Central Govt Scholarships: ‘సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ స్కీమ్’ నోటిఫికేషన్‌ను విడుదల.. ఎవరు అర్హులంటే..
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 80 శాతం మార్కులతో ఇంటర్/12వ తరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఏఐసీటీఈ/మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/యూనివర్శిటీ/గుర్తింపు పొందిన కళాశాలల్లో డిగ్రీ లేదా పీజీ కోర్సులు చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షలకు మించకూడదు. డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు అర్హులు.
స్కాలర్‌షిప్: ఒక్కో విద్యార్థికి ఐదేళ్ల వరకు ఉపకార వేతనం అందిస్తారు. డిగ్రీ స్థాయిలో మూడేళ్ల పాటు ఏటా రూ.12,000, పీజీ స్థాయిలతో రెండేళ్ల పాటు ఏటా రూ.20,000 చెల్లిస్తారు. బీఈ/బీటెక్ కోర్సుల్లో చేరినవారికి మొదటి మూడేళ్లు ఏటా రూ.12,000, చివరి ఏడాది, రూ.20,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.12.2023
వెబ్‌సైట్: https://scholarships.gov.in/
చదవండి: Govt Scholarships: ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్ 2023.. ఏడాదికి రూ.50000 స్కాలర్‌షిప్..