https://kmcwgl.com
 

చ‌ద‌వండి: Jobs in Telangana: తెలంగాణ కోర్టుల్లో 591 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే...​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories