Skip to main content

SSC CPO Notification 2023: 1876 ఎస్‌ఐ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది ఇదే..

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఢిల్లీ పోలీసు, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లో.. సబ్‌-ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ) నియామక పరీక్ష-2023కు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతోపాటు కేంద్ర సాయుధ బలగాలైన(సీఏపీఎఫ్‌) బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SSC CPO Notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 1876
పోస్టుల వివరాలు: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ)లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌(జీడీ)-1714, ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌(ఎగ్జిక్యూటివ్‌)-పురుషులు/మహిళలు-162.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.08.2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సీబీటీ రాతపరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష(పీఈటీ)/ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(సీఎస్‌టీ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.08.2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 16.08.2023 నుంచి 17.08.2023 వరకు.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేది: అక్టోబర్‌ 2023.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

చ‌ద‌వండి: SSC : ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు... ప్రారంభ వేత‌నం రూ.35 వేలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories