Skip to main content

SSC Recruitment 2022: పదోతరగతి అర్హత‌తో 24,369 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

SSC Recruitment 2022 For 24,369 Jobs

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) వివిధ సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ /రైఫిల్‌మ్యాన్‌/సిపాయి పోస్టులు భర్తీకి ఓపెన్‌ కాంపిటీటివ్‌ పరీక్షను నిర్వహిస్తోంది.

విభాగాలు: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్‌(ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(ఎస్‌ఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్‌(జనరల్‌ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్‌(ఏఆర్‌)లో రైఫిల్‌మ్యాన్‌(జనరల్‌ డ్యూటీ), నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ)లో సిపాయి పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 24,369
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు. » వయసు: జనవరి 01, 2023 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
వేతనం: సిపాయి పోస్టుకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు, ఇతర ఖాళీలకు రూ. 21,700 నుంచి రూ.69,100 మధ్య చెల్లిస్తారు.

చ‌ద‌వండి: AP High Court Recruitment 2022 : ఏపీ హైకోర్టు 3673 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్ట్‌ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

సీబీఈ పరీక్ష విధానం: ప్రశ్నపత్రంలో 80 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్‌/హిందీ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరితేది: 30.11.2022
  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేది: జనవరి, 2023
  • వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

 

చ‌ద‌వండి: APPSC Engineering Services Jobs: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories