Civil Engineering: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..
దీనికి దేశ విదేశాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల నిర్మాణ రంగం అభివృద్ధి పథంలో సాగుతుంది. రాబోయే కాలంలోనూ అభివృద్ధి ఇలాగే ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మౌలిక సదుపాయాల కల్పన, భారతీయ ఇంజనీర్లకు అధిక డిమాండ్ ఉన్న చోట సివిల్ ఇంజనీర్ల అవసరం ఉంటుంది. విస్తృత క్షేత్రమైన సివిల్ ఇంజనీరింగ్ కింద గ్రామీణ మరియు పట్టణ ప్రణాళిక, నిర్మాణ, వంతెన, హైడ్రాలిక్, పర్యావరణ, రవాణా, కలప, సర్వేయింగ్, జియోటెక్నికల్, నీటి వనరులు, నిర్మాణ నిర్వహణ మరియు భూకంపం వంటి రంగాలుగా విభజించబడింది. ఇందులో ఏ రంగంలోనైనా సివిల్ ఇంజనీర్లు తమ కెరీర్ని నిర్మించుకోవచ్చు. ఒక సమాజ నిర్మాణంలో సివిల్ ఇంజనీర్లు ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా ఎంతో అద్భుతమైన కళాఖండాలు రూపొందించిన ఘనత వారికి ఉంది.
కెరీర్ ఇలా:
• ఫీల్డ్ జాబ్
• పరిశోధన
• నిర్వహణ
ఫీల్డ్ జాబ్స్: ప్రభుత్వ, ప్రవేట్ మరియు ప్రభుత్వ రంగాలలో లభిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో, సివిల్ ఇంజనీర్ NTPC, NHPC, IRCON, RITES, SAIL, BHEL, AAI, HAL, NAL, ఆయిల్ సెక్టార్, ONGC, IOCL, HPCL, GAIL వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అలాగే భవన నిర్మాణం, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు - రహదారులు, విమానాశ్రయాలు, సెజ్, నీటి వనరులు-ఆనకట్టలు, హైడ్రాలిక్ నిర్మాణాలు, నిర్మాణ ప్రణాళిక, నిర్వహణ వంటి రంగాల్లో ప్రవేట్ ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో విద్యార్థులు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా యూపీఎస్సీ విడుదల చేసే ఇతర కేంద్ర ప్రభుత్వ పోస్టులకు ప్రయత్నించవచ్చు. సెంట్రల్ వాటర్ రిసోర్సెస్, సర్వే ఆఫ్ ఇండియా పీడబ్ల్యూడీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వంటి రాష్ట్ర ప్రభుత్వ (టిఎస్పిఎస్సి) పోస్టులకు కూడా ప్రిపేర్ అవ్వొచ్చు.
స్ట్రక్చరల్: AutoCAD, STAAD.Pro, E-TABS, SAP-2000, TEKLA, SAFE, ANSYS, Quantity Surveying, Rebar CAD, REVIT-Structure మొదలైనవి.
ఆర్కిటెక్చరల్: AutoCAD, 3D-MAX, REVIT-MEP, REVIT-Arc, Arch CAD, NAVIS Work, LUMION, Google Sketch-up, Canvas, Rhino వంటి కోర్సులు ఉంటాయి.
పరిశోధన: బిల్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్స్ మెకానిక్స్ వంటి కోర్సుల్లో దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో M.Tech/Ph.D చేసి, ఇస్రో, బార్క్, డిఆర్డిఓ మొదలైన వాటిలో శాస్త్రవేత్తగా స్థిరపడొచ్చు.
నిర్వహణ: IIM, NITIE,NICMAR,NAC, IIQS వంటి శిక్షణ సంస్థల్లో చదివి నిర్వహణ రంగంలో ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు.
వ్యవస్థాపకత: సివిల్ కాంట్రాక్టర్గా, స్ట్రక్చరల్ డిజైనింగ్ వంటి సంస్థలనూ నెలకొల్పి పదిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించొచ్చు. ఇవే కాకుండా ఎవర్గ్రీన్ కోర్సు అయిన సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు జీవితంలో మరెన్నో అవకాశాలు ఉన్నాయి.
- బి. వంశీ కృష్ణ
B.Tech, MS (U.K), M.I.E, M.I.S.T.E, C.Engg
అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్