Skip to main content

Govt Scholarships: మహిళల ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌.. ఏడాదికి రూ.50000 స్కాలర్‌షిప్‌‌..

ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ).. 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి మహిళలను టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌లో ప్రోత్సహించేందుకు ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా డిప్లొమా విద్యనభ్యసిస్తున్న మహిళలకు ఆర్థిక సాయం అందిస్తారు.
Women in Technical Education, AICTE Pragati Scholarship 2023, pragati scholarship scheme for girl students,Women's Education Support Program

స్కాలర్‌షిప్‌ల సంఖ్య: దేశ వ్యాప్తంగా 5000 స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 318, తెలంగాణకు 206 కేటాయించారు.
స్కాలర్‌షిప్‌ మొత్తం: టెక్నికల్‌ డిప్లొమా రెగ్యులర్‌ కోర్సులో చేరినవారికి మూడేళ్లు, లేటరల్‌ ఎంట్రీ అభ్యర్థులకు రెండేళ్లపాటు ఏటా రూ.50,000 అందిస్తారు.
అర్హత: ఏదైనా టెక్నికల్‌ డిప్లొమా లెవెల్‌ కోర్సు అభ్యసిస్తూ ఉండాలి. లేటరల్‌ ఎంట్రీ ద్వారా డిప్లొమా రెండో సంవత్సరం ప్రవేశాలు పొందిన అభ్యర్థులు అర్హులే. కుటుంబ వార్షికాదాయం రూ.8,00,000 లక్షలకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు దరఖాస్తుకు అర్హులు.

చ‌ద‌వండి: Govt Scholarships: ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ 2023.. ఏడాదికి రూ.50000 స్కాలర్‌షిప్‌‌..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.12.2023

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/

Last Date

Photo Stories