Skip to main content

SSC JE Recruitment 2022: కేంద్రంలో జూనియర్‌ ఇంజనీర్‌ కొలువు.. పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ టిప్స్‌..

SSC JE Recruitment 2022

ఇంజనీరింగ్‌ డిప్లొమా.. పాలిటెక్నిక్‌గా సుపరిచితమైన కోర్సు! డిప్లొమా పూర్తి చేసుకున్న యువతకు చక్కటి ఉద్యోగ అవకాశం ఆహ్వానం పలుకుతోంది! ఎస్‌ఎస్‌సీజూనియర్‌ ఇంజనీర్‌(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్స్‌) పోస్టులకు ప్రకటన వెలువడింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ కొలువు సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది!! ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌సీ తాజా నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ టిప్స్‌..

  • ప్రారంభ వేతనం రూ.60వేలు
  • డిప్లొమా/బీటెక్‌ ఉత్తీర్ణులు అర్హులు
  • సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఉద్యోగాలు
  • ఎస్‌ఎస్‌సీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ

జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌) ఎగ్జామ్‌2022 ద్వారా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తొమ్మిది శాఖలు, విభాగాలు, సంస్థల్లో జూనియర్‌ ఇంజనీర్‌ పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్, సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌(నావల్‌), ఫరక్కా బ్యారేజ్‌ ప్రాజెక్ట్, మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీసెస్, నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్‌ పోర్ట్స్, షిప్పింగ్‌ అండ్‌ వాటర్‌ వేస్‌(అండమాన్‌ లక్షద్వీప్‌ హార్బర్‌ వర్క్స్‌) తదితర శాఖలు, విభాగాల్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ జూనియర్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్యను వెల్లడించలేదు.

అర్హతలు

  • 2022, సెప్టెంబర్‌ 2 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సివిల్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లతో డిప్లొమా/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ పోస్ట్‌లకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • వయసు: జనవరి 1, 2022 నాటికి 30ఏళ్లకు మించకూడదు. సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌లకు మాత్రం గరిష్ట వయోపరిమితి 32ఏళ్లు. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

నెలకు రూ.60వేలు

  • డిప్లొమా, బీటెక్‌ అర్హతతో గ్రూప్‌బి(నాన్‌గెజిటెడ్‌) హోదాలో భర్తీ చేయనున్న ఈ జూనియర్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లకు ఎంపికైతే పే లెవల్‌6లో రూ.35,400రూ.1,12,400 వేతన శ్రేణి అందుతుంది.
  • కొలువులు సొంతం చేసుకున్న వారికి ప్రారంభంలోనే నెలకు రూ.60 వేల వరకు వేతనం లభిస్తుంది. 
  • భవిష్యత్తులో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్, డివిజనల్‌ ఇంజనీర్‌ హోదాలకు చేరుకునే అవకాశం ఉంది.

రాత పరీక్షతోనే కొలువు

జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులను రాత పరీక్షల్లో మెరిట్‌ ఆధారంగా భర్తీ చేస్తారు. పేపర్‌1, పేపర్‌2 పేరుతో రెండు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు.

పేపర్‌1.. మూడు విభాగాలు

  • ఎంపిక ప్రక్రియలో తొలి దశగా పేపర్‌1ను ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ఈ పేపర్‌ మూడు విభాగాల్లో 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. 
  • అభ్యర్థులు తాము డిప్లొమా లేదా బీటెక్‌లో చదివిన బ్రాంచ్‌కు అనుగుణంగా పార్ట్‌ఎ/పార్ట్‌బి/పార్ట్‌సిలలో ఏదో విభాగంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాలి.
విభాగం ప్రశ్నలు మార్కులు
జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 50 50
జనరల్‌ అవేర్‌నెస్‌ 50 50
పార్ట్‌ఎ జనరల్‌ ఇంజనీరింగ్‌ (సివిల్‌ అండ్‌ స్ట్రక్చరల్‌) 100 100
పార్ట్‌బి జనరల్‌ ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రికల్‌) 100 100
పార్ట్‌సి జనరల్‌ ఇంజనీరింగ్‌ (మెకానికల్‌) 100 100
  • పేపర్‌1లో పొందిన మార్కులను నార్మలైజేషన్‌ ప్రక్రియ ద్వారా క్రోడీకరించి..కటాఫ్‌ స్కోర్లను నిర్ణయిస్తారు. ఆ తర్వాత అందుబాటులో ఉండే పోస్ట్‌ల సంఖ్య ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. వారికి పేపర్‌2కు అర్హత లభిస్తుంది.

పేపర్‌2.. డిస్క్రిప్టివ్‌ విధానం

  • పేపర్‌2ను పూర్తిగా సబ్జెక్ట్‌ పేపర్లతో డిస్క్రిప్టివ్‌ విధానంలో 300 మార్కులకు నిర్వహిస్తారు. 
  • పార్ట్‌ఎ జనరల్‌ ఇంజనీరింగ్‌(సివిల్‌ అండ్‌ స్ట్రక్చరల్‌), పార్ట్‌బి జనరల్‌ ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రికల్‌), పార్ట్‌సి జనరల్‌ ఇంజనీరింగ్‌(మెకానికల్‌) పేరుతో పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు తమ అర్హతకు అనుగుణంగా సంబంధింత సబ్జెక్ట్‌ విభాగంలో పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది.

తుది ఎంపిక.. ఇలా

రెండు పేపర్లలోనూ పొందిన మార్కుల ఆధారంగా తుది విజేతల జాబితా రూపొందిస్తారు. దరఖాస్తులో పేర్కొన్న ప్రాథమ్యాలు,ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని.. నియామకాలు ఖరారు చేస్తారు. 

సబ్జెక్ట్‌లపై పట్టుతోనే విజయం

జూనియర్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లకు పోటీ పడే అభ్యర్థులు ప్రధానంగా.. ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌లపై పట్టు సాధించాల్సి ఉంటుంది. డిప్లొమా, బీటెక్‌ స్థాయిలో అకడమిక్‌ పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయాలి.

చ‌ద‌వండి: Civil Engineering: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..

సివిల్‌ ఇంజనీరింగ్‌

సివిల్‌ ఇంజనీరింగ్‌ అభ్యర్థులు బిల్డింగ్‌ మెటీరియల్స్, ఎస్టిమేటింగ్, కాస్టింగ్‌ అండ్‌ ఎవాల్యుయేన్, సర్వేయింగ్, సాయిల్‌ మెకానిక్స్, హైడ్రాలిక్స్, ఇరిగేషన్‌ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌లపై పట్టు సాధించాలి. అదే విధంగా.. స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌కు సంబంధించి స్ట్రక్చర్స్‌ థియరీ, కాంక్రీట్‌ టెక్నాలజీ, ఆర్‌సీసీ డిజైన్, స్టీల్‌ డిజైన్‌ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌

ఈ విభాగం అభ్యర్థులు.. బేసిక్‌ కాన్సెప్ట్స్‌తోపాటు సర్క్యూట్‌ లా, మ్యాగ్నటిక్‌ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్, మెజర్‌మెంట్‌ అండ్‌ మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్‌ మెషీన్స్, ఫంక్షనల్‌ కిలోవాట్‌ మోటార్స్‌ అండ్‌ సింగిల్‌ ఫేజ్‌ మోటార్స్, సింక్రనస్‌ మెషీన్స్, జనరేషన్, ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్, ఎస్టిమేషన్‌ అండ్‌ కాస్టింగ్, యుటిలైజేషన్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఎనర్జీ, బేసిక్‌ ఎలక్ట్రానిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి.

మెకానికల్‌ ఇంజనీరింగ్‌

థియరీ ఆఫ్‌ మెషీన్స్, మెషీన్‌ డిజైన్, ఇంజనీరింగ్‌ మెకానిక్స్, స్ట్రెంగ్త్‌ ఆఫ్‌ మెటీరియల్స్, ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ప్యూర్‌ సబ్‌స్టాన్సెస్, ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ లా ఆఫ్‌ థర్మోడైనమిక్స్, ఎయిర్‌ స్టాండర్డ్‌ సైకిల్స్‌ ఫర్‌ ఐసీ ఇంజన్స్, ఐసీ ఇంజన్‌ పెర్‌ఫార్మెన్స్, ఐసీ ఇంజన్స్‌ కంబస్టన్, ఐసీ ఇంజన్‌ కూలింగ్‌ అండ్‌ లూబ్రికేషన్, ఫ్లూయిడ్‌ స్టాటిక్స్, ఫ్లూయిడ్‌ ప్రెజర్, ఫ్లూయిడ్‌ కైనమాటిక్స్, డైనమిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్, మెజర్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్లో రేట్, బేసిక్‌ ప్రిన్సిపుల్స్, హైడ్రాలిక్‌ టర్బైన్స్, సెంట్రిఫ్యుగల్‌ పంప్స్, క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ స్టీల్‌.. తదితర కోర్‌ మెకానికల్‌ అంశాలపై పట్టు సాధించాలి.

సిద్ధాంతాలు, అన్వయ దృక్పథం

ఇంజనీరింగ్‌ పేపర్లలో మెరుగైన స్కోర్‌ కోసం అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లలోని ప్రాథమిక భావనలు,సిద్ధాంతాలు, నియమాలు, ధర్మాలు(ప్రాపర్టీస్‌) వంటివి æ చదువుతూనే.. అన్వయ నైపుణ్యం కూడా అలవర్చుకోవాలి. అప్పుడే పరీక్షలో ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.

ఉమ్మడి సబ్జెక్ట్‌లు.. సన్నద్ధత ఇలా

  • పేపర్‌1లో అభ్యర్థులందరూ రాయాల్సిన ఉమ్మడి సబ్జెక్ట్‌లు.. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ల కోసం ప్రత్యేకంగా సన్నద్ధత సాగించాలి.
  • జనరల్‌ అవేర్‌నెస్‌లో రాణించేందుకు.. చరిత్ర, భారత రాజ్యాంగం, భౌగోళిక శాస్త్రం, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్, స్టాక్‌ జీకే అంశాలను చదవాలి. ఆధునిక భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమ దశలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • జాగ్రఫీకి సంబంధించి దేశ భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, అడవులు, పర్వతాలు, సముద్ర తీర ప్రాంతాలు తదితర అంశాలను తెలుసుకోవాలి.
  • రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైన అధికరణలు, ప్రకరణలు, తాజా సవరణలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో.. తాజాగా దేశ శాస్త్ర, సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, రక్షణ వ్యవస్థ, ఇస్రో తదితర సంస్థల ప్రయోగాల గురించి అధ్యయనం చేయాలి. 
  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌లో రాణించడానికి.. నంబర్‌ సిరిస్, కోడింగ్‌డీకోడింగ్, నంబర్‌ అనాలజీ, ఫిగరల్‌ అనాలజీ, వర్డ్‌ బిల్డింగ్, వెన్‌ డయాగ్రమ్స్, స్పేస్‌ విజువలైజేషన్, సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అనాలిసిస్, విజువల్‌ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్‌ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 2, 2022
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులో సవరణలకు అవకాశం: సెప్టెంబర్‌ 4, 2022
  • పేపర్‌1(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)తేదీ: నవంబర్‌లో
  • వెబ్‌సైట్‌: https://ssc.nic.in

చ‌ద‌వండి: SSC JE Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.1,12,400 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 02,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories