Skip to main content

TS Police Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు వయోపరిమితి ఇదే..

Police Jobs

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ వచ్చేసింది. పోలీసుశాఖతోపాటు మరో 3 విభాగాల్లో 16,614 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏప్రిల్‌ 25న తీపికబురు చెప్పింది. ఎస్సై పోస్టులు, ఇతరవిభాగాల్లో తత్సమాన హోదా ఉండే పోస్టులు కలిపి 587 ఖాళీలను.. కానిస్టేబుల్, తత్సమాన హోదా ఉండే 16,027 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేశామని బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌రావు ప్రకటించారు.

Telangana Govt Jobs: 16,614 పోలీసు కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పోస్టుల వివరాలు ఇలా..

​​​​​​తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి

వచ్చే నెల 2 నుంచి దరఖాస్తులు
పోలీస్, ఫైర్, ఎస్పీఎఫ్, జైళ్లశాఖలో భర్తీ చేయనున్న పోస్టులకు వచ్చే నెల (మే) 2 నుంచి 20 వరకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌  ఠీఠీఠీ.్టట pటb.జీn లో దరఖాస్తు చేసుకోవాలని శ్రీనివాస్‌రావు సూచించారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి.. అందులో పేర్కొన్న మేర అర్హతలను పూర్తిగా చెక్‌ చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎస్సై, తత్సమాన హోదా పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000.. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలని తెలిపారు. కానిస్టేబుల్, తత్సమాన హోదా పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలన్నారు. దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత విద్యార్హతలను కలిగి ఉండాలని.. అలాగే 2022 జూలై 1 నాటికి సదరు కోర్సులో ఉత్తీర్ణత సాధించగలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

మూడేళ్ల వయోపరిమితి సడలింపు 
నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం.. పోలీస్, తదితర విభాగాల్లో పోస్టులకు వయోపరిమితిని మూడేళ్ల పాటు సడలించింది. పోలీస్‌ శాఖ, ఇతర యూనిఫాం విభాగాల్లో.. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) పోస్టులకు 21 ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే అర్హులు. ఇప్పుడు 28 ఏళ్ల వరకు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కానిస్టేబుల్‌ పోస్టులకు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య వయసు పరిమితి ఉండగా.. ఇప్పుడు 25 ఏళ్ల వయసున్న వారి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న (కార్పొరేషన్లు కాకుండా) వారికి ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు మరో మూడేళ్లు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్చర్లకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల వారికి ఐదేళ్లు, జనగణన శాఖలో తాత్కాలిక పద్ధితిలో ఆరు నెలలల పాటు 1991లో పనిచేసిన వారికి మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉన్నట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌లో తెలిపింది. 

TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చ‌దివితే పోలీస్ ఉద్యోగం మీదే..!

​​​​​​​మహిళా రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్‌ కూడా.. 
రాష్ట్ర పోలీసుశాఖలోని సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. గత నియామకాల తరహాలోనే.. ఈసారి కూడా సివిల్‌ విభాగంలో 33శాతం, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లో 10శాతం మహిళా రిజర్వేషన్‌ వర్తిస్తుందని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఇక ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద 10శాతం రిజర్వేషన్‌ సైతం అమలవుతుంది.  

  • స్పోర్ట్స్, ఎన్‌సీసీ, పోలీస్‌ ఉద్యోగుల పిల్లలు, జైళ్లశాఖ ఉద్యోగుల పిల్లలు, ఎస్పీఎఫ్‌ ఉద్యోగుల పిలలు, హోంగార్డులకు స్పెషల్‌ కేటగిరీ కింద రిజర్వేషన్‌ ఉన్నట్టు బోర్డు తెలిపింది. 
  • ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించి విడాకులు పొందిన మహిళలు, భర్తను కోల్పోయిన మహిళలకు 40 ఏళ్ల వరకు వయో పరిమితి సడలింపు ఉంటుందని ప్రకటించింది.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events

TS Police Jobs: ఈ నిబంధనల ప్రకారమే పోలీసు ఉద్యోగాలు భర్తీ..

Published date : 26 Apr 2022 11:00AM

Photo Stories