Skip to main content

ONGC Scholarships: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు... ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్పు

ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ) స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తులు కోరుతోంది.
ONGC Scholarship Application Deadline, Apply Now for ONGC Scholarships, Financial Aid for Deserving Students, ONGC Scholarships, ONGC Scholarship Application Form, Scholarship Opportunity for Talented Students,

ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం ఏటా ఈ సంస్థ ఉపకార వేతనాలు అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌ విభాగాలకు చెందిన విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. 2023–24 విద్యా సంవత్సరానికి ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్పులకు సంబంధించిన సమగ్ర సమాచారం..

మొత్తం స్కాలర్‌షిప్పులు: 2000  
రిజర్వేషన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ 1000, ఓబీసీలకు 500, జనరల్‌ అభ్యర్థులకు 500 చొప్పున  కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50శాతం స్కాలర్‌షిప్పులు మహిళలకు దక్కుతాయి.

అందించే మొత్తం
ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయ్యేంతవరకు ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది.

చ‌ద‌వండి: Central Govt Scholarships: ‘సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌’ నోటిఫికేషన్‌ను విడుదల.. ఎవరు అర్హులంటే..

అర్హతలు
ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్‌ కోర్సు రెగ్యులర్‌ విధానంలో చదువుతుండాలి.  ఇంజనీరింగ్‌ (బీఈ/బీటెక్‌), ఎంబీబీఎస్‌ లేదా పీజీ స్థాయిలో జియాలజీ /జియోఫిజిక్స్‌/ఎంబీఏలో చేరిన ప్రథమ సంవత్సర విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సు­లు చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ–జియాలజీ/జియోఫిజిక్స్‌ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండాలి. తల్లిదండ్రుల వార్షికదాయం రూ.2లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల వరకు అవకాశం ఉంటుంది.
ఏ ఇతర స్కాలర్‌ష్పిప్పులూ పొందని వారే ఓఎన్‌జీసీ ఉపకార వేతనాలకు అర్హులు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా లబ్ధి పొందేవాళ్లు ఈ స్కాలర్‌షిప్పునకు అర్హులే.
వయసు: 2023, అక్టోబర్‌ 16 నాటికి 30ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక ఇలా
ఇంజనీరింగ్, ఎంబీబీఎస్‌ కోర్సులకు ఇంటర్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారి వివరాలను ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. 
స్కాలర్‌షిప్‌ కొనసాగాలంటే ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షల్లో కనీసం 50శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అంతకంటే తక్కువ మార్కులు పొందితే  ఆ తర్వాత విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్‌ అందదు.

చ‌ద‌వండి: Govt Scholarships: ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ 2023.. ఏడాదికి రూ.50000 స్కాలర్‌షిప్‌‌..

దరఖాస్తు
ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేయా­లి. కుల ధ్రువీకరణ పత్రం, పదోతరగతి మార్కుల పత్రం, ఇంటర్‌ లేదా గ్రాడ్యుయేషన్‌ మార్కు షీట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలు, పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు తదితర పత్రాల వివరాలు అందించాలి.

ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్‌ 30, 2023
వెబ్‌సైట్‌: https://ongcscholar.org

Last Date

Photo Stories