Skip to main content

AP TRANSCO Jobs: ట్రాన్స్‌కోలో ఖాళీలను భర్తీ చేయాలి

చిత్తూరు కార్పొరేషన్‌: ట్రాన్స్‌కోలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నియమాకాలు చేపట్టాలని ఏపీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ నాయకులు కోరారు. న‌వంబ‌ర్‌ 8న గిరింపేటలోని ట్రాన్స్‌కో ఈఈ కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర నాయకులు సుధాకర్‌, హేమకుమార్‌ మాట్లాడారు. అనంతరం వారు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
Vacancies to be filled in Transco

నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో సిబ్బంది నియామకాలు చేపట్టకుండా ప్రారంభించడం సరికాదన్నారు. ఉన్న ఉద్యోగులనే సబ్‌స్టేషన్లలో విధులకు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిభారంతో ఉద్యోగులు పొరబాట్లు చేస్తే అధికారులు కక్షసాధింపులకు దిగుతున్నారని తెలిపారు.

పెరిగిన ధరలతో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న ఆపరేటర్లపై పనిభారం వేయడం అన్యాయమన్నారు. సబ్‌స్టేషన్ల వారీగా ఖాళీలను భర్తీ చేయాలని, లేనిపక్షంలో అదనపు పనికి అదనపు వేతనం అందించాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా, జీతం నెలకు రూ. 30వేలు

సబ్‌స్టేషన్లలో వాచ్‌మెన్ల నియమించాలని, ఒకరే పని చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే ఎలా ? అని ప్రశ్నించారు.

33/11 సబ్‌స్టేషన్‌లో స్కిల్డ్‌ కార్మికులను అదనంగా ట్రీ కటింగ్‌, మీటర్‌ రీడింగ్స్‌, బిల్‌కలెక్షన్లకు తీసుకోరాదన్నారు. సంస్థల్లో మూడు దశాబ్దాలకు పైబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. నాయకులు బాలాజీ, చిట్టిబాబు, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 09 Nov 2024 04:18PM

Photo Stories