SSC JE 2023 Notification: కేంద్రంలో 1324 జూనియర్ ఇంజనీర్ పోస్ట్‌లు.. విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
- కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జేఈ పోస్ట్‌లకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్
- సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో 1,324 పోస్ట్‌లు
- డిప్లొమా, బీటెక్ అర్హతతో పోటీ పడే అవకాశం
- రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా నియామకాలు
- ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.60 వేల వేతనం
8 విభాగాలు.. 1,324 పోస్ట్‌లు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్) ఎగ్జామ్–2022 ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎనిమిది విభాగాలు/శాఖల్లో 1,324 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు
- ఆగస్ట్ 1, 2023 నాటికి సంబంధిత బ్రాంచ్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లతో బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పోస్ట్‌లకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- వయసు: ఆగస్ట్ 1, 2023 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ వాటర్ కమిషన్‌లకు మాత్రం గరిష్ట వయో పరిమితిని 32ఏళ్లుగా పేర్కొన్నారు. ఎస్‌సీ,ఎస్టీ వ ర్గాలకు అయిదేళ్లు,ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
అనుభవం
జూనియర్ ఇంజనీర్ పోస్ట్‌లకు సంబంధించి కొన్ని విభాగాలకు పని అనుభవం తప్పనిసరని పేర్కొన్నారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లోని పోస్ట్‌ల విషయంలో సివిల్ ఇంజనీరింగ్ పోస్ట్‌లకు రెండేళ్లు, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ పోస్ట్‌లకు మూడేళ్లు పని అనుభవం ఉండాలి.
ప్రారంభ వేతనం రూ.60వేలు
ఎంపికైన అభ్యర్థులకు ఏడో వేతన సంఘం ప్రకారం–పే లెవల్–6లో రూ.35,400 – రూ.1,12,400 వేతన శ్రేణి అందుతుంది. అంటే ప్రారంభంలోనే నెలకు రూ.60 వేల వరకు వేతనం లభిస్తుంది. భవిష్యత్తులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ హోదాలకు చేరుకునే అవకాశం ఉంది.
ఎంపిక విధానం
ఆయా పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షను నిర్వహిస్తారు. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలోనూ పొందిన మార్కుల ఆధారంగా తుది విజేతల జాబితా రూపొందిస్తారు. దరఖాస్తులో పేర్కొన్న ప్రాథమ్యాలు, ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నియామకాలు ఖరారు చేసి సంబంధిత శాఖలు, విభాగాలకు పంపుతారు. ఆ తర్వాత సంబంధిత శాఖల్లో నిర్ణీత కాల వ్యవధిలో అంతర్గత శిక్షణనిస్తారు. దాన్ని పూర్తి చేసుకున్న వారికి విధులు కేటాయిస్తారు.
చదవండి: SSC CPO Notification 2023: 1876 ఎస్‌ఐ పోస్టులు.. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది ఇదే..
రాత పరీక్ష రెండు పేపర్లుగా
- రాత పరీక్షలో రెండు పేపర్లు (పేపర్–1, పేపర్–2) ఉంటాయి.
- పేపర్–1ను మూడు విభాగాలుగా 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో–జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులు, మరో వంద మార్కులకు అభ్యర్థులు పోటీ పడే జనరల్ ఇంజనీరింగ్ విభాగం(పార్ట్ ఏ/పార్ట్ బీ/పార్ట్ సీ) పరీక్ష ఉంటుంది.
- అభ్యర్థులు తాము డిప్లొమా లేదా బీటెక్‌లో చదివిన బ్రాంచ్‌కు అనుగుణంగా పార్ట్–ఎ లేదా పార్ట్–బి లేదా పార్ట్–సిలలో ఏదో విభాగంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాలి.
పేపర్–2.. 300 మార్కులు
- పేపర్–1లో పొందిన మార్కులను నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా క్రోడీకరించి కటాఫ్ స్కోర్లను నిర్ణయిస్తారు. ఆ తర్వాత అందుబాటులో ఉండే పోస్ట్‌ల సంఖ్య ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. వారికి పేపర్–2కు అర్హత లభిస్తుంది.
- పేపర్–2ను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌గా 100 ప్రశ్నలు–300 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్–ఎ జనరల్ ఇంజనీరింగ్(సివిల్ అండ్ స్ట్రక్చరల్), పార్ట్–బి జనరల్ ఇంజనీరింగ్(ఎలక్ట్రికల్), పార్ట్–సి జనరల్ ఇంజనీరింగ్ (మెకానికల్) పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు తమ అర్హతకు అనుగుణంగా సంబంధింత సబ్జెక్ట్ విభాగంలో పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది.
చదవండి: SSC Exams Guidance
టెక్నికల్ నాలెడ్జ్‌తో విజయం
రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే నియామకాలు ఖరారు చేయనున్న నేపథ్యంలో.. అభ్యర్థులు సంబంధిత టెక్నికల్ సబ్జెక్ట్‌లపై పట్టు సాధించాల్సిన ఆవశ్యకత నెలకొంది. అందుకోసం డిప్లొమా, బీటెక్ స్థాయిలో అకడమిక్ పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయాలి.
సివిల్ ఇంజనీరింగ్
బిల్డింగ్ మెటీరియల్స్, ఎస్టిమేటింగ్, కాస్టింగ్ అండ్ ఎవాల్యుయేన్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, హైడ్రాలిక్స్, ఇరిగేషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లపై పట్టు సాధించాలి. అదే విధంగా.. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి స్ట్రక్చర్స్ థియరీ, కాంక్రీట్ టెక్నాలజీ, ఆర్‌సీసీ డిజైన్, స్టీల్ డిజైన్ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
బేసిక్ కాన్సెప్ట్స్‌తోపాటు సర్క్యూట్ లా, మ్యాగ్నటిక్ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్, మెజర్‌మెంట్ అండ్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, ఫంక్షనల్ కిలోవాట్ మోటార్స్ అండ్ సింగిల్ ఫేజ్ మోటార్స్, సింక్రనస్ మెషీన్స్, జనరేషన్, ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, యుటిలైజేషన్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్‌పై పట్టు సాధించాలి.
మెకానికల్ ఇంజనీరింగ్
థియరీ ఆఫ్ మెషీన్స్, మెషీన్ డిజైన్, ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ప్యూర్ సబ్‌స్టాన్సెస్, ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ ఫర్ ఐసీ ఇంజన్స్, ఐసీ ఇంజన్ పెర్‌ఫార్మెన్స్, ఐసీ ఇంజన్స్ కంబస్టన్, ఐసీ ఇంజన్ కూలింగ్ అండ్ లూబ్రికేషన్, ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఫ్లూయిడ్ ప్రెజర్, ఫ్లూయిడ్ కైనమాటిక్స్, డైనమిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెజర్‌మెంట్ ఆఫ్ ఫ్లో రేట్, బేసిక్ ప్రిన్సిపుల్స్, హైడ్రాలిక్ టర్బైన్స్, సెంట్రిఫ్యుగల్ పంప్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీల్ తదితర కోర్ మెకానికల్ అంశాలను అధ్యయనం చేయాలి.
కాన్సెప్ట్స్, అప్లికేషన్ అప్రోచ్
అభ్యర్థులు ఇంజనీరింగ్ పేపర్లలో మెరుగైన మార్కుల కోసం ఆయా సబ్జెక్ట్‌లలోని ప్రాథమిక భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, ధర్మాలు(ప్రాపర్టీస్) వంటి అంశాలను చదువుతూఅన్వయ నైపుణ్యం అలవర్చుకోవాలి. అప్పుడే పరీక్షలో ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
ఉమ్మడి టాపిక్స్‌కు ఇలా
పేపర్–1లో ఉమ్మడి సబ్జెక్ట్‌లుగా పేర్కొన్న జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్‌లో రాణించడానికి ప్రత్యేకంగా ప్రిపరేషన్ సాగించాలి. జనరల్ అవేర్‌నెస్ కోసం చరిత్ర, భారత రాజ్యాంగం, భౌగోళిక శాస్త్రం, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ,కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే అంశాలను చదవాలి. ఆధునిక భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమ దశలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జాగ్రఫీకి సంబంధించి దేశ భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, అడవులు, పర్వతాలు, సముద్ర తీర ప్రాంతాలు తదితర అంశాలను తెలుసుకోవాలి. రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైన అధికరణలు, ప్రకరణలు, తాజా సవరణలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో తాజాగా దేశ శాస్త్ర, సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, రక్షణ వ్యవస్థ, ఇస్రో తదితర సంస్థల ప్రయోగాల గురించి అధ్యయనం చేయాలి.
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో రాణించడానికి.. నంబర్ సిరిస్, కోడింగ్ – డీకోడింగ్ నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రమ్స్, స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 16.08.2023
- ఆన్‌లైన్ దరఖాస్తులో సవరణలకు అవకాశం: ఆగస్ట్ 17, 18 తేదీల్లో..
- పేపర్–1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) తేదీ: అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం.
- తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు,కాకినాడ,కర్నూలు,నెల్లూరు,రాజమం డ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |