Skip to main content

TS Police Jobs: ఇవి పాటిస్తూ.. చదివితే కచ్చితంగా పోలీసు ఉద్యోగం మీదే..

తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు.. పలు విభాగాల్లో 16,614 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెల్సిందే.
CV Anand IPS
CV Anand IPS

దీంతో పోలీసు ఉద్యోగాలను సాధించేందుకు అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు మరింత పదును పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచన.. స‌లహాలు మీకోసం..

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

ఇవి పాటిస్తూ చదివితే కచ్చితంగా పోలీసు ఉద్యోగం మీదే..
సమయపాలన పాటిస్తూ చదివితే కచ్చితంగా పోలీసు ఉద్యోగం సాధించవచ్చని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ అనంద్  అన్నారు. హైదరాబాద్ నగర పోలీస్ శాఖ  ఆధ్వర్యంలో పోలీసు నియామక పరీక్ష కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్‌లో ఆయన ప్రారంభించారు. 

పోటీ పరీక్షలు అంటేనే..
ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. సమయపాలన పాటిస్తూ చదివితే కచ్చితంగా పోలీసు ఉద్యోగం సాధించగలదని అభ్యర్థులకు సూచించారు. సీఎం కేసీఆర్ 80 వేల పోస్టులను పోస్టులు ప్రకటించాన్నారు. పోలీస్ శాఖలో 18 వేలు జాబ్స్ ఉన్నాయన్నారు. సినిమాలు చూసి ఇంప్రెస్ అయి పోలీస్ కావాలని అనుకోవద్దు. పోలీసులు చట్ట ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. పోలీసు ఉద్యోగం బాధ్యతాయుతమైనదన్నారు. పోటీ పరీక్షలు అంటేనే పోటీతత్వం అధికంగా ఉంటుందన్నారు. దానికి అనుగుణంగా మీరు సిద్ధం కావాలని కోరారు. నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్‌ మార్కులు ఉన్నాయ్‌.. జాగ్రత్తగా రాయండిలా..

నిత్యం యోగా, వాకింగ్, రన్నింగ్ తప్పకుండా..
పోలీస్ ఉద్యోగాల‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నిత్యం యోగా, వాకింగ్, రన్నింగ్ తప్పకుండా చేయాలని అంతర్జాతీయ యోగా ప్రొఫెసర్ డాక్టర్ తాటికొండ వెంకట రాజయ్య సూచించారు. సిద్దిపేటలో  పోలీస్ నియామకాలకు గురించి బీజేఆర్ భవన్ లో నిర్వహిస్తున్న పోలీస్ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగాసనాలు, ప్రాణాయామం, అనులోమ, విలోమ మరియు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తో పాటు మెదడుకు మేతనిచ్చే మనసు ప్రశాంతంగా ఉంచే యోగాసనాల గురించి వివరించారు. అభ్యర్థులతో వాటిని ప్రాక్టికల్‌గా చేయించారు.

TS Government Jobs: మరో 677 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా.. 
ప్రొఫెసర్ వెంకట్రామయ్య మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ రావు, పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదవి ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులకు సూచించారు. ప్రతిరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, వాకింగ్, రన్నింగ్, తప్పకుండా చేయాలన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఆరోగ్యమే మహాభాగ్యం అని వివరించారు.

​​​​​​తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి

తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
➤ కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
➤ కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
➤ ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
➤ వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
➤ కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027 

Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్‌ ఇదే.. ఇలా చదివితే..

ఎస్సై పోస్టుల వివరాలు ఇవే..

TS SI Posts


☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సివిల్‌): 414
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఆర్‌): 66
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌)(పురుషులు): 5
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)(పురుషులు): 12
☛ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 26
☛ డిప్యూటీ జైలర్‌(పురుషులు): 8
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 22
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌)(పురుషులు): 3
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో): 8
మొత్తం ఎస్సై పోస్టులు: 587

TS Police Jobs: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. ఈ అర్హతలు తప్పనిసరి

​​​​​​​ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events

Published date : 09 May 2022 03:15PM

Photo Stories