835 Head Constable Jobs: ఎస్‌ఎస్‌సీ ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ 2022కు నోటిఫికేషన్ విడుదల..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)–ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2022కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పురుషులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
పోస్టులు: హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్)
మొత్తం పోస్టుల సంఖ్య: 835
పోస్టుల వివరాలు
- హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) మేల్–559
- హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్)ఫిమేల్–276.
అర్హతలు
- ఇంటర్మీడియెట్(10+2)/తత్సమాన అర్హత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరి. ఇంగ్లిష్/హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి.
వయసు: 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్‌మెంట్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: రాత పరీక్షను మొత్తం వంద ప్రశ్నలు– వంద మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కంప్యూటర్ సంబంధిత అంశాలు ఉంటాయి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 16.06.2022
- పరీక్ష తేది: సెప్టెంబర్, 2022
వెబ్‌సైట్: https://ssc.nic.in
చదవండి: SSC Recruitment 2022: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 1920 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | 12TH |
Last Date | June 16,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |