SSC CGL Notification 2023: డిగ్రీ అర్హతతో 7500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 7500
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఐబీ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఎవోఆర్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఎంవోఈఏ),
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎఫ్‌హెచ్‌క్యూ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఈ అండ్ ఐటీ), అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సీఏ/సీఎంఏ/సీఎస్/పీజీ డిగ్రీ/ఎంబీఏ(ఫైనాన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.08.2023 నాటికి ఖాళీలను అనుసరించి 18–27 ఏళ్లు, 20–30 ఏళ్లు,
18–30 ఏళ్లు, 18–32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల పాటు వయోసడలింపు కల్పించారు. వీరితో పాటు దివ్యాంగులకు ప్రత్యేకంగా వయో సడలింపు ఇచ్చారు.
వేతనం: నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100(ఆయా పోస్టును బట్టి)
చదవండి: SSC Exam Syllabus
ఎంపిక విధానం: టైర్–1, టైర్–2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో రూ.100ను ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాలి (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి
మినహాయింపు ఉంటుంది).
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
చదవండి: SSC పరీక్షల స్టడీ మెటీరియల్
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 03.04.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.05.2023.
టైర్–1 పరీక్ష తేది(కంప్యూటర్ ఆధారిత పరీక్ష): జూలై 2023.
టైర్–2 పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.
వెబ్‌సైట్: https://ssc.nic.in/
చదవండి: 5369 Central Government Jobs 2023: విజయం సాధించే మర్గాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 03,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |