Skip to main content

TSPSC Groups Topics: ఉద్యమాలకు ఊపిరి అయిన‌.. సాహిత్యంపై ప‌ట్టు ఉండాల్సిందే ఇలా..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ‌ శాఖల్లోని 80,039 ఉద్యోగాలను నేరుగా భర్తీ(డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) చేయ‌నున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ ఆర్థిక శాఖ 30000వేల‌కు పైగా ఉద్యోగాల భ‌ర్తీకి పచ్చజెండా ఊపి.. నోటిఫికేష‌న్లు కూడా ఇస్తోంది.
నందిని సిధారెడ్డి, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ మాజీ సభ్యులు
నందిని సిధారెడ్డి, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ మాజీ సభ్యులు

 

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ప్రిపేర్‌ అవుతున్న అభ్య‌ర్థుల‌కు అన్ని అంశాలపై పట్టు ఉండాలి. ఒక్క తెలంగాణ ఉద్యమమే కాదు.. ఉద్యమాలకు ఊపిరి అయిన‌ సాహిత్యంపై కూడా ప‌ట్టు సాధించాలి. అప్పుడే ఈ పోటీప‌రీక్ష‌ల్లో మంచి మార్కులు సాధించ‌గ‌ల‌రు. రాష్ట్రంలో సాంఘిక పరిస్థితులు, సామాజిక సమస్యలు, ఇతర అంశాలపై పట్టు సాధించాలి. కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలు అనగానే.. ఇప్పుడు అంతా ఒక్క తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అంశాలపైనే చర్చిస్తున్నారు. కానీ పోటీ పరీక్షల్లో అదొక్కటే కాదు. అది ఒక భాగం మాత్రమే. మిగతా సబ్జెక్టులు ఉన్నాయి. పోటీ పరీక్షలో అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌లోని అంశాలను ప్రణాళిక ప్రకారం విభజించుకొని, వాటికి అవసరమైన పుస్తకాలు తీసుకొని, నోట్స్ సిద్ధం చేసుకొని ముందుకు సాగాలి.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

చరిత్రలో ఏ ఉద్యమం చూసినా దాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది సాహిత్యమే! ఉద్యమ ఆవశ్యకతను తెలియజేసి, ప్రజల్లో చైతన్యం తీసుకురావటంలో సాహిత్యం పాత్ర చాలా కీలకం. తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి రాష్ట్ర‌ ఆవిర్భావం వరకూ.. జరిగిన అన్ని దశల ఉద్యమాలకు ఊపిరిలూదింది సాహిత్యమే! రాజకీయ కారణాలు, ఇతర ఒత్తిళ్ల వల్ల ప్రత్యక్ష ఉద్యమాలు స్తబ్దుగా ఉన్న తరుణంలో సైతం తెలంగాణ కవులు, కళాకారులు తమ రచనలు, ప్రదర్శనల ద్వారా ఉద్యమ స్ఫూర్తిని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సజీవంగా నిలిపారు. ఇలా నిరంతరం.. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కొనసాగేందుకు, నెరవేరేందుకు ఎంతో కృషి చేశారు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రముఖ రచయిత, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ మాజీ సభ్యులు నందిని సిధారెడ్డి. టీఎస్‌పీఎస్సీ సిలబస్‌లో భాగంగా తెలంగాణ సాహిత్యాన్ని ఎలా అధ్యయనం చేయాలో వివరిస్తున్నారు సిధారెడ్డి మీకోసం.. 

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా..

తెలంగాణలో వచ్చిన సాహిత్యాన్ని తెలంగాణ రైతాంగ పోరాటం, విశాలాంధ్ర ఉద్యమం, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, విప్లవ ఉద్యమం, 1996 మలిదశ ఉద్యమ దశలుగా విభజించుకోవచ్చు. ప్రాచీన సాహిత్యంతో పోల్చితే ఆధునిక సాహిత్యంలో ప్రక్రియ వైవిధ్యంగా ఉంటుంది. సాహిత్యం అంటే కేవలం కవిత్వమే కాకుండా.. నవల, కథ, వ్యాసంగా ఉంటుంది. తెలంగాణ సమాజం ప్రతిసారి ఏదో ఒక ఉద్యమాల్లో ఉంటూ వచ్చింది. సమాజంలో జరుగుతున్న పీడనలపై ఉద్యమించింది. ఇక్కడ ఉన్న రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలొచ్చాయి. వీటి కారణంగా సాహిత్యం ఉత్పన్నమైంది. రచయిత సమాజంలో భాగం కాబట్టి సమాజంలో జరిగిన ఉద్యమాల ప్రభావం రచయితలపై ఉంది. ఇలా ప్రజా ఉద్యమాలే ప్రేరణగా.. ప్రజలు సాహసించి పీడనకు వ్యతిరేకంగా పోరాడటానికి రచయితలు విస్తృతంగా సాహిత్యం సృష్టించారు.

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

తొలి దశలో దేశవ్యాప్తంగా..
20వ శతాబ్దం తొలి దశలో దేశవ్యాప్తంగా ఆధునిక భావాలు విస్తరించడం వల్ల తెలంగాణలో కూడా చైతన్యభావాలు వెల్లివిరిశాయి. ఇక్కడి పీడన నుంచి విముక్తి పొందడానికి సాహిత్య కృషి మొదలైంది. 1901లో రావిచెట్టు రంగారావు, మునగాల రాజా, నాయని వెంకట రంగారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు కృషి వల్ల ‘శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం’ గ్రంథాలయం ఏర్పాటైంది. దీని ప్రేరణతో 1904లో హన్మకొండలో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపించారు. క్రమంగా గ్రంథాలయోద్యమం ప్రారంభమైంది. అప్పటికీ తెలంగాణ ప్రాంతంలో అక్షరాస్యత 3 నుంచి 6 శాతం మధ్య ఉంది. గ్రంథాలయోద్యమం ద్వారా విద్యావ్యాప్తికి కృషి జరిగింది. 1921 నవంబర్ 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన సభలో ఆలంపల్లి వెంకట రామారావు తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తే కార్వే అనే మరాఠా పండితుడు అందుకు అనుమతించలేదు. దీంతో తెలుగు భాషాభిమానులు ఏకమై ప్రత్యేకంగా నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా తెలుగు భాషా అభిమానాన్ని పెంచడానికి కృషి మొదలైంది. 1930లో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన మొదటి ఆంధ్ర మహాసభ జోగిపేటలో జరిగింది. ఆయన సంపాదకీయంలో గోల్కొండ పత్రిక వెలువడేది. 1932లో ముడుంబై వెంకట రాఘవాచార్యులు అనే ఆంధ్ర పండితుడు తెలంగాణలో ‘కవులు పూజ్యం(శూన్యం)’ అని విమర్శించాడు. సమాధానంగా సురవరం ప్రతాపరెడ్డి 354 మంది కవుల రచనలతో గోల్కొండ కవుల సంచికను 1934లో విడుదల చేశాడు. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా సంపాదకీయాలు రాశాడు.

TSPSC: 9,168 గ్రూప్‌-4 పోస్టులకు మే చివ‌రికి నోటిఫికేషన్‌..! స్థానికులకే 95శాతం ఉద్యోగాలు..

నిజాం దుర్మార్గాలను..
కాళోజీ నారాయణరావు ‘నా గొడవ’ పేరుతో నిజాం దుర్మార్గాలను ఎదిరించారు. మగ్దూం మొహియుద్దీన్ ‘యే జంగ్ హై జంగే ఆజాదీ’, ‘ఏక్ చవేళీ క మండ్వా తలేమే’ రచనలు తెలంగాణ పోరాటాన్ని చిత్రించాయి. దాశరథి కృష్ణమాచార్యులు ‘అగ్నిధార’; నా తెలంగాణ కోటి రతనాల వీణ పాట, బండి యాదగిరి ‘బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి..’ పాటను రాశారు. సుద్దాల హనుమంతు ‘పల్లెటూరి పిల్లగాడ’, ‘వెయ్యర వెయ్యి’ పాటలు ప్రచారంలో ఉన్నాయి. వట్టికోట ఆళ్వారుస్వామి గ్రంథాలయంలో చిరుద్యోగిగా జీవితం ఆరంభించి గ్రంథాలయోద్యమానికి నాయకత్వం వహించాడు. ఆయన రాసిన ‘ప్రజల మనిషి’ నాటి తెలంగాణ ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తుంది. అలాగే ‘గంగూ’ అనే నవల ద్వారా నిజాం రాష్ట్రంలో ప్రజల స్థితిగతులను వివరించారు. అప్పటి సమకాలీన రాజకీయ అంశాలపై వ్యాఖ్యానిస్తూ ‘రామప్ప రభస’ రచనను వెలువరించారు. ‘దేశోద్ధారక గ్రంథమాల’ పుస్తక ప్రచురణ సంస్థను ఏర్పాటు చేసి 32 పుస్తకాలు ప్రచురించారు. అలాగే కె.సి.గుప్తా ‘అణా గ్రంథమాల’ ప్రచురణ సంస్థ స్థాపించి దీని ద్వారా అణాకు(ఆరు పైసలు) ఒక పుస్తకాన్ని ఇచ్చారు.

TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట‌ కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల సూచ‌న‌లు- సలహాలు ..

‘జైలు లోపల’..
సురవరం ప్రతాపరెడ్డి ‘సంఘాల పంతులు’, ‘గ్యారా ఖద్దు బారా కొత్వాల్’ కథల ద్వారా నిజాం పాలనలోని దోపిడీని వివరించారు. వట్టికోట ఆళ్వారుస్వామి జైలు జీవితం అనుభవించి అక్కడి అనుభవాలతో ‘జైలు లోపల’ అనే పేరుతో కథల సంపుటి రాశారు. దీనిలో నేరస్థుల జీవనం గురించి వివరించారు. తెలుగులో జైలు జీవితం మీద రాసిన మొదటి రచన ఇది.

అదేవిధంగా ఆవుల పిచ్చయ్య ‘వెట్టి చాకలి దినచర్య’, ‘ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాగిన జమీందార్’ అనే కథలు రాశారు. అడ్లూరి అయోధ్య రామకవి ‘తెలంగాణ మంటల్లో’ అనే కథా సంపుటిని వెలువరించారు. పీవీ నరసింహరావు ‘గొల్ల రామవ్వ’ కథ ప్రసిద్ధమైంది. భాస్కరభట్ల కృష్ణారావు ‘ఇజ్జత్’ అనే రచన చేశారు. దాశరథి ‘నిప్పు పూలు’, భాగ్యరెడ్డి వర్మ ‘వెట్టి మాదిగ’, నెల్లూరి కేశవస్వామి ‘యుగాంతం’ ముఖ్యమైనవి. దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్లు’, ‘మోదుగుపూలు’, జనపథం నవలలు వెలువరిచారు. బీఎన్ రెడ్డి ‘ఆయువు పట్టు’ తదితర రచనలు రైతాంగ పోరాటాన్ని చిత్రీకరించాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ముందు హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలున్నాయి. ఒకే భాష - ఒకే రాష్ట్రం పేరుతో రెండు తెలుగు మాట్లాడే రాష్ట్రాలను కలపాలనే డిమాండ్‌తో విశాలాంధ్ర ఉద్యమం ఆరంభమైంది. ఈ సమయంలోనూ ఉద్యమంపై సాహిత్యం ప్రభావం చాలా ఉంది. దాశరథి రచించిన మహా ఆంధ్రోదయం, పునర్నవం కవితా సంపుటిలు; వరదాచార్యులు ‘మణిమాల’, కాళోజీ నారాయణరావు కవితలూ ఇందుకు నిదర్శనాలు.

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో...
సమైక్య రాష్ట్రంలో తమకు సమప్రాధాన్యం దక్కటం లేదనీ.. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నట్లు భావించిన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ బాటపట్టారు. దీనికోసం విద్యార్థులు, యువకులు పెద్దఎత్తున ఉద్యమించారు. ఈ సమయంలోనూ సాహిత్యం ప్రభావం ఉద్యమంపై ఉంది. మొదటగా కాళోజీ ‘తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా’, ‘ఎవరనుకున్నారు ఇట్లా అవునని ఎవరనుకున్నారు’, ‘రెండున్నర జిల్లాలదే దండి భాష అయినప్పుడు, తక్కినోళ్ల యాస తొక్కి నొక్కబడ్డప్పుడు’ మొదలైన రచనలు చేశారు. యువ రచయితలైన జగదీశ్వర స్వామి, ఎస్వీ సత్యనారాయణ, అణువుల శ్రీహరి కవితలతో ‘విప్లవ శంఖం’ సంపుటి వెలువరించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన రుక్నుద్దీన్ ‘ఢంకా’ కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వంలో ‘1969 ప్రత్యేక తెలంగాణ కవిత్వం’ అనే సంకలనం వెలువడింది.

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

దీని ప్రభావంతో తెలంగాణలో సాహిత్యం విస్తృతంగా..
సమాజంలో ఉన్న అసమానతలు, అణిచివేతలు యువకుల్లో అగ్నిజ్వాలలు రగిలించాయి. నక్సల్‌బరీ పంథాలో శ్రీకాకుళం, కరీంనగర్‌లో ఉద్యమం విస్తరించింది. భూస్వాములు, దొరల పీడనలను ఎదురించి వాళ్లను తొలగించడమే లక్ష్యంగా ఉద్యమం సాగింది. దీని ప్రభావంతో తెలంగాణలో సాహిత్యం విస్తృతంగా వెలువడింది.

కవిత్వం :

 • చెరబండ రాజు(బద్ధం భాస్కర్‌రెడ్డి): పల్లవి, దిక్సూచి, కాంతియుద్ధం, గౌరమ్మ కలలు మొదలైన సంపుటాలు విడుదల చేశాడు.
 • జ్వాలముని (రాఘావాచార్యులు): ఓటమి తిరుగుబాటు
 • నిఖిలేశ్వర్: మండుతున్న తరం సంపుటాలు వెలువరించారు.
 • ఇదే కాలంలో వరంగల్ నుంచి నవకవులు తిరగబడు అనే సంకలనం వెలువరించారు (వరవరరావు, లోచన్, పెండ్యాల కిషన్‌రావు, టంకశాల అశోక్ మొదలైన వారు)
 • వరవరరావు: భవిష్యత్తు చిత్రపటం, ముక్తకంఠం, స్వేచ్ఛా మొదలైన సంపుటాలు రాశారు.
 • ‘భవిష్యత్తు చిత్రపటం’ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
 • అలిశెట్టి ప్రభాకర్: ‘రక్తరేఖ’, ‘మరణం చివరి చరణం కాదు’

TSPSC Group-1 Syllabus: 503 పోస్టులు.. గ్రూప్‌–1 ప‌రీక్ష‌ల‌ సిల‌బ‌స్ ఇదే..

విప్లవ కథలు :

 • అల్లం రాజయ్య: ఎదురు తిరిగితే, సృష్టికర్తలు, మధ్యవర్తులు, అతడు, మనిషి లోపలి విధ్వంసం.
 • తుమ్మేటి రఘోత్తమరెడ్డి: చావు విందు, జాడ.
 • బి.ఎస్.రాములు: పాలు, అడవిలో వెన్నెల, జరిమానా.
 • బోయ జంగయ్య: గొర్రెలు, దొంగలు, హెచ్చరిక
 • దేవరాజు మహారాజు: పాలు ఎర్రబడ్డాయి, కోళ్లపందెం, కడుపుకోత
 • ఆడేపు లక్ష్మీపతి: నాలుగు దృశ్యాలు, జీవన్ముృతుడు

విప్లవ ఉద్యమ నవలలు : 

 • చెరబండరాజు: మాపల్లె, ప్రస్థానం, నిప్పురాళ్లు, దారిపోడవునా
 • అల్లం రాజయ్య: కొలిమంటుకున్నది, ఊరు, అగ్నికణం, వసంతగీతం, కొమరం భీం.
 • రఘోత్తమరెడ్డి: నల్ల వజ్రం
 • కేవీ నరేందర్: నల్ల సముద్రం, పి. చంద్: ‘శేషగిరి’,
 • జాతశ్రీ: ‘సింగరేణి మండుతోంది’
 • బి.ఎస్.రాములు: బతుకుపోరు

పాటలు :

 • చెరబండరాజు: ‘కొండల పగలేసిన...’
 • జనసేన: ‘వడ్డెరోల మండి మేము’
 • గద్దర్: ‘సిరిమల్లె చెట్టుకింద’, ‘లాల్ సలాం లాల్ సలాం’
 • గూడ అంజయ్య: ‘ఊరు మనదిరా’, ‘బద్రం కొడుకో’

తెలంగాణ అస్తిత్వ ఉద్యమం (మలిదశ) :
1996 నుంచి జరిగిన ప్రత్యేక పోరాటంలో సాహిత్య కృషి చాలా ఉంది.

కవిత్వం :

 • జూలూరి గౌరీ శంకర్ సంపాదకత్వంలో పొక్కిలి;
 • సుంకిరెడ్డి నారాయణ రెడ్డి- అంబటి సురేంద్రరాజు సంపాదకత్వంలో మత్తడి;
 • మంజీరా కవులు- ఎడపాయలు; వేముగంటి మురళి సంపాదకత్వంలో ‘మునుం’;
 • స్కైబాబా సంపాదకత్వంలో జాగో- జగావో.

పాటలు..

 • అంద్శై జయజయహే..., చూడు తెలంగాణ.
 • గోరటి వెంకన్న: ఇద్దరం విడిపోతే భూమి, రేలాదూళ .
 • గద్దర్: అమ్మ తెలంగాణ, పొడుస్తున్న పొద్దు మీద.
 • గూడ అంజయ్య: అయ్యోడివా నువ్వు, రాజన్నా ఓరి..
 • జయరాజు: వానమ్మవానమ్మ..
 • నందిని సిధారెడ్డి: నాగేటి సాలళ్ల, జోహార్లు జోహార్లు..
 • దరువు ఎల్లయ్య: అమరులారా వందనం..
 • మెట్టపల్లి సురేందర్: రాతి బొమ్మల్లోనా..

కథ : 

 • పెద్దింటి అశోక్‌కుమార్: కాగుబొత్త, తెగిన బంధాలు, తేగారం.
 • చైతన్యప్రకాశ్: రేణా.
 • జూకంటి జగన్నాథం: వలస.
 • జాజుల గౌరి: మన్ను బువ్వ.
 • బెజ్జారం రవీందర్: నిత్య గాయాల నది, జింబో వేములవాడ కథలు.
 • అఫ్సర్: తెలంగి పత్త, గోరిమా
 • స్కైబాబా కథలు
 • కేవీ నరేందర్ కథలు
 • కాసుల ప్రతాపరెడ్డి కథలు
 • పి.చంద్- భూ నిర్వాసితులు

నవలలు :

 • పెద్దింటి అశోక్‌కుమార్: ఎడారి మంటలు, దాడి, జిగిరి.
 • కాళో మల్లయ్య: భూమి పుత్రుడు, సాంబయ్య చదువు.
 • శ్రీనివాస్ గౌడ్: బతుకుతాడు.
 • వేముల ఎల్లయ్య: కక్క.​​​​​​

వన్నెతెచ్చిన కవులు..

 • డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించిన ‘విశ్వంభర’ జ్ఞాన్‌పీఠ్ బహుమతి పొందిన కావ్యం
 • డాక్టర్ ఎన్.గోపి రచించిన ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గెలుచుకుంది.
 • అంపశయ్య నవీన్ రచించిన ‘కాలరేఖలు’ నవల కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందింది.
 • దాశరథి కృష్ణామాచార్యులు రచించిన ‘తిమిరంతో సమరం’ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

కావ్యాలు :​​​​​​​

 • శిరస్సు కవులు: నల్ల వలస
 • జూలూరి గౌరీ శంకర్: నా తెలంగాణ
 • అల్లం నారాయణ: యాది మానాది
 • సుంకిరెడ్డి నారాయణరెడ్డి: దాలి
 • కాంచనపల్లి: తండ్లాట
 • పరమాత్మ: డిసెంబర్ 9
 • పసునూరి రవీందర్: లడాయి
 • వనపట్ల సుబ్బయ్య: వొల్లెడ, మశాల్

TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేర‌య్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చ‌దివారంటే..

Published date : 23 May 2022 05:43PM

Photo Stories