TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నాయ్.. జాగ్రత్తగా రాయండిలా..
నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ను ముందుగా విశ్లేషించుకోవాలి. అంశాలవారీగా సన్నద్ధమవ్వాలి. రివిజన్ చేసుకోవడానికి వీలుగా నోట్సు సిద్ధం చేసుకోవాలి. అప్పుడే చదివిన అంశాలను క్రమం తప్పకుండా రివిజన్ చేసుకోవడానికి వీలవుతుంది. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి ప్రశ్నల స్థాయిపై అవగాహన ఏర్పరచుకోవాలి. అనువర్తన ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్‌తో కూడిన షార్ట్‌కట్స్ సాధన చేయాలి. ఈ ఏడాది నుంచి నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు సమాధానాలు గుర్తించేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ‘జతపరచండి’ తరహా ప్రశ్నల విషయంలో గందరగోళానికి గురికాకుండా కచ్చితమైన సమాధానాలు గుర్తించాలి. మాక్‌టెస్టులు/గ్రాండ్‌టెస్ట్‌లు రాసి స్వీయవిశ్లేషణ చేసుకోవాలి. తప్పులను సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవాలి.
- ఉపేంద్ర, సబ్జెక్టు నిపుణులు
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్(సివిల్): 4965
➤ కానిస్టేబుల్(ఏఆర్): 4423
➤ కానిస్టేబుల్(ఎస్‌ఏఆర్‌సీపీఎల్)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్): 390
➤ ఫైర్‌మన్ (డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్): 610
➤ వార్డర్(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్(ఐటీ అండ్ కమ్యూనికేషన్స్): 262
➤ కానిస్టేబుల్(మెకానిక్స్)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్(డ్రైవర్స్)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్ పోస్టులు: 16,027
చదవండి: TS Police Syllabus
ఎస్సై పోస్టుల వివరాలు ఇవే..
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(సివిల్): 414
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఆర్): 66
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఏఆర్ సీపీఎల్)(పురుషులు): 5
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్)(పురుషులు): 12
☛ స్టేషన్ ఫైర్ ఆఫీసర్(డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్): 26
☛ డిప్యూటీ జైలర్(పురుషులు): 8
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(ఐటీ అండ్ కమ్యూనికేషన్స్): 22
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(పోలీస్ ట్రాన్స్‌పోర్ట్)(పురుషులు): 3
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(ఫింగర్ ప్రింట్ బ్యూరో): 8
మొత్తం ఎస్సై పోస్టులు: 587