Post Matric Scholarship 2023: పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు.. ఎవరు అర్హులంటే..
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగులు, మైనార్టీ విద్యార్థులు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ రెన్యూవల్/ఫ్రెష్ కోసం ఈనెల 31 లోగా https://telanganaepass.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వివిధ ధ్రువీకరణ పత్రాలు జతపరచాలని సూచించారు.
ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్‌కార్డు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా నబర్, పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటో, మొబైల్ నంబర్‌తో www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.