Skip to main content

Telangana Govt Jobs: తెలంగాణ వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

తెలంగాణ ప్రభుత్వం.. ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Teaching Jobs in Government Medical Colleges, Government Job Opportunities, Faculty Posts in Telangana Medical Colleges, Teaching Positions on Contract in Telangana

పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ,ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాల­జీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్‌.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధనానుభవం ఉండాలి.
వయసు: 69 ఏళ్లు మించకూడదు.
వేతనం: ప్రొఫెసర్‌కు రూ.1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలకు అదనంగా మరో రూ.50,000 ఇస్తారు. ఎంపికైన వారు బాండ్‌ పేపర్‌ రాసివ్వాలి. ఒకవేళ మధ్యలో ఉద్యోగాన్ని వదిలేస్తే మూడు నెలల జీతాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. జాయినింగ్‌ సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికేట్లను ఇవ్వాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: Teaching Posts: ఎస్‌సీటీఐఎంఎస్‌టీ, తిరువనంతపురంలో టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ఎంపిక విధానం: పీజీ మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను స్కాన్‌ చేసి మెయిల్‌ ద్వారా పంపాలి.
ఈమెయిల్‌: dmerecruitment.contract@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 15.10.2023.

వెబ్‌సైట్‌: https://dme.telangana.gov.in/

చ‌ద‌వండి: Govt Scholarships: మహిళల ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌.. ఏడాదికి రూ.50000 స్కాలర్‌షిప్‌‌..
 

Qualification GRADUATE
Last Date October 15,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories