Skip to main content

16,614 SI & Constable‌ Jobs: పోలీస్‌ పోస్టులకు సన్నద్ధమవ్వండిలా!

Preparation Tips and Guidance Posts, Eligibility criteria, syllabus
Preparation Tips and Guidance Posts, Eligibility criteria, syllabus

రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ).. పలు విభాగాల్లో పదహారు వేలకు పైగా ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో పోలీసు కొలువుల ఆశావహులు తమ ప్రిపరేషన్‌కు మరింత పదును పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. పోలీస్‌ నోటిఫికేషన్, ఆయా పోస్టుల వివరాలు, అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్‌ విధానంపై సమగ్ర సమాచారం...

16,614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు

  • కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
  • కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
  • కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
  • కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
  • కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
  • ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
  • వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
  • వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
  • కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
  • కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
  • కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100
  • మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027 

ఎస్సై పోస్టుల వివరాలు

  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సివిల్‌): 414
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఆర్‌): 66
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌)(పురుషులు): 5
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)(పురుషులు): 12
  • స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 26
  • డిప్యూటీ జైలర్‌(పురుషులు): 8
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 22
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌)(పురుషులు): 3
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో): 8
  • మొత్తం ఎస్సై పోస్టులు: 587

అర్హతలు

  • పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన కోర్సులు పూర్తిచే సిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన వారు కూడా అర్హులే. 
  • ఐటీ, కమ్యూనికేషన్‌ తదితర విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. 
  • 2022 జూలై 1 నాటికి ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయోపరిమితి

  • కానిస్టేబుల్‌ పోస్టులకు 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులు కాగా, ప్రభుత్వం మూడేళ్ల వయోపరిమితి సడలింపు అవకాశం ఇవ్వడంతో 25 ఏళ్ల వరకు వయసున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు వయోపరిమితి సడలింపుతో 21 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం

  • ప్రిలిమినరీ రాత పరీక్ష 
  • ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ 
  • ఫైనల్‌ రాత పరీక్ష

ప్రిలిమినరీ రాత పరీక్ష

ఎస్సై, కానిస్టేబుల్‌ విభాగాల్లో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రిలిమినరీ రాత పరీక్షలో 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పరీక్ష సమయం 3 గంటలు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. అయితే ఈ సారి నుంచి ప్రిలిమినరీ రాత పరీక్షలో నెగెటివ్‌ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి తప్పు సమాధానానికి 1/5వ వంతు మార్కు కోత వి«ధిస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమినరీ రాత పరీక్షలో 30 శాతం మార్కులు(60 మార్కులు) సాధించిన అభ్యర్థులను తర్వాత దశ(ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌)కు ఎంపిక చేస్తారు.

చదవండి: TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌

ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఈ దశలో నిర్ణీత సమయంలో పురుష అభ్యర్థులు 1600 మీ. పరుగు, మహిళ అభ్యర్థులు 800 మీటర్ల పరుగులో అర్హత సాధించాల్సి ఉంటుంది. అర్హత సాధించిన వారికి లాంగ్‌ జంప్, షార్ట్‌పుట్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారిని మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. 

ఫైనల్‌ రాత పరీక్ష

  • కానిస్టేబుల్స్‌ ఫైనల్‌ రాత పరీక్షలో 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్‌ మార్కులు ఉండవు. ఇందులో అర్థమెటిక్,రీజనింగ్, జనరల్‌ స్టడీస్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పేపరులో అర్హత సాధించిన అభ్యర్థుల మార్కుల మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఏఆర్, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్, టీఎస్‌ఎస్పీ, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్స్‌కు ఫైనల్‌ రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. 
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ ఫైనల్‌ రాత పరీక్షలో 4 పేపర్లుంటాయి. మొదటి రెండు పేపర్లలో ఇంగ్లిష్, తెలుగు భాషాంశాలపై 100 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. 3, 4వ పేపర్లుగా అర్థమెటిక్‌–రీజనింగ్, జనరల్‌ స్టడీస్‌ అంశాలపై 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. ఈ సారి నెగిటివ్‌ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. 


చదవండి: TS Police Syllabus

సిలబస్‌

  • పోలీస్‌ కానిస్టేబుల్‌(సివిల్‌) ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్,అర్థమెటిక్,జనరల్‌సై¯Œ్స, భారతదేశ చరిత్ర, భారతదేశ సంస్కృతి,భారత జాతీయోద్యమం, భౌగోళిక సూత్రాలు, భారతదేశ భౌగోళిక శాస్త్రం,పాలిటీ,ఎకానమీ,జాతీయ,అంతర్జాతీయ సమకాలీన అంశాలు, రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఫైనల్‌ రాత పరీక్షలో ప్రిలిమినరీ పరీక్షలోని సిలబస్‌ అంశాలకు అదనంగా పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించిన విలువలు, సున్నితత్వం, బలహీన వర్గాలు,సామాజిక అవగాహన, భావోద్వేగ తెలివితేటలపై ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. 
  • ఎస్సై (సివిల్‌/తత్సమానం) ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్థమెటిక్, రీజనింగ్‌ అంశాలతోపాటు జనరల్‌ స్టడీస్‌లో జనరల్‌ సై¯Œ ్స, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, భారత దేశ చరిత్ర, జాతీయోద్యమం, భౌగోళిక సూత్రాలు, భారతదేశ భౌగోళిక శాస్త్రం, ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. 
  • ఎస్సై(సివిల్‌/ తత్సమానం) ఫైనల్‌ రాతపరీక్ష పేపర్‌–1లో ఇంగ్లిష్‌కు సంబంధించి యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్, ఇతర భాషా నైపుణ్యాలపై పదోతరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. డిస్క్రిప్టివ్‌ విధానంలో లేఖలు రాయడం, నివేదికలు, వ్యాసరూప, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌పై ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌–2లో తెలుగు/ఉర్దూ భాషా పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌–3లో అర్థమెటిక్, రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌–4 జనరల్‌ స్టడీస్‌లో జనరల్‌ సై¯Œ ్స, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు, భారత దేశ భౌగోళిక శాస్త్రం, ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ, వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన విలువలు, సున్నితత్వం, బలహీన వర్గాలు, సామాజిక అవగాహన, భావోద్వేగ తెలివితేటలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు వస్తాయి. 


చదవండి: TSPSC పరీక్షా విధానంలో మార్పులు.. 900 మార్కులతో గ్రూప్‌ 1

ప్రిపరేషన్‌

  • అర్థమెటిక్‌ విభాగం నుంచి సరాసరి, గ.సా.భా., క.సా.గు.,సంఖ్యలు, దశాంశ భిన్నాలు, వర్గమూలాలు–ఘనమూలాలు, సూక్ష్మీకరణలు, నిష్పత్తి–అనుపాతం,భాగస్వామ్యం, వయసులు, శాతా లు, లాభ–నష్టాలు–తగ్గింపులు, సరళ వడ్డీ, చక్రవడ్డీ, మిశ్రమాలు,కాలం–పని, పంపులు–ట్యాంకులు, పనులు–వేతనాలు, కాలం–దూరం, రైళ్లు, పడవలు–ప్రవాహాలు, ఆటలు–పందేలు అంశాలనుంచి ప్రశ్నలను సాధన చేయాలి. 
  • ప్యూర్‌ మ్యాథ్స్‌ విభాగం నుంచి వైశాల్యాలు, ఘనపరిమాణాలు, రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం,సంభావ్యత,త్రికోణమితి, మాత్రికలు మొద లైన అంశాలు ముఖ్యమైనవి. వీటితోపాటు పదోతరగతిలోపు ప్యూర్‌ మ్యాథ్స్‌ను కూడా చదవాలి. 
  • వెర్బల్‌ రీజనింగ్‌లో కేలండర్‌లు, గడియారాలు, టైమ్‌ సీక్వెన్స్, నంబర్‌ టెస్ట్, ర్యాంకింగ్‌ టెస్ట్, డైరెక్షన్‌ టెస్ట్, నంబర్‌ సిరీస్, మిస్సింగ్‌ నంబర్స్, మ్యాథమెటికల్‌ ఆపరేషన్స్, ఆల్ఫాబెటికల్‌ టెస్ట్, కోడింగ్‌–డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, పజిల్స్‌ టెస్ట్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, అర్థమెటికల్‌ రీజనింగ్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం తదితర అంశాలు ముఖ్యమైనవి. 
  • లాజికల్‌ రీజనింగ్‌లో లాజికల్‌ వెన్‌డయాగ్రమ్స్, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ ఆర్గుమెంట్స్, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ అసంప్షన్స్, అసర్షన్‌ అండ్‌ రీజన్, సిల్లోజియం, డేటా సఫిషియెన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. 
  • నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌లో క్యూబ్స్‌ అండ్‌ డైస్, సిరీస్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం, మిర్రర్‌ ఇమేజెస్, వాటర్‌ ఇమేజెస్, కంప్లీషన్‌ ఆఫ్‌ ఫిగర్స్, పేపర్‌ ఫోల్డింగ్, పేపర్‌ కట్టింగ్, కౌంటింగ్‌ ఫిగర్స్‌ మొదలైనవి ముఖ్యమైనవి. 


చదవండి: Telangana SI, Constable Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. విద్యార్హతలు ఇవే.. ఎంపిక విధానం ఇలా..

నోటిఫికేషన్‌ వివరాలు

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
  • దరఖాస్తులు ప్రారంభం: 2022 మే 2
  • దరఖాస్తులకు చివరితేది: 2022 మే 20
  • వెబ్‌సైట్‌: http://www.tslprb.in

గణిత అంశాలపై భయం వీడాలి

పోలీసు నియామక పరీక్షల్లో గణిత అంశాలైన అర్థమెటిక్, రీజనింగ్‌ సబ్జెక్టులు ప్రధానమైనవి. మ్యాథ్స్‌ నేపథ్యం ఉన్నవారు ఈ విభాగాల్లో సులభంగా మార్కులు సాధించగలుగుతారు. అయితే కొద్దిపాటి సాధన చేస్తే నాన్‌ మ్యాథ్స్‌ అభ్యర్థులు కూడా అర్థమెటిక్, రీజనింగ్‌పై సులభంగా పట్టు పెంచుకోవచ్చు. ముందుగా గణిత అంశాలపై భయాందోళనలను వీడి ప్రాథమిక భావనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జనరల్‌ స్టడీస్‌ అంశాల్లో కరెంట్‌ అఫైర్స్‌ విభాగం ఎంతో ముఖ్యమైంది. కాబట్టి దీనిపై ఎక్కువ దృష్టి సారించాలి. గత ఏడాదిగా చోటుచేసుకున్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈసారి ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్టు ముఖ్యపాత్ర వహించే అవకాశం ఉంది. 800 మీటర్ల పరుగును పురుషులకు 1600 మీటర్లకు పెంచారు. కాబట్టి అభ్యర్థులు ముందునుంచే ఎక్కువగా సాధన చేయాలి. దీనిలో రాణించగలిగితే ఫైనల్‌ రాత పరీక్షకు ముందే 70 శాతం విజయావకాశాలను సొంతం చేసుకున్నవారవుతారు. మాక్‌టెస్టులను రాస్తూ పరీక్ష హాలులో ఎదురయ్యే ఒత్తిడిని జయించేలా సన్నద్ధమవ్వాలి. పరీక్ష రాస్తున్నప్పుడు ఏవైనా క్లిష్టమైన ప్రశ్నలు వస్తే ఆందోళన చెందకుండా మిగతా ప్రశ్నలపై దృష్టిసారించాలి. పరీక్ష హాలులోకి వీలైనంత ముందుగా ప్రవేశించడం ద్వారా పరీక్ష వాతావరణానికి అలవాటు పడి పూర్తి ప్రశాతంగా పరీక్ష రాయొచ్చు. అప్పుడే పోలీసు కొలువు సొంతం చేసుకోవచ్చు. 
– ఎం.తిరుపతి, ఎస్సై–2020 బ్యాచ్‌ (2020లో శిక్షణ పూర్తిచేసుకుని ప్రస్తుతం హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.)

నెగిటివ్‌ మార్కులపై జాగ్రత్తగా ఉండాలి

పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులు ఏమాత్రం సమయం వృథా చేయకుండా పూర్తిస్థాయి ప్రిపరేషన్‌ కొనసాగించాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ను ముందుగా విశ్లేషించుకోవాలి. అంశాలవారీగా సన్నద్ధమవ్వాలి. రివిజన్‌ చేసుకోవడానికి వీలుగా నోట్సు సిద్ధం చేసుకోవాలి. అప్పుడే చదివిన అంశాలను క్రమం తప్పకుండా రివిజన్‌ చేసుకోవడానికి వీలవుతుంది. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి ప్రశ్నల స్థాయిపై అవగాహన ఏర్పరచుకోవాలి. అనువర్తన ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. కాన్సెప్ట్‌తో కూడిన షార్ట్‌కట్స్‌ సాధన చేయాలి. ఈ ఏడాది నుంచి నెగిటివ్‌ మార్కులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు సమాధానాలు గుర్తించేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ‘జతపరచండి’తరహా ప్రశ్నల విషయంలో గందరగోళానికి గురికాకుండా కచ్చితమైన సమాధానాలు గుర్తించాలి. మాక్‌టెస్టులు/గ్రాండ్‌టెస్ట్‌లు రాసి స్వీయవిశ్లేషణ చేసుకోవాలి. తప్పులను సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవాలి. 
– ఉపేంద్ర, సబ్జెక్టు నిపుణులు

​​​​​​​చదవండి: TS Police Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు వయోపరిమితి ఇదే..

Published date : 28 Apr 2022 06:12PM

Photo Stories