Skip to main content

Scholarships: ఎల్‌ఐసీ గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపికైతే రూ. 40 వేలు అంద‌జేత..

ప్రభత్వరంగ బీమా సంస్థ.. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభ కలిగిన విద్యార్థులకు గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌–2023 పేరుతో ఉపకార వేతనాన్ని అందిస్తోంది. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
lic golden jubilee scholarship scheme 2023 details in telugu  LIC Educational Support for Talented Students     Golden Jubilee Scholarship Scheme-2023    Scholarship Application Form      LIC Golden Jubilee Scholarship 2023

అర్హత

  • జనరల్‌ స్కాలర్‌షిప్‌: 2022–23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000 మించకూడదు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థల్లో ఏదైనా డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్, డిప్లొమా, వృత్తి విద్య లేదా తత్సమాన కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనం అందుతుంది.
  • స్పెషల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌: పదో తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఉద్దేశించిందే ఈ స్కాలర్‌షిప్‌. 2022–23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,50,000 మించకూడదు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థల్లో ఇంటర్మీడియట్, ఒకేషనల్, డిప్లొమా, ఐటీఐ కోర్సు అభ్యసిస్తున్న బాలికలకు ఉపకార వేతనం అందుతుంది.

ఆర్థిక సాయం

  • జనరల్‌ స్కాలర్‌షిప్‌నకు మెడికల్‌ విద్యార్థులకైతే ఏటా రూ.40,000 ఇస్తారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులైతే ఏడాదికి రూ.30,000 ఇస్తారు. డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, డిప్లొమా, ఒకేషనల్‌ కోర్సులు చేసేవారికైతే ఆ కోర్సు పూర్తయ్యేవరకు ఏటా రూ.20,000 చొప్పున ఇస్తారు. 
  • స్పెషల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కీమ్‌ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఇస్తారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్, ఒకేషనల్‌/డిప్లొమా కోర్సులను పూర్తిచేసేందుకు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో  చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పదోతరగతి లేదా ఇంటర్‌లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్‌షిప్‌నకు ఎంపికచేస్తారు. తక్కువ ఆదాయ వర్గాలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.01.2024.

వెబ్‌సైట్‌: https://licindia.in/

Last Date

Photo Stories