Skip to main content

SSC CHSL 4500 Vacancies: ఇంటర్‌తోనే కేంద్ర కొలువులు ... నిర్దిష్ట ప్రణాళికతో విజయం‌.. నెలకు రూ.40వేలకు పైగా ...

ఇంటర్మీడియెట్‌తోనే కేంద్ర ప్రభుత్వ కొలువు సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)..4,500 పోస్టుల భర్తీకి కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌(సీహెచ్‌ఎస్‌ఎల్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల పరిధిలో.. గ్రూప్‌-సి కేడర్‌లో..ఎల్‌డీసీ/జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు భర్తీ చేయనుంది. ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం అందుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌-2022 ముఖ్య సమాచారం, పోస్ట్‌ల వివరాలు, ఎంపిక విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
ssc chsl exam pattern and syllabus and preparation guidance
  • కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ విడుదల
  • పలు శాఖల్లో 4,500 గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ఎంపిక ప్రక్రియ
  • ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.40వేలకు పైగా వేతనం
  • నిర్దిష్ట ప్రణాళికతో విజయం సాధించే అవకాశం

ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు ప్రభుత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రిబ్యునల్స్‌ తదితర విభాగాల్లో లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ /జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. మొత్తం 4,500 పోస్ట్‌లకు సీహెచ్‌ఎస్‌ఎల్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. 

చ‌ద‌వండి: SSC Study Material

అర్హతలు

  • జనవరి 4, 2023 నాటికి ఇంటర్మీడియెట్, తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి.
  • వయసు: జనవరి 1, 2022 నాటికి 18-27ఏళ్ల మధ్య (జనవరి 2, 1995- జనవరి 1, 2004 మధ్యలో జన్మించాలి) ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఇస్తారు.

వేతనాలు

  • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ)/జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జేఎస్‌ఏ): పే లెవల్‌-2; వేతన శ్రేణి రూ.19,900-రూ.63,200.
  • డేటాఎంట్రీ ఆపరేటర్‌: పే లెవల్‌-4; వేతన శ్రేణి రూ.25,500-రూ.81,100, పే లెవల్‌-5; వేతన శ్రేణి రూ.29,200-రూ.92,300
  • డేటాఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఎ; పే లెవల్‌-4; వేతన శ్రేణి రూ.25,500-రూ.81,100

చ‌ద‌వండి: SSC-CHSL Exam 2022 Notification: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)లో 4500 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

రెండంచెల ఎంపిక ప్రక్రియ

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. సీహెచ్‌ఎస్‌ఎల్‌ ఎంపిక ప్రక్రియను రెండు దశల్లో చేపట్టనుంది. టైర్‌-1, టైర్‌-2 పేరుతో పరీక్షలను నిర్వహిస్తుంది.

టైర్‌-1 ఇలా

  • తొలి దశగా పేర్కొనే టైర్‌-1 పరీక్షను 100 ప్రశ్నలు-200 మార్కులకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో, బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • పార్ట్‌ 1 ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(బేసిక్‌ నాలెడ్జ్‌) 25 ప్రశ్నలు-50 మార్కులు, పార్ట్‌ 2 జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 25 ప్రశ్నలు-50 మార్కులు, పార్ట్‌ 3 క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ (బేసిక్‌ అర్థిమెటిక్‌ స్కిల్‌), పార్ట్‌ 4 జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
  • పరీక్షకు కేటాయించిన సమయం ఒక గంట. నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కును తగ్గిస్తారు. 

చ‌ద‌వండి: సీహెచ్‌ఎస్‌ఎల్‌లో సక్సెస్‌కు మార్గాలు

టైర్‌-2.. రెండో దశ

  • తొలిదశ టైర్‌-1 పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా నిర్దిష్ట కటాఫ్‌ నిబంధనల ప్రకారం మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. అందులో నిలిచిన వారు రెండో దశ.. టైర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షను రెండు సెషన్‌లు, మూడు సెక్షన్లు, ప్రతి సెక్షన్‌లో రెండు మాడ్యూల్స్‌ విధానంలో నిర్వహిస్తారు. 
  • సెషన్‌ 1: సెక్షన్‌ 1లో మ్యాథమెటికల్‌ ఎబిలిటీస్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌లో 30 ప్రశ్నల చొప్పున మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష సమయం ఒక గంట. 
  • సెషన్‌ 1: సెక్షన్‌ 2లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రెహెన్షన్‌ 40 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 3 మార్కుల చొప్పున మొత్తం 180 మార్కులకు ఈ సెక్షన్‌ ఉంటుంది.పరీక్ష సమయం ఒక గంట. 
  • సెషన్‌ 1: సెక్షన్‌ 3లో కంప్యూటర్‌ పరిజ్ఞానంపై 15 ప్రశ్నలు(ప్రతి ప్రశ్నకు 3 మార్కులు)-45 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 15 నిమిషాలు. 
  • సెషన్‌ 2: మాడ్యూల్‌-2లో పేర్కొన్న స్కిల్‌ టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌ మాడ్యూల్‌ను పార్ట్‌-ఎ, పార్ట్‌-బిలుగా విభజించారు.
  • పార్ట్‌-ఎ ప్రకారం-డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు 15 నిమిషాల వ్యవధిలో స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
  • పార్ట్‌-బి ప్రకారం-ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్ట్‌ల అభ్యర్థులకు పది నిమిషాల వ్యవధిలో టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
  • స్కిల్‌ టెస్ట్, టైపింగ్‌ టెస్ట్‌ మాడ్యూల్‌ మినహా మిగతా విభాగాల్లోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి. 
  • డేటాఎంట్రీ ఆపరేట్‌ పోస్ట్‌లకు నిర్వహించే స్కిల్‌ టెస్ట్‌లో.. అభ్యర్థులు గంటకు 8000 క్యారెక్టర్స్‌ను కంప్యూటర్‌పై టైప్‌ చేయాల్సి ఉంటుంది.
  • ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్ట్‌లకు నిర్వహించే టైపింగ్‌ టెస్ట్‌లో.. అభ్యర్థులు ఇంగ్లిష్‌ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాలు టైప్‌ చేయాల్సి ఉంటుంది.
  • డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు ఏదైనా ఒక ఇంగ్లిష్‌ ప్యాసేజ్‌ను ఇచ్చి కంప్యూటర్‌పై టైప్‌ చేయమని అడుగుతారు.

చ‌ద‌వండి: ఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ స్కోర్ చేయండి ఇలా...!

ఈ పరీక్షలో నెగ్గాలంటే
టైర్‌-1కు ఇలా

నాలుగు విభాగాల్లో ఉండే టైర్‌-1లో ఆయా విభాగాల వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్‌ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా యాంటానిమ్స్,సినానిమ్స్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్, యాక్టివ్‌/ప్యాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌-ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, స్పెల్లింగ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్‌ వంటి అంశాలపై పట్టు సాధించాలి.

చ‌ద‌వండి: SSC Previous Papers

జనరల్‌ ఇంటెలిజెన్స్‌

వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు అడిగే ఈ విభాగంలో రాణించాలంటే.. సిరీస్‌(నంబర్‌/ఆల్ఫా న్యుమరిక్‌) విభాగం, అనాలజీస్, ఆడ్‌ మెన్‌ ఔట్, సిలాజిజమ్, మ్యాట్రిక్స్, డైరెక్షన్, వర్డ్‌ ఫార్మేషన్, బ్లడ్‌ రిలేషన్స్, నాన్‌ వెర్బల్‌(వాటర్‌ ఇమేజ్, మిర్రర్‌ ఇమేజ్‌), కోడింగ్‌ డీకోడింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగంలో అర్థగణిత అంశాలైన సింపుల్‌ ఇంట్రెస్ట్, కాంపౌండ్‌ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, శాతాలను ప్రాక్టీస్‌ చేయాలి. అదే విధంగా, త్రికోణమితి, అల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టైం అండ్‌ వర్క్, టైం అండ్‌ డిస్టెన్స్‌లకు సంబంధించిన ప్రశ్నలను కూడా ప్రాక్టీస్‌ చేయాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌

జనరల్‌ అవేర్‌నెస్‌లో జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు మొదలు జనరల్‌ సైన్స్, ఎకానమిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ విభాగాలపై దృష్టి పెట్టాలి. హిస్టరీకి సంబంధించి ఆధునిక భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలపై ప్రత్యేక దృష్టితో చదవాలి. జాగ్రఫీలో సహజ వనరులు, నదులు, పర్వతాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఎకనామిక్స్‌కు సంబంధించి ఇటీవల కాలంలో ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఏర్పడిన కీలక పరిణామాలపై దృష్టి పెట్టాలి. అంతేకాకుండా ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పదజాలంపైనా పట్టు సాధించడం ఎంతో మేలు చేస్తుంది. సీహెచ్‌ఎస్‌ఎల్‌ అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌ను కీలకంగా భావించాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలపై ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. స్టాక్‌ జీకే విషయంలో చరిత్రలో ముఖ్యమైన వ్యక్తులు,తేదీలు, సదస్సు లు, సమావేశాలు-వాటి తీర్మానాలు, అవార్డులు-విజేతలు వంటి సమాచారాన్ని ఔపోసన పట్టాలి.

చ‌ద‌వండి: SSC Exams Videos

మారిన విధానం

ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2021తో పోల్చితే సీహెచ్‌ఎస్‌ఎల్‌-2022 పరీక్ష విధానంలో కొంత మార్పులు గమనించొచ్చు. గత ఏడాది వరకు టైర్‌-2 పరీక్షను పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహించారు. అభ్యర్థులు ఎస్సే రైటింగ్, లెటర్‌ రైటింగ్, ప్రెసిస్‌ రైటింగ్, అప్లికేషన్‌ రైటింగ్‌ వంటి విభాగాల్లో ప్రశ్నలకు సమాధానాలను రాయాల్సి వచ్చేది. ఈ ఏడాది టైర్‌-2 పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలోనే నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొనడం గమనార్హం. స్కిల్‌ టెస్ట్‌ మినహా మిగతా విభాగాలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 4, 2023
  • ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు చివరి తేదీ: జనవరి 5, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులో సవరణ అవకాశం: జనవరి 9, 10 తేదీల్లో
  • టైర్‌-1 పరీక్ష తేదీ: 2023 ఫిబ్రవరి/మార్చిలో 
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in/, https://ssc.nic.in/Portal/Notice

చ‌ద‌వండి: SSC Exam Syllabus

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date January 05,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories