SSC-CHSL Exam 2022 Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)లో 4500 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 4500
పోస్టుల వివరాలు: లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్(డీఈవో), డేటాఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్–ఎ).
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. ఓపెన్ స్కూల్ ద్వారా చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో.. డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.
వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి.
వేతనం: ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్–ఎకు రూ.29,200 నుంచి రూ.92,300 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: టైర్–1, టైర్–2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 06.12.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.01.2023
టైర్–1 పరీక్ష(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) తేదీ: ఫిబ్రవరి/మార్చి 2023
వెబ్‌సైట్: https://ssc.nic.in/
చదవండి: 3.5 లక్షల+ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలో... పూర్తి వివరాలు తెలుసుకోండి..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | January 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |