Skip to main content

SSC JE Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.1,12,400 వ‌ర‌కు వేతనం..

SSC JE Recruitment

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌ బ్రాంచ్‌ల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజనీరింగ్‌ చదివిన వారికి జూనియర్‌ ఇంజనీర్స్‌ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలచేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్‌బి(నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు.

విభాగాలు: కేంద్ర జలసంఘం,సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్,కేంద్ర జల, విద్యుత్‌ రీసెర్చ్‌ స్టేషన్, మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్, ఫరక్కా బ్యారేజ్‌ ప్రాజెక్ట్, నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్వాలిటీ అస్యూరెన్స్, పోర్ట్స్, షిప్పింగ్‌ అండ్‌ వాటర్‌వేస్‌ తదితర సంస్థల్లో సంబంధిత విభాగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది.
అర్హత: డిప్లొమా(సివిల్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌), తత్సమాన డిగ్రీ చదివినవారు అర్హులు.
వయసు: పోస్టులకు అనుగుణంగా 1832 ఏళ్ల వయసు ఉండాలి. వివిధ కేటగిరీలవారికి వయోపరిమితుల్లో సడలింపులు ఉన్నాయి. భారతీయులై ఉండాలి. కొన్ని కేటగిరీలవారికి మినహాయింపులు ఉన్నాయి.
జీతం: సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది.

పరీక్షా విధానం: పరీక్ష రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్‌1, పేపర్‌2 ఉంటాయి. పేపర్‌1 ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. పేపర్‌2 ఆఫ్‌లైన్‌లో జరిగే డిస్క్రిప్టివ్‌ రాతపరీక్ష. పేపర్‌1 మొత్తం 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్‌2 పెన్‌ అండ్‌ పేపర్‌ విధానంలో నిర్వహించే డిస్క్రిప్టివ్‌æ పరీక్ష. పేపర్‌2 మొత్తం 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:02.09.2022
ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు చివరితేది: 03.09.2022
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేది: నవంబర్, 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in

చ‌ద‌వండి: IISc Recruitment 2022: ఐఐఎస్సీ, ఖుదాపురలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date September 02,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories