Skip to main content

7,500 Jobs in SSC CGL: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. కొలువుల నగారా మోగింది! కేంద్ర ప్రభుత్వ శాఖల్లో.. మొత్తం 7,500 గ్రూప్‌–బి, గ్రూప్‌–సి పోస్ట్‌ల భర్తీకి కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (సీజీఎల్‌ఈ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది! వీటికి బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో పోటీ పడొచ్చు! ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌సీ –సీజీఎల్‌ఈ–2023 నోటిఫికేషన్‌ సమాచారం, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
7500 jobs in ssc cgl notification
  • 7,500 పోస్ట్‌ల భర్తీకి ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ఈ నోటిఫికేషన్‌ 
  • కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్‌–బి, గ్రూప్‌–సి ఉద్యోగాలు
  • డిగ్రీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం
  • రెండు దశల రాత పరీక్షతో ఎంపిక ప్రక్రియ

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రతి ఏటా క్రమం తప్పకుండా సీజీఎల్‌ఈ నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది. తా­జాగా 2023 సంవత్సరానికి సంబంధించి 7,500 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో వివిధ రకాల ఉద్యోగాలకు నియామక ప్రక్రియ నిర్వహిస్తుంది. వీటిల్లో అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్,అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, సీబీడీటీలో ఇన్‌కం ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ (గ్రూప్‌–సి), అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌(గ్రూప్‌–బి),సీబీఐలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(గ్రూప్‌–బి) తదితర పోస్టులు ఉన్నాయి.

చ‌ద‌వండి: SSC Exam Syllabus 

అర్హతలు

  • ఆగస్ట్‌ 1, 2023 నాటికి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు సీఏ, సీఎస్, ఐసీడబ్లు్యఏ, ఎంకాం, బిజినెస్‌ స్టడీస్‌లో పీజీ లేదా ఎంబీఏ(ఫైనాన్స్‌) లేదా బిజినెస్‌ ఎకనామిక్స్‌లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
  • జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు ఇంటర్మీడియెట్‌ స్థాయిలో మ్యాథమెటిక్స్‌లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి లేదా స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసుకోవాలి.
  • స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌–2 పోస్ట్‌లకు స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి
  • జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌లో కనీసం ఏడాది రీసెర్చ్‌ అనుభవం, ఎల్‌ఎల్‌బీ లేదా హ్యూమన్‌ రైట్స్‌లో డిగ్రీ అభిలషణీయం అని పేర్కొన్నారు.
  • అన్ని పోస్ట్‌లకు డిగ్రీ చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు

  • గ్రూప్‌–సి కేడర్‌ పోస్ట్‌లకు ఆగస్ట్‌ 1, 2023 నాటికి 18–27 ఏళ్లు ఉండాలి.
  • మిగతా పోస్ట్‌లకు ఆయా పోస్ట్‌లను అనుసరించి 18–20ఏళ్లు, 20–30ఏళ్లు, 18–32ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • అన్ని పోస్ట్‌లకు గరిష్ట వయో పరిమితిలో ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ(జనరల్‌) అభ్యర్థులకు పదేళ్లు, పీడబ్ల్యూడీ(ఓబీసీ) అభ్యర్థులకు 13 ఏళ్లు, పీడబ్ల్యూడీ (ఎస్‌సీ/ఎస్టీ) అభ్యర్థులకు 15 ఏళ్ల సడలింపు లభిస్తుంది.

వేతనం

  • కనిష్ట ప్రారంభ వేతన శ్రేణి రూ.25,500–రూ.81,100, గరిష్ట ప్రారంభ వేతన శ్రేణి రూ.47,600 –రూ.1,51,100గా ఉంది.

చ‌ద‌వండి: SSC పరీక్షల స్టడీ మెటీరియల్

రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ

సీజీఎల్‌ఈ పరీక్షను టైర్‌–1, టైర్‌–2 పేరుతో రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆ వివరాలు..

టైర్‌–1 ఇలా

ఎంపిక ప్రక్రియలో తొలి దశ పరీక్ష టైర్‌–1. ఇందులో 100 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌(25 ప్రశ్నలు–50 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌(25 ప్రశ్నలు–50 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌(25 ప్రశ్నలు– 50 మార్కులు), ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌(25 ప్రశ్నలు–50 మార్కులు) విభాగాల్లో పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి ఒక గంట. పరీక్ష పూర్తిగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా ఉంటుంది. 

నాలుగు పేపర్లుగా టైర్‌–2

  • టైర్‌–1లో చూపిన ప్రతిభ, నిర్దేశిత కటాఫ్‌లను పరిగణనలోకి తీసుకుంటూ.. మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి టైర్‌–2 పరీక్ష ఉంటుంది. టైర్‌–2 పరీక్షను నాలుగు పేపర్లుగా నిర్వహిస్తారు. వివరాలు.. 
  • పేపర్‌–1: పేపర్‌–1ను సెషన్‌–1, సెషన్‌–2లుగా నిర్వహిస్తారు. అదే విధంగా ప్రతి సెషన్‌ను రెండు సెక్షన్‌లుగా వర్గీకరించారు. ప్రతి సెక్షన్‌లోనూ రెండు మాడ్యూల్స్‌ విధానాన్ని అనుసరిస్తారు. 
  • సెషన్‌–1(సెక్షన్‌–1)లో.. మ్యాథమెటికల్‌ ఎబిలిటీస్‌(మాడ్యూల్‌–1), రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌(మాడ్యూల్‌–2) విభాగాల నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 60 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున 180 మార్కులు ఉంటాయి.
  • సెషన్‌–1(సెక్షన్‌–2)లో మాడ్యూల్‌–1లో.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో 45 ప్రశ్నలు, మాడ్యూల్‌–2లో జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. మొత్తం 70 ప్రశ్నలకు 210 మార్కులు ఉంటాయి. 
  • సెషన్‌–1(సెక్షన్‌–3) మాడ్యూల్‌–1లో.. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ నుంచి 20 ప్రశ్నలతో 60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 
  • సెషన్‌–2 సెక్షన్‌–3 మాడ్యూల్‌ 2లో.. డేటాఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌ను 15 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు వేల పదాలతో ప్యాసేజ్‌ను టైప్‌ చేయాల్సి ఉంటుంది.
  • పేపర్‌–2.. స్టాటిస్టిక్స్‌ సబ్జెక్ట్‌పై 100 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటుంది.
  • పేపర్‌–3.. జనరల్‌ స్టడీస్‌(ఫైనాన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌)పై 100 ప్రశ్నలు– 200 మార్కులకు ఉంటుంది. ఈ పేపర్‌ను పార్ట్‌–ఎ(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌–80 మార్కులు); పార్ట్‌–బి(ఎకనామిక్స్‌ అండ్‌ గవర్నెన్స్‌–120 మార్కులు)గా రెండు విభాగాలుగా నిర్వహిస్తారు.
  • పేపర్‌–1లోని అన్ని సెషన్స్, సెక్షన్స్, మాడ్యూల్స్‌కు అన్ని పోస్ట్‌ల అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది.
  • పేపర్‌–2ను జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్, స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌–2 పోస్ట్‌ల అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు.
  • పేపర్‌–3ని అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది. 

చ‌ద‌వండి: SSC Exam Guidance

నిర్దిష్ట ప్రణాళికతోనే రాణింపు

దాదాపు అయిదు లక్షల మంది పోటీ పడే ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ఈలో రాణించాలంటే.. అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌ల వారీగా నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి. సబ్జెక్ట్‌ల వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌

అభ్యర్థుల్లోని విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. ఇందులో స్కోర్‌ కోసంæకోడింగ్, డీ–కోడింగ్, అనలిటికల్‌ పజిల్స్, క్రిటికల్‌ రీజనింగ్‌ బాగా ప్రాక్టీస్‌ చేయాలి. ఇంగ్లిష్‌ అక్షర క్రమాన్ని ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు ప్రాక్టీస్‌ చేయాలి. దీంతోపాటు ఏ అక్షరం ఎన్నో స్థానంలో ఉందో సులువుగా గుర్తించాలి. అదే విధంగా అనలిటికల్‌ రీజనింగ్, సిలాజిజమ్స్, ఇనీక్వాలిటీస్, ఇన్‌పుట్‌ అవుట్‌పుట్, డేటా సఫిషియెన్సీ విభాగాలపై అవగాహన పెంచుకోవాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌

ఈ విభాగంలో రాణించేందుకు హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌ అంశాలపై పట్టు సాధించాలి. అదే విధంగా స్టాక్‌ జీకే, కరెంట్‌ అఫైర్స్‌ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

చ‌ద‌వండి: SSC CGL Notification 2023: డిగ్రీ అర్హతతో 7500 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుదల.. ఎంపిక విధానం ఇలా..

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగంలో మంచి మార్కుల కోసం హైçస్కూల్‌ స్థాయి మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజెస్, యావరేజేస్, రేషియో–ప్రపోర్షన్, ప్రాఫిట్‌–లాస్, సింపుల్‌–కాంపౌండ్‌ ఇంట్రెస్ట్, టైమ్‌–వర్క్, టైమ్‌–డిస్టెన్స్, పర్ముటేషన్స్‌–కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, మిక్షర్‌ అండ్‌ అలిగేషన్స్, పార్టనర్‌ షిప్‌పై దృష్టిపెట్టాలి. భాగహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను నోటితో గణించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి. సింప్లిఫికేషన్స్‌కు సంబంధించి బోడ్‌మస్‌ రూల్స్‌ను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తించుకోవాలి.

ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌

అభ్యర్థులు బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్‌ ప్రాక్టీస్‌ చేయాలి. వీటితోపాటు స్పెల్లింగ్స్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, యాక్టివ్‌ అండ్‌ ప్యాసివ్‌ వాయిస్, వొక్యాబులరీ, రీ రైటింగ్‌ ద సెంటెన్స్, సెంటెన్స్‌ రీ–అరేంజ్‌మెంట్, ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్, ప్రెసిస్‌ రైటింగ్, బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌పై పట్టు సాధించాలి. టెన్సెస్, సెంటెన్స్‌ ఫార్మేషన్, యాక్టివ్‌–ప్యాసివ్‌ వాయిస్, కాంప్లెక్స్‌ సెంటెన్సెస్‌ వంటి ముఖ్యాంశాలపై దృష్టి సారించాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, వొకాబ్యులరీల్లోనూ పూర్తి స్థాయిలో నైపుణ్యం పొందాలి.

కంప్యూటర్‌ నాలెడ్జ్‌

ఈ విభాగంలో రాణించేందుకు కంప్యూటర్‌ ఫండమెంటల్స్, బేసిక్‌ కంప్యూటర్‌ స్ట్రక్చర్, ఆపరేటింగ్‌ సిస్టమ్, నెట్‌వర్క్, ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్‌ కాన్సెప్ట్స్, డీబీఎంస్, ఎంఎస్‌ ఆఫీస్‌లకు సంబంధించి బేసిక్‌ టెర్మినాలజీపై పట్టు సాధించాలి. సిస్టమ్‌కు సంబంధించి హార్డ్‌వేర్‌ టూల్స్, వాటి ఉపయెగాలు వంటి వాటిపైనా అవగాహన ఏర్పరచుకోవాలి.

పేపర్‌–2, పేపర్‌–3లకు ఇలా

జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్, స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు నిర్వహించే పేపర్‌–2, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు జరిపే పేపర్‌–3లలో రాణించేందుకు అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో అకడమిక్‌ పుస్తకాలను చదవాలి. అదే విధంగా గత ప్రశ్న పత్రాలు, నమూనా ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మే 3, 2023
  • దరఖాస్తు సవరణ: మే 7, 8 తేదీల్లో
  • టైర్‌–1 పరీక్ష: జూలై, 2023లో నిర్వహించే అవకాశం
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి,విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories