Skip to main content

TS Government Jobs: మరో 677 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్‌ని విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా ఆబ్కారీ శాఖలోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
prohibition and excise department notification
TS Government Jobs Notification

ఈ మేరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ మ‌రో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. అబ్కారీ శాఖలో 614 కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఇప్ప‌టికే తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ).. పలు విభాగాల్లో 16,614 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెల్సిందే.

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా..
☛ మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్​లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
☛ జనరల్​ కోటాలో 138 పోస్టులు, ఇందులో 90 పోస్టులు మహిళలకు కేటాయింపు
☛ ఈడబ్ల్యుఎస్ ​కోటాలో 41 జనరల్, 19 మహిళలకు రిజర్వు
☛ ఎక్స్ సర్వీస్​మెన్​కోసం జనరల్​ కోటాలో 16 పోస్టులు, ఎంఎస్‌పీ కోటాలో జనరల్‌లో 8 పోస్టులు, బీసీ ఏ కింద 32 జనరల్, 15 మహిళలకు, బీసీ బీలో 32 జనరల్, 22 మహిళ,
☛ బీసీ సీలో 9 జనరల్, బీసీ డీలో 25 జనరల్, బీసీ ఈలో 14 జనరల్, ఎస్సీలో 59 జనరల్, 33 మహిళలకు, ఎస్టీ కోటాలో 24 జనరల్, 14 మహిళలకు రిజర్వు 

TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చ‌దివితే పోలీస్ ఉద్యోగం మీదే..!

ద‌ర‌ఖాస్తు ఫీజు వివరాలు ఇలా..
➤ బీసీ, ఓసీలకు రూ. 800, 
➤ ఎస్సీ, ఎస్టీలు రూ. 400

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

 

Published date : 28 Apr 2022 10:11PM
PDF

Photo Stories