Telangana Govt Jobs: 16,614 పోలీసు కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల వివరాలు ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేసింది. పోలీసుశాఖతోపాటు మరో 3 విభాగాల్లో 16,614 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏప్రిల్ 25న తీపికబురు చెప్పింది. ఎస్సై పోస్టులు, ఇతరవిభాగాల్లో తత్సమాన హోదా ఉండే పోస్టులు కలిపి 587 ఖాళీలను.. కానిస్టేబుల్, తత్సమాన హోదా ఉండే 16,027 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశామని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు ప్రకటించారు.
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చదివితే పోలీస్ ఉద్యోగం మీదే..!
వచ్చే నెల 2 నుంచి దరఖాస్తులు
పోలీస్, ఫైర్, ఎస్పీఎఫ్, జైళ్లశాఖలో భర్తీ చేయనున్న పోస్టులకు వచ్చే నెల (మే) 2 నుంచి 20 వరకు పోలీస్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ www.tslprb.in లో దరఖాస్తు చేసుకోవాలని శ్రీనివాస్‌రావు సూచించారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి.. అందులో పేర్కొన్న మేర అర్హతలను పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎస్సై, తత్సమాన హోదా పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000.. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలని తెలిపారు. కానిస్టేబుల్, తత్సమాన హోదా పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలన్నారు. దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత విద్యార్హతలను కలిగి ఉండాలని.. అలాగే 2022 జూలై 1 నాటికి సదరు కోర్సులో ఉత్తీర్ణత సాధించగలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి
ఎస్సై, తత్సమాన హోదా పోస్టులివీ.. |
|
విభాగం |
పోస్టులు |
ఎస్సై (సివిల్) |
414 |
ఎస్సై (ఆర్మ్‌డ్) |
66 |
ఫైర్ ఆఫీసర్ |
26 |
ఆర్‌ఎస్సై (టీఎస్‌ఎస్‌పీ) |
23 |
ఎస్సై (ఐటీ అండ్ సీ) |
22 |
ఎస్సై (ఎస్పీఎఫ్) |
12 |
డిప్యూటీ జైలర్ |
8 |
ఏఎస్సై (ఫింగర్ ప్రింట్స్) |
8 |
ఆర్‌ఎస్సై (ఎస్‌ఏఆర్ సీపీఎల్) |
5 |
ఎస్సై (ట్రాన్స్‌పోర్ట్) |
3 |
మొత్తం |
587 |
ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events
కానిస్టేబుల్, తత్సమాన పోస్టులివీ.. |
|
విభాగం |
పోస్టులు |
కానిస్టేబుల్ (టీఎస్‌ఎస్‌పీ) |
5,010 |
కానిస్టేబుల్ (సివిల్) |
4,965 |
కానిస్టేబుల్ (ఆర్మ్‌డ్) |
4,423 |
ఫైర్‌మన్ |
610 |
కానిస్టేబుల్ (ఎస్పీఎఫ్) |
390 |
కానిస్టేబుల్ (ఐటీ అండ్ సీ) |
262 |
జైల్ వార్డర్ (పురుషులు) |
136 |
కానిస్టేబుల్ (డ్రైవర్స్) |
100 |
కానిస్టేబుల్ (సీపీఎల్) |
100 |
జైలు వార్డర్ (మహిళలు) |
10 |
కానిస్టేబుల్ (మెకానిక్) |
21 |
మొత్తం |
16,027 |