Govt Scholarships: సీబీఎస్‌ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ స్కీమ్ పూర్తి వివరాలు ఇవే..
స్కాలర్‌షిప్ మొత్తం
ఈ స్కాలర్‌షిప్ కింద నెలకు రూ.500 అందిస్తారు. ఈ స్కాలర్‌షిప్ కాల వ్యవధి రెండేళ్లు ఉంటుంది.
లక్ష్యం
ప్రతిభ ఉండి, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లలను చదువుల్లో ప్రోత్సహించేందుకు సీబీఎస్‌ఈ 2006 నుంచి ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకాన్ని అమలుచేస్తోంది. తద్వారా అమ్మాయిల చదువుకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. ఈ పథకం కింద స్కాలర్‌షిప్‌ల సంఖ్యకు ఎలాంటి పరిమితులు లేవు. నిర్దిష్ట అర్హతలు కలిగిన విద్యార్థినులందరికీ స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి.
చదవండి: NMMS Scholarships: కేంద్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు భరోసా.. ఏడాదికి రూ.12వేల స్కాలర్‌షిప్
అర్హతలు
- సీబీఎస్‌ఈలో పదోతరగతి ఉత్తీర్ణులైన, సీబీఎస్‌ఈ అనుబంధ స్కూల్స్‌లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న సింగిల్ గర్ల్ చైల్డ్ విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు అర్హులు.
- విద్యార్థినులు పదోతరగతి పరీక్షలో కనీసం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందుండాలి. అలాగే ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500కు మించి ఉండకూడదు.
- విద్యార్థినులు ఇంటర్ చదువులను కొనసాగించాల్సి ఉంటుంది.
- స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు స్కూల్‌లో మరికొన్ని రాయితీలు లభిస్తాయి.
- భారతదేశ పౌరులతోపాటు ఎన్నారైలు కూడా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే ఎన్‌ఆర్‌ఐల ట్యూషన్ ఫీజు రూ.6000కు మించకూడదు.
వ్యవధి, రెన్యువల్
- స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులు ప్రతి ఏటా (ఇంటర్ ఫస్టియర్ తర్వాత) రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
- కనీసం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థినులకే స్కాలర్‌షిప్‌ను రెన్యువల్ చేస్తారు.
- మంచి ప్రవర్తనతోపాటు స్కూలు హాజరు బాగుండాలి.
- బోర్డు ముందస్తు అనుమతితో కోర్సు లేదా స్కూల్ మారే విద్యార్థినులకు స్కాలర్‌షిప్ కొనసాగుతుంది.
- స్కాలర్‌షిప్ ఒక్కసారి రద్దయితే తిరిగి పునరుద్ధరించరు.
చదవండి: Govt Scholarships: ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్ 2023.. ఏడాదికి రూ.50000 స్కాలర్‌షిప్..
ఎంపిక ప్రక్రియ
- పదోతరగతిలో 60 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు పొందాలి.
- సీబీఎస్‌ఈ అనుబంధ స్కూల్స్‌లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతుండాలి.
- విద్యార్థిని వారి తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె అయి ఉండాలి. దానికి సంబంధించి సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఫార్మెట్‌లో ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ /ఎస్‌డీఎం /ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్/నోటరీ అటెస్ట్ చేసిన ఒరిజినల్ అఫిడవిట్‌ను సమర్పించాలి.
- ఇంటర్ ప్రథమ సంవత్సరం ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ ప్రిన్సిపల్‌తో అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది.
చదవండి: Govt Scholarships: మహిళల ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్.. ఏడాదికి రూ.50000 స్కాలర్‌షిప్..
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుకు చివరితేదీ: 18.10.2023
- సీబీఎస్‌ఈ పాఠశాలల దరఖాస్తు ధ్రువీకరణ తేదీలు: 25.09.2023-25.10.2023
- వెబ్‌సైట్: https://www.cbse.gov.in/