Skip to main content

Job Mela: 11వ తేదీ జాబ్‌మేళా.. స‌ద్వినియోగం చేసుకోండి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో న‌వంబ‌ర్ 11వ తేదీ తేదీ జాబ్‌మేళా జ‌ర‌గ‌నుంది.
Job Mela in Andhra Pradesh job mela at NAC training center uyyuru. Job opportunities in Andhra Pradesh

ఉయ్యూరు: న‌వంబ‌ర్ 11వ తేదీ ఉయ్యూరు బస్టాండు సమీపంలోని శ్రీలంకకాలనీలోని ఎన్‌ఏసీ ట్రైనింగ్‌ సెంటరులో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఒకేషనల్‌ ఉపాధి కల్పన అధికారి సత్యబ్రహ్మం, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్‌ పి.నరేష్‌ కుమార్ న‌వంబ‌ర్ 7వ తేదీ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనశాఖ, డీఆర్‌డీఏ–సీడాప్‌, ఎన్‌ఏసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్‌మేళాలో బీజెడ్‌ ఫిన్సర్వ్‌, పేటిఎం ఇతర ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని వివరించారు. 

టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు యువతీయువకులు ఈ జాబ్‌మేళాకు హాజరుకావచ్చన్నారు. ఇతర వివరాలకు 79813 68429, 93923 45939 నంబర్లను సంప్రదించాలని వారు సూచించారు.

Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో 1000 పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Published date : 08 Nov 2024 06:21PM

Photo Stories