Skip to main content

TS Police Jobs: ఈ నిబంధనల ప్రకారమే పోలీసు ఉద్యోగాలు భర్తీ..

రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన 17 వేల పైచిలుకు పోలీస్‌ ఖాళీల భర్తీపై పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చర్యలు ప్రారంభించింది.
Recruitment of police vacancies under the old rules
పాత నిబంధనల ప్రకారమే ఖాళీల భర్తీ

ఆర్థిక శాఖ అనుమతి రావడంతో నోటిఫికేషన్ కోసం కార్యాచరణను వేగవంతం చేసినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఉగాది తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. స్థానికత ఆధారంగా సివిల్, ఏఆర్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీచేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మూడు రిక్రూట్‌మెంట్లలో అమలు చేసిన నిబంధనలే ఈసారి కూడా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. 

మహిళల రిజర్వేషన్ యథాతథం

పోలీస్‌ శాఖలో కేవలం 6శాతం లోపే ఉన్న మహిళా అధికారులు, సిబ్బంది సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా జరిగే సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) విభాగాల్లో వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించింది. సివిల్‌ (లా అండ్‌ ఆర్డర్‌) విభాగంలో భర్తీ చేయనున్న 4,965 కానిస్టేబుల్‌ పోస్టుల్లో 33శాతం, ఏఆర్‌ విభాగానికి సంబంధించిన 4,423 కానిస్టేబుల్‌ పోస్టుల్లో 10శాతం మహిళా కోటా అమలు కానుంది. అదేవిధంగా సబ్‌ఇన్ స్పెక్టర్‌ సివిల్‌ కేటగిరిలో 415 పోస్టుల్లో 33 శాతం, ఏఆర్‌ ఎస్‌ఐ పోస్టుల్లో 10 శాతం కోటా ఇవ్వనున్నట్లు తెలిసింది. ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ (స్పెషల్‌ ఆర్మ్‌డ్‌రిజర్వ్‌ సెంట్రల్‌ పోలీస్‌ లై¯Œ్స)లో భర్తీకి అనుమతిచి్చన 100 కానిస్టేబుల్‌ పోస్టులు, ఐదు ఎస్‌ఐ పోస్లుల్లోనూ 10శాతం కోటా మహిళలకు అమలుకానున్నట్టు తెలిసింది.

ఐటీపై మరింత పట్టుకోసం

పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్‌పై పట్టు దిశగా పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టింది. సైబర్‌ క్రైమ్‌ నియంత్రణతోపాటు సాంకేతిక కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు ఐటీఅండ్‌ సీ విభాగంలో 262 కానిస్టేబుల్‌ పోస్టులు ఇంజనీరింగ్, డిప్లొమా బ్యాక్‌గ్రౌండ్‌ వారితో భర్తీ చేయబోతున్నారు. అదేవిధంగా 23 ఎస్‌ఐ పోస్టులు సైతం భర్తీ చేయనున్నారు. 

ఫోరెన్సిక్, ఫింగర్‌ ప్రింట్స్‌ పటిష్టత దిశగా...

కేసు దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణలోకీలకంగా ఉపయోగపడే ఫోరెన్సిక్‌ సైన్స్ ల్యాబొరేటరీ, ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరోను పటిష్టం చేసేందుకు పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టింది. ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో 8 ఏఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా ఫోరెన్సిక్‌ సైన్స్ లాబోరేటరీలో 14 సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టులు, 32 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 17 ల్యాబ్‌ టెక్నీషియన్స్, ఒక ల్యాబ్‌ అటెండర్‌ పోస్టు భర్తీ చేయనున్నారు. 

Published date : 26 Mar 2022 03:41PM

Photo Stories