Specialist Doctor Jobs: డీఎంహెచ్‌వో, కృష్ణాలో 129 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 129
విభాగాలు: సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్, కార్డియాలజీ, ఆడియోమెట్రీ, క్వాలిటీ మానిటర్, మెడిసిన్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ఎంబీబీఎస్ /బీడీఎస్/ఆయుష్/బీపీటీ/బీఎస్సీ /పీజీ/ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ. 21,000 నుంచి రూ.1,10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: 75మార్కులు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆధారంగా,మరో 10 మార్కులు అకాడమి అర్హత సాధించిన ఏడాది నుంచి ఒక్కో మార్కు చొప్పున కేటాయిస్తారు. మిగతా 15 శాతం మార్కులు ఇతర నిబంధనల ప్రకారం కేటాయిస్తారు. అనంతరం డాక్టర్లు, స్పెషలిస్ట్‌లకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, పరసుపేట, మచిలీపట్నం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 25.03.2022
వెబ్‌సైట్: https://krishna.ap.gov.in
చదవండి: Jobs in Andhra Pradesh: ఏపీ యానిమల్ హజ్బెండరీ విభాగంలో 28 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 25,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |