Skip to main content

835 Head Constable Jobs: ఢిల్లీ పోలీస్‌ శాఖలో కొలువు.. విజయం సాధించడానికి మార్గాలు..

ssc delhi police head constable jobs

పోలీస్‌ జాబ్స్‌.. నేడు యువతలో ఎంతో క్రేజ్‌ నెలకొన్న ఉద్యోగాలు! కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ వరకు.. పోలీస్‌ కొలువు సొంతం చేసుకోవాలని.. యువత కోరుకుంటోంది. దేశంలో పోలీస్‌ కొలువులు కోరుకునే యువత లక్షల సంఖ్యలోనే ఉంటున్న పరిస్థితి! ఇలాంటి వారికి చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది. ఇంటర్మీడియెట్‌ అర్హతగా.. హెడ్‌ కానిస్టేబుల్‌ హోదాలో.. కెరీర్‌ ప్రారంభించే అవకాశం ముందుకొచ్చింది. అదే.. ఢిల్లీ పోలీస్‌ ఎగ్జామినేషన్‌! ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. తదుపరి ఎంపిక ప్రక్రియల్లో సత్తా చాటితే.. ఢిల్లీ పోలీస్‌ శాఖలో కొలువు సొంతం చేసుకోవచ్చు. తాజాగా.. ఢిల్లీ పోలీస్‌ ఎగ్జామినేషన్‌కు సంబంధించి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ పోలీస్‌ ఎగ్జామినేషన్‌తో భర్తీ చేసే పోస్టులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, విజయానికి అనుసరించాల్సిన విధానాలు తదితర అంశాలపై విశ్లేషణ...

  • 835 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌
  • స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ
  • మూడు దశలుగా ఎంపిక విధానం
  • రూ.25,500–రూ.81,100 వేతన శ్రేణితో కొలువు

ఢిల్లీ పోలీస్‌.. దేశంలోనే ప్రత్యేకత కలిగిన విభాగం. ఈ శాఖలో కేవలం ఢిల్లీయే కాకుండా..దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు విధులు నిర్వర్తిస్తుంటారు. కారణం.. నియామకాలు జాతీయ స్థాయిలో జరగడమే. తాజాగా ఢిల్లీ పోలీస్‌ శాఖ.. కార్యాలయ నిర్వహణ(మినిస్టీరియల్‌) విభాగంలో.. హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్ట్‌ల భర్తీకి.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం 835, మహిళలకు 276
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ తాజాగా విడుదల చేసిన ఢిల్లీ పోలీస్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ ప్రకారం–మొత్తం 835 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. వీటిలో మహిళలకు ప్రత్యేకంగా 276 పోస్ట్‌లను కేటాయించారు. పురుషుల విభాగంలో ఓపెన్‌ కేటగిరీలో 217, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 50, ఓబీసీలకు 123, ఎస్సీలకు 59, ఎస్టీలకు 530 పోస్ట్‌లను కేటాయించగా.. మహిళల కోటాలో ఓపెన్‌ కేటగిరీలో 119, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 28, ఓబీసీ కేటగిరీలో 67, ఎస్సీ కేటగిరీలో 32, ఎస్టీ కేటగిరీలో 30 పోస్ట్‌లను కేటాయించారు. వీటికి అదనంగా ఎక్స్‌–సర్వీస్‌మెన్‌ కోటాలో పురుషుల విభాగంలో 56 పోస్ట్‌లను పేర్కొన్నారు.

చ‌ద‌వండి: 835 Head Constable Jobs: ఎస్‌ఎస్‌సీ ఢిల్లీ పోలీస్‌ ఎగ్జామ్‌ 2022కు నోటిఫికేషన్‌ విడుదల..

అర్హతలు

  • దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీయెట్, తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌/హిందీ టైపింగ్‌లో పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లిష్‌ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాలు, హిందీ టైపింగ్‌లో నిమిషానికి 25 పదాలు టైప్‌ చేసే నైపుణ్యం ఉండాలి.
  • వయసు: జనవరి 1, 2022 నాటికి 18–25ఏళ్ల మధ్యలో ఉండాలి.(జనవరి 2, 1997–జనవరి 1, 2004 మధ్యలో జన్మించి ఉండాలి). ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు లభిస్తుంది.

నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ

  • ఢిల్లీ పోలీస్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్ట్‌ల భర్తీకి మొత్తం నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి..–రాత పరీక్ష; ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ అండ్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌; –టైపింగ్‌ టెస్ట్‌; –కంప్యూటర్‌(ఫార్మాటింగ్‌) టెస్ట్‌.

ముందుగా రాత పరీక్ష

ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. గంటన్నర వ్యవధిలో నాలుగు విభాగాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. వివరాలు..

విభాగం  ప్రశ్నలు  మార్కులు
జనరల్‌ అవేర్‌నెస్‌ 20 20
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 20  20
జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 25 25
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25  25
కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌ ఎంఎస్‌ ఎక్సెల్, ఎంఎస్‌ వర్డ్‌  కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్‌ బ్రౌజర్స్‌ 10  10
మొత్తం 100 100
  • నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన విధించారు. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు.

రెండో దశ.. పీఈ అండ్‌ ఎంటీ

రాత పరీక్షలో చూపిన ప్రతిభ, పొందిన మార్కుల ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు 20 మందిని(1:20 నిష్పత్తిలో) చొప్పున తదుపరి దశ ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ అండ్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఫిజికల్‌ ఈవెంట్స్‌లో ప్రతిభను గుర్తించే విధంగా ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ ప్రక్రియ ఉంటుంది. ప్రధానంగా మూడు ఈవెంట్లలో.. వయో వర్గాల వారీగా నిర్దిష్ట సమయం, ఇతర నిబంధనల మేరకు తమ ప్రతిభను చూపాల్సి ఉంటుంది. అవి..

వయో పరిమితి 1600 మీటర్ల పరుగు పందెం లాంగ్‌ జంప్‌ హై జంప్‌
30 ఏళ్లలోపు 7 ని. 12బీ అ. 3బీ అ.
30–40ఏళ్లలోపు 8 ని. 11బీ అ. 31/4 అ.
40 ఏళ్ల పైబడి 9 ని. 10బీ అ.  3 అ.

ని = నిమిషాలు, అ = అడుగులు

మహిళా అభ్యర్థులకు ఇలా

ఫిజికల్‌ టెస్ట్‌లలో భాగంగా మహిళా అభ్యర్థులు కూడా తమ ప్రతిభను చూపాల్సి ఉంటుంది. వారికి కొన్ని మినహాయింపులు కల్పించారు. వివరాలు..

వయో పరిమితి 800 మీటర్ల పరుగు పందెం లాంగ్‌ జంప్‌  హై జంప్‌
30 ఏళ్ల లోపు  5 ని. 9 అ.  3 అ.
30–40 ఏళ్ల లోపు 6 ని.  8 అ.  2బీ అ.
40 ఏళ్ల పైబడి  7 ని. 7 అ.  21/4 అ.

ని = నిమిషాలు, అ = అడుగులు

  • వాస్తవానికి వయో పరిమితి విషయంలో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయసును 25 ఏళ్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఆయా వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు కల్పించిన నేపథ్యంలో ఫిజికల్‌ ఈవెంట్స్‌ విషయంలో కూడా వయోవర్గాల వారీగా కనీస నిబంధనల్లో సడలింపు కల్పించారు. 
  • పరుగు పందెంలో ఉత్తీర్ణత సాధించిన వారికే లాంగ్‌ జంప్, హై జంప్‌ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఈ రెండు ఈవెంట్లను గరిష్టంగా మూడు అవకాశాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
  • ఫిజికల్‌ ఈవెంట్స్‌ పూర్తి చేసుకున్న వారికి ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ నిర్వహిస్తారు.పురుష అభ్యర్థులు కనీసం 165సెంటీమీటర్ల ఎత్తు కలిగుండాలి.  ఛాతి విస్తీర్ణం 87–82సెంటీ మీటర్ల మధ్యలో ఉండాలి. మహిళా అభ్యర్థులకు కనీస ఎత్తును 157 సెంటీ మీటర్లుగా నిర్దేశించారు.

మూడో దశ టైపింగ్‌ టెస్ట్‌

రాత పరీక్ష, పీఈ అండ్‌ ఎంటీలలో విజయం సాధించిన వారికి మూడో దశలో.. 25 మార్కులకు టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. కంప్యూటర్‌ను వినియోగిస్తూ టైపింగ్‌ టెస్ట్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం 10 నిమిషాల వ్యవధిలో ఉండే ఈ టైపింగ్‌ టెస్ట్‌ను హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో నిర్వహిస్తారు.

చ‌ద‌వండి: SSC Recruitment 2022: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 1920 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే.. 

చివరగా కంప్యూటర్‌ ఫార్మాటింగ్‌ టెస్ట్‌

  • కంప్యూటర్‌ టైపింగ్‌ టెస్ట్‌లోనూ విజయం సాధించిన వారికి చివరగా కంప్యూటర్‌ ఫార్మాటింగ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎంఎస్‌–వర్డ్, ఎంఎస్‌–పవర్‌ పాయింట్, ఎంఎస్‌–ఎక్సెల్‌లో మూడు వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులకు సదరు అప్లికేషన్స్‌ వినియోగంలో ఉన్న నైపుణ్యాలను గుర్తిస్తారు. 
  • దీనికి సంబంధించి విభాగాలు, పరిశీలించే అంశాల వివరాలు..
  • ఎంఎస్‌ వర్డ్‌: టైప్, ఇన్సర్టింగ్‌ ఆఫ్‌ పారాగ్రాఫ్, సెట్టింగ్‌ ఆఫ్‌ లెఫ్ట్‌/రైట్‌ మార్జిన్‌ తదితర మొత్తం 20 విభాగాల్లో అభ్యర్థుల నైపుణ్యాలు పరీక్షిస్తారు. 
  • ఎంఎస్‌ ఎక్సెల్‌ విభాగంలో సెల్‌ క్రియేషన్, ఫార్మాట్‌ సెల్‌ వంటి 20 అంశాలు ఉంటాయి.
  • ప్రతి విభాగానికి పది నిమిషాల సమయం ఉంటుంది. 
  • 20 అంశాల్లో ఒక్కో అంశం ఫార్మాటింగ్‌కు సంబంధించి అర మార్కు కేటాయిస్తారు. –ఇలా ఒక్కో విభాగంలో పది మార్కులకుగాను అభ్యర్థులు కనీసం ఆరు మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

నాలుగు దశల్లో ప్రతిభ

మొత్తం నాలుగు దశల్లోనూ అభ్యర్థులు చూపిన ప్రతిభ, పొందిన మార్కులు, ఇతర రిజర్వేషన్‌ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తుది విజేతలను ప్రకటిస్తారు. మొత్తం నాలుగు దశల్లో పీఈ అండ్‌ ఎంటీ, కంప్యూటర్‌ ఫార్మాటింగ్‌ టెస్ట్‌లు కేవలం అర్హత పరీక్షలే. కానీ వీటిలో కనీస మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

తొలి దశలో విజయం.. ఇలా..

  • తొలిదశలో నిర్వహించే కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో విజయానికి అభ్యర్థులు విభాగాల వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..
  • జనరల్‌ అవేర్‌నెస్‌: అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే ఈ విభాగంలో రాణించాలంటే.. భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టిపెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యూర్‌ మ్యాథ్స్‌తోపాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్‌ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, అల్జీబ్రా, లీనియర్‌ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.
  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌: ఇందులో మంచి స్కోర్‌ చేసేందుకు వెర్బల్, నాన్‌–వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్‌ విజువలైజేషన్, సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అనాలిసిస్, విజువల్‌ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్‌ సిరిస్, కోడింగ్‌–డీకోడింగ్, నంబర్‌ అనాలజీ, ఫిగరల్‌ అనాలజీ, వర్డ్‌ బిల్డింగ్, వెన్‌ డయాగ్రమ్స్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ఈ విభాగంలో రాణించడానికి బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్‌–స్పెల్ట్‌ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్‌ /ప్యాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్‌ కాంప్రహెన్షన్‌లను ప్రాక్టీస్‌ చేయాలి.
  • కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌: ఈ విభాగంలో మంచి మార్కులు సాధించేందుకు వర్డ్‌ ప్రాసెసింగ్‌కు సంబంధించిన టూల్స్, అదే విధంగా ఎక్సెల్‌ షీట్స్, ఇంటర్నెట్‌ కమ్యూనికేషన్‌ టూల్స్‌(ఈ–మెయిల్‌ బేసిక్స్, ఈ–మెయిల్‌ రైటింగ్, సెండింగ్‌/రిసీవింగ్‌ తదితర)అంశాలపై ప్రాక్టీస్‌ చేయాలి. దీంతోపాటు వెబ్‌ బ్రౌజింగ్‌కు సంబంధించి యూఆర్‌ఎల్, హెచ్‌టీటీపీ, ఎఫ్‌టీపీ, వెబ్‌సైట్స్, బ్లాగ్స్, బ్రౌజింగ్‌ సాఫ్ట్‌వేర్స్, సెర్చ్‌ ఇంజన్స్, చాటింగ్, వీడియో కాన్ఫరెన్స్‌ తదితర ఆన్‌లైన్‌ రిసోర్సెస్‌ గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.

16,614 SI & Constable‌ Jobs: పోలీస్‌ పోస్టులకు సన్నద్ధమవ్వండిలా!

ప్రిపరేషన్‌తో సమాంతరంగా

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేల మంది అభ్యర్థులు పోలీస్‌ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించి ప్రిపరేషన్‌ కూడా ప్రారంభించారు. ఈ ప్రిపరేషన్‌నే ఢిల్లీ పోలీస్‌ ఎగ్జామినేషన్‌కు కూడా ఉపయుక్తంగా ఉండేలా సమాంతర ప్రణాళిక రూపొందించుకుంటే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు పోటీ పడే సన్నద్ధత పొందొచ్చు. సిలబస్‌లోని అంశాలు కూడా దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇలా రాత పరీక్షకు ముందే ఆయా అంశాలపై పట్టు సాధిస్తే రాత పరీక్షలో విజయం సాధించి మలి దశ ప్రక్రియలకు ఉత్తీర్ణత సాధించే అవకాశాలను పెంచుకోవచ్చు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: మే 17– జూన్‌ 16, 2022
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణకు అవకాశం: జూన్‌ 21 – జూన్‌ 25
  • రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు. 
  • తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Qualification 12TH
Last Date June 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories