Skip to main content

TS Police Exams Preparation Tips: ప్రిలిమ్స్ కొట్టాలంటే.. పదును పెట్టాల్సిందే ఇలా..!

TS Police Exams Preparation Tips and exam datas details here
TS Police Exams Preparation Tips and exam datas details here

తెలంగాణ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ జాబ్స్‌కు లక్షల సంఖ్యలో దరఖాస్తులు. నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇప్పుడిక ప్రిపరేషన్‌కు మరింత పదునుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే.. ఎస్‌ఐ తత్సమాన కేడర్‌ పోస్ట్‌లకు ఆగస్ట్‌ 7న.. కానిస్టేబుల్‌ తత్సమాన పోస్ట్‌లకు ఆగస్ట్‌ 21న.. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. టీఎస్‌ పోలీస్‌ ప్రిలిమినరీ పరీక్షలో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, పరీక్ష విధానం, తదితర అంశాలపై విశ్లేషణ...

TS Police Exams : సాక్షి ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో.. పోలీసు కానిస్టేబుల్స్ బుక్‌లెట్.. ఈజీగా ఆర్థ‌మ‌య్యేలా..

  • ఆగస్ట్‌ 7న ఎస్‌ఐ, 21న కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష
  • ప్రిలిమ్స్‌లో నెగ్గడమే అత్యంత కీలకం
  • ప్రిపరేషన్‌కు మరింత పదును పెట్టాల్సిన ఆవశ్యకత
     
  • 2,47,630: మొత్తం 554 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్ట్‌లకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య. 
  • 9,54,064: మొత్తం 16,321 సివిల్‌/తత్సమాన కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుల్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ తత్సమాన పోస్ట్‌లకు వచ్చిన దరఖాస్తులు.
  • ఈ పోస్ట్‌లకు తొలి దశలో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. అంటే.. ప్రిలిమ్స్‌కు పోటీ ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకాలం రాత పరీక్షకు ప్రిపరేషన్‌తోపాటు,ఫిజికల్‌ టెస్ట్‌లలో విజయానికి అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత సమయంలో తమ వ్యూహాన్ని మార్చుకొని.. పూర్తిగా ప్రిలిమ్స్‌పై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

రివిజన్‌కు ప్రాధాన్యం

ప్రస్తుత సమయంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్ట్‌ల అభ్యర్థులు రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు సిలబస్‌ అంశాల ప్రిపరేషన్‌కు కనీసం ఆరు గంటలు, ఆ తర్వాత వాటి రివిజన్‌కు మరో గంట లేదా రెండు గంటలు కేటాయించాలి. పరీక్షకు పది రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌పై దృష్టిపెట్టాలి.

చ‌ద‌వండి: TS Police Recruitment: ప్రిలిమ్స్‌ పరీక్ష విధానం.. విజయం సాధించడానికి మార్గాలు..

వెయిటేజీకి అనుగుణంగా

అభ్యర్థులు ఆయా సిలబస్‌ అంశాలను రివిజన్‌ చేసేటప్పుడు వెయిటేజీ ఆధారంగా అడుగులు వేయాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలను గమనిస్తూ.. వాటికి సమకాలీనంగా, అదే విధంగా సబ్జెక్ట్‌ పరంగా ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలి. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా నిర్వహించే ఎస్‌ఐ పోస్ట్‌ల అభ్యర్థులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. డిగ్రీ స్థాయి అకడమిక్‌ అంశాలను ప్రస్తుత పరిణామాలతో బేరీజు వేసుకుంటూ చదవాలి.

షార్ట్‌ నోట్స్‌

ముఖ్యాంశాలతో రాసుకున్న షార్ట్‌ నోట్స్‌లు లేదా తాము చదివిన మెటీరియల్‌లో హైలైట్‌ చేసుకున్న పాయింట్లను ఆధారంగా చేసుకుని పునశ్చరణ చేయాలి. ఫలితంగా ఒక అంశాన్ని పూర్తిగా చదవాల్సిన అవసరం లేకుండా.. అందులోని ముఖ్యాంశాలను రివైజ్‌ చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా ఆయా ముఖ్యాంశాలకు సంబంధించి.. సమకాలీన అంశాలను సమ్మిళితం చేసుకుంటూ చదవడం మరింత ఉపయుక్తంగా ఉంటుంది. 

చ‌ద‌వండి: TS Police Constable Exam Practice Tests (Prelims)

మోడల్, మాక్‌ టెస్ట్‌లు

ప్రస్తుత సమయంలో అభ్యర్థులు మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లకు హాజరు కావడం మేలు చేస్తుంది. ప్రతి రోజూ సిలబస్‌ అంశాల పునశ్చరణ లేదా అభ్యసనం పూర్తయ్యాక.. పరీక్షలో పేర్కొన్న విభాగాలు, సబ్జెక్ట్‌ల వారీగా మోడల్, మాక్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి. వాటి మూల్యాంకన ఆధారంగా తాము ఇంకా నైపుణ్యం పెంచుకోవాల్సిన అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. వాటిపై పట్టు సాధించేలా కృషి చేయాలి. ఈసారి నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమలో ఉంది. కాబట్టి పూర్తి స్పష్టతతో సమాధానాలు గుర్తించేలా సన్నద్ధమవ్వాలి.

ఇవి చదవండి

  • ఎస్‌ఐ పరీక్షలో.. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమ దశలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ రాత పరీక్షలో సైతం తెలంగాణ ప్రాధాన్యం గల అంశాలని క్లుప్తంగా పేర్కొన్నారు. వీటిలోనూ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమ దశల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. 
  • హిస్టరీకి సంబంధించి భారత చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, చరిత్ర గతిని మార్చిన సంఘటనలు, భారత స్వాతంత్య్ర ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
  • జాగ్రఫీలో రాణించేందుకు భారత భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, సముద్ర తీర ప్రాంతాలు, అడవులు, పంటలు, సాగు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • ఎకానమీలో కోర్‌ ఎకనామీ అంశాలతోపాటు సమకాలీన అంశాలు, దేశ ఆర్థిక రంగంలో అమలవుతున్న కొత్తవిధానాలపై స్పష్టత తెచ్చుకోవాలి.
  • పాలిటీలో రాజ్యాంగం, రాజ్యాంగ రూపకర్తలు, రాజ్యంగంలోని ముఖ్యమైన అధికరణలు, ప్రకరణలు వంటి అంశాలతోపాటు తాజా రాజ్యాంగ సవరణలు, వాటి ఉద్దేశం, ప్రభావం వంటి అంశాలు తెలుసుకోవాలి.
  • కరెంట్‌ అఫైర్స్‌లో.. జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న తాజా పరిణామాలు(ఉదా: క్రీడలు–విజేతలు, సదస్సులు, సమావేశాలు–తీర్మానాలు తదితర) గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా జాతీయ భద్రతకు సంబంధించి ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • అర్థమెటిక్‌లోని ముఖ్యాంశాలుగా భావించే సగటులు, కసాగు, గసాభా, సంఖ్యలు, వర్గ మూలాలు, ఘన మూలాలు, నిష్పత్తులు, భాగస్వామ్యం, వయసులు, శాతాలు, లాభ–నష్టాలు, చక్ర వడ్డీ, సరళ వడ్డీ, కాలం–దూరం, కాలం–పని వంటి వాటిపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మ్యాట్రిసెస్, సెట్స్‌–రిలేషన్స్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ చేయాలి. 
  • రీజనింగ్‌కు సంబంధించి.. నంబర్‌ సిరీస్, మిస్సింగ్‌ నెంబర్స్, కోడింగ్‌–డీకోడింగ్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, బ్లడ్‌ రిలేషన్స్‌ వంటి వాటిపై పట్టు సాధించాలి. వెన్‌ డయాగ్రమ్స్, అసెంప్షన్‌ అండ్‌ రీజన్, ఆర్గ్యుమెంట్, సిలాజిజమ్, డేటా సఫిషియన్సీ విభాగాల్లో పట్టుతో వెర్బల్‌ రీజనింగ్‌లో రాణించే అవకాశం ఉంది. ఆడ్‌మన్‌ ఔట్, డైస్‌ అండ్‌ క్యూబ్స్, వెన్‌ డయాగ్రమ్స్‌లపై పట్టుతో నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌లో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది. 
  • తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్య అంశాల పరంగా.. ముల్కీ నిబంధనలు, శ్రీబాగ్‌ ఒడంబడిక, పెద్ద మనుషుల ఒప్పందం, గిర్‌గ్లానీ కమిషన్, ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ నివేదికలను అధ్యయనం చేయాలి. అదే విధంగా తెలంగాణ మలి దశ ఉద్యమంలోని ముఖ్య ఘట్టాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తెలంగాణ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, పంటలు, రవాణా సౌకర్యాలు, రాష్ట్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, నీటి పారుదల వ్యవస్థల గురించి బాగా చదవాలి. తెలంగాణ ఎకానమీ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి చేయూతనిచ్చే రంగాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. పంటలు– దిగుబడి, తాజా ఆర్థిక సర్వేలో ఈ ప్రాంతం గురించి పేర్కొన్న ముఖ్య అంశాలన్నింటిపై దృష్టి సారించాలి.
  • ఇలా పునశ్చరణకు ప్రాధాన్యమిస్తూ.. ఆయా అంశాలకు లభించే వెయిటేజీ ఆధారంగా సబ్జెక్ట్‌ నైపుణ్యాలు కూడా సొంతం చేసుకుంటే..æ ప్రిలిమినరీ పరీక్షలో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.

చ‌ద‌వండి: TS Police Jobs: ఇవి పాటిస్తూ.. చదివితే కచ్చితంగా పోలీసు ఉద్యోగం మీదే..

ప్రిలిమినరీ పరీక్ష విధానం

  • కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష.. ఎనిమిది విభాగాల(ఇంగ్లిష్‌; అర్థమెటిక్‌; జనరల్‌ సైన్స్‌; భారత దేశ చరిత్ర–సంస్కృతి–భారత జాతీయోద్యమం; భౌగోళిక శాస్త్ర సిద్ధాంతాలు–భారత భౌగోళిక శాస్త్రం–పాలిటీ–ఎకానమీ; జాతీయ–అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు; రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ; తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం కలిగిన అంశాలు) నుంచి 200 ప్రశ్నలతో 200 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. 
  • ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షను రెండు విభాగాల్లో నిర్వహిస్తారు. మొదటి విభాగంలో అర్థమెటిక్‌ అండ్‌ టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. రెండో విభాగంగా జనరల్‌ స్టడీస్‌ నుంచి మరో 100 ప్రశ్నలు అడుగుతారు. 
  • నెగెటివ్‌ మార్కింగ్‌ విధానంలో ప్రతి అయిదు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు. 

ప్రిలిమినరీ పరీక్ష – ముఖ్య తేదీలు

  • ఆగస్ట్‌ 7న ఎస్‌ఐ, తత్సమాన పోస్ట్‌లకు ప్రిలిమినరీ రాత పరీక్ష
  • ఆగస్ట్‌ 21న కానిస్టేబుల్‌ తత్సమాన పోస్ట్‌లకు ప్రిలిమినరీ రాత పరీక్ష.
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: ఎస్‌ఐ ప్రిలిమ్స్‌కు జూలై 30 నుంచి, కానిస్టేబుల్‌ పోస్ట్‌ల ప్రిలిమ్స్‌కు ఆగస్ట్‌ 10 నుంచి 
  • వివరాలకు వెబ్‌సైట్‌: www.tslprb.in

చ‌ద‌వండి: Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్‌ ఇదే.. ఇలా చదివితే..

Published date : 25 Jul 2022 04:55PM

Photo Stories