Junior Engineer Posts in Central Govt: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
విభాగాలు: కేంద్ర జల సంఘం, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, విద్యుత్ రీసెర్చ్ స్టేషన్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్, పోర్ట్స్, షిప్పింగ్-వాటర్‌వేస్ తదితర సంస్థల్లో సంబంధిత విభాగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది.
అర్హత: డిప్లొమా(సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ(సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు.
వయసు: పోస్టులకు అనుగుణంగా 18 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వివిధ కేటగిరీల వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
వేతనం: సెవెన్త్ పే స్కేలు ప్రకారం-.35,400 నుంచి రూ.1,12,400 ఉంటుంది.
ఎంపిక విధానం: పేపర్-1, పేపర్-2 రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: పరీక్ష రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్-1, పేపర్-2 ఉంటాయి.
- పేపర్-1 ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పేపర్-2(డిస్క్రిప్టివ్) ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్ష 200 ప్రశ్నలు-200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
- పేపర్-2 మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. ఈ పరీక్ష పెన్ అండ్ పేపర్ విధానంలో డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.08.2023.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ,విశాఖపట్నం, విజయనగరం
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: అక్టోబర్ 2023.
వెబ్‌సైట్: https://ssc.nic.in/
చదవండి: SSC CPO Notification 2023: 1876 ఎస్‌ఐ పోస్టులు.. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |