AP High Court Recruitment 2022 : ఏపీ హైకోర్టు 3673 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కార్యాలయ సిబ్బంది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 3673 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ ఖాళీలకు నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 3673
అర్హతలు: పోస్టును అనుసరించి ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టైప్ రైటింగ్/స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
వేతనం: ఆయా పోస్టులను అనుసరించి రూ.20వేల నుంచి రూ.1,24,380 మధ్య ఉంటుంది.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
- హైకోర్టు ఖాళీలకు గడువు: 25.10.2022 నుంచి 15.11.2022;
- జిల్లా కోర్టుల ఖాళీలకు గడువు: 22.10.2022 నుంచి 11.11.2022 మధ్య దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://hc.ap.nic.in/recruitment.html
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | November 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |