5369 Central Government Jobs 2023: విజయం సాధించే మర్గాలు ఇవే..
- 5,369 పోస్ట్‌ల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్
- గ్రూప్-సి, గ్రూప్-డి, మల్టీ టాస్కింగ్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్
- డిగ్రీ, ఇంటర్, పదో తరగతి అర్హతతో దరఖాస్తుకు అవకాశం
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌లలో మెరిట్ ఆధారంగా నియామకాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. ప్రతి ఏటా సీహెచ్‌ఎస్‌ఎల్, సీజీఎల్ వంటి పరీక్షలను నిర్వహిస్తున్న సంస్థ. అందుకే ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ల కోసం ఉద్యోగార్థులు ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారికి మరో చక్కటి అవకాశం.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫేజ్ - 11 - 2023 సెలక్షన్ పోస్ట్స్ నియామక నోటిఫికేషన్.
మొత్తం పోస్టులు 5,369
ఎస్‌ఎస్‌సీ తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,369 పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. రీజియన్ల వారీగా ఈ పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సదరన్ రీజియన్‌లో 270 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది 2,065 పోస్ట్‌లకే ఫేజ్-10- సెలక్షన్ పోస్ట్‌ల భర్తీ చేపట్టిన ఎస్‌ఎస్‌సీ.. ఈ ఏడాది మాత్రం ఫేజ్-11 ద్వారా 5,369 పోస్ట్‌లను భర్తీ చేయనుంది.
అడ్మిన్ టు టెక్నికల్
ఎస్‌ఎస్‌సీ ఆయా విభాగాల్లో అడ్మినిస్ట్రేషన్ మొదలు టెక్నికల్, నర్సింగ్, రీసెర్చ్, లీగల్, మెడికల్ అనుబంధ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హతతో.. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఫెర్టిలైజర్ ఇన్‌స్పెక్టర్, చార్జ్‌మెన్(ఐటీ), సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్ తదితర పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.
అర్హతలు
- ఆయా పోస్ట్‌లను అనుసరించి మార్చి 27, 2023 నాటికి బ్యాచిలర్ డిగ్రీ, ఇంటర్మీడియెట్, పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
- ఇంటర్మీడియెట్ అర్హతతో.. టైపిస్ట్, లైబ్రేరియన్, టెక్నిషియన్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ తదితర పోస్ట్‌లను భర్తీ చేయనుంది.
- పదో తరగతి అర్హతగా.. ఆయా శాఖల్లో అటెండెంట్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది.
- వయసు: ఆయా పోస్ట్‌లను అనుసరించి 2023 జనవరి 1 నాటికి 18-25 ఏళ్లు, 18-27 ఏళ్లు, 18-30 ఏళ్లు మధ్యలో ఉండాలి.
తొలి దశలో రాత పరీక్ష
- పోస్ట్‌ల నియామక ప్రక్రియలో భాగంగా తొలి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
ఈ రాత పరీక్ష నాలుగు విభాగాల్లో 200 మార్కులకు ఉంటుంది. వివరాలు..
విభాగం ఎ- జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులకు; విభాగం బి- జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులకు;విభాగం సి-క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-50 మార్కులకు; విభాగం డి ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు-50 మార్కులకు ఉంటుంది.
పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ అర్హతగా పేర్కొన్న అన్ని పోస్ట్‌లకు ఈ విభాగాల్లో ఇదే విధానంలో పరీక్ష ఉంటుంది. ఆయా అర్హతలకు అనుగుణంగా ప్రశ్నల క్లిష్టత స్థాయి ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం ఒక గంట. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు నెగెటివ్ మార్కింగ్ నిబంధనను అమలు చేస్తున్నారు.
రెండో దశ స్కిల్ టెస్ట్
- రాత పరీక్షతోపాటు కొన్ని పోస్ట్‌లకు రెండో దశలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ స్కిల్ టెస్ట్‌లో భాగంగా టైపింగ్, డేటాఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ విభాగాల్లో అభ్యర్థుల నైపుణ్యాన్ని పరిశీలిస్తారు.
- రాత పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు 20 మందిని స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
చదవండి: SSC Exam Syllabus
అర్హతను బట్టి.. క్లిష్టత స్థాయి
ఎస్‌ఎస్‌సీ నియామక రాత పరీక్షలో పేర్కొన్న విభాగాలు, అంశాలు అన్ని పోస్ట్‌లలోనూ ఉమ్మడిగా ఉన్నప్పటికీ.. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌కు పేర్కొన్న అర్హత స్థాయిని బట్టి ప్రశ్నల క్లిష్టత స్థాయి ఉంటుంది. పదో తరగతి అర్హత పోస్ట్‌లకు, ఇంటర్ అర్హత పోస్ట్‌లకు, డిగ్రీ అర్హత పోస్ట్‌లకు వేర్వేరు ప్రశ్నలు ఎదురవుతాయి.
ఆకర్షణీయ వేతనాలు
ఎస్‌ఎస్‌సీ ఫేజ్-11 సెలక్షన్ పోస్ట్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి నియామకాలు ఖరారు చేసుకుంటే.. ఆకర్షణీయ వేతనంతో కెరీర్ ప్రారంభించే అవకాశం ఉంటుంది. తాజా నోటిఫికేషన్‌లో.. ఆయా పోస్ట్‌లను అనుసరించి పే లెవల్-1 నుంచి పే లెవల్-7 వరకు వేతన శ్రేణిని పేర్కొన్నారు. పే లెవల్-1 ఉద్యోగాలకు రూ.18,000- రూ.56,900; పే లెవల్-2 ఉద్యోగాలకు రూ.19,900 - రూ.63, 200; పే లెవల్-3 ఉద్యోగాలకు రూ.21,700-రూ. 69,100; పే లెవల్-4 ఉద్యోగాలకు రూ.25,500-రూ.81,100; పే లెవల్-5 ఉద్యోగాలకు రూ. 29,200 - రూ.92,300; పే లెవల్-6 ఉద్యోగాలకు రూ.35,400-రూ.1,12,400; పే లెవల్-7 ఉద్యోగాలకు రూ.44,900-రూ.1,42,400గా వేతన శ్రేణులుగా ఉన్నాయి.
చదవండి: SSC పరీక్షల స్టడీ మెటీరియల్
విజయం సాధించేలా..!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పోస్ట్‌లకు లక్షల సంఖ్యలో పోటీ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అందుబాటులో ఉన్న సమయంలో నిర్దిష్ట వ్యూహంతో పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. ముందుగా సిలబస్‌ను పరిశీలించాలి. దాని ఆధారంగా ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి.
జనరల్ ఇంటెలిజెన్స్
ఈ విభాగంలో రాణించాలంటే.. గుర్తులు, ప్రాబ్లమ్ సాల్వింగ్, రిలేషన్ షిప్, క్లాసిఫికేషన్, నంబర్ సిరీస్, సిమాటిక్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వెన్ డయాగ్రమ్స్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
జనరల్ అవేర్‌నెస్
జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యాంశాలపై అవగాహన పెంచుకోవాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
అర్థమెటిక్‌తోపాటు ప్యూర్ మ్యాథ్స్ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. నంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, రేషియోస్, అల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, లీనియర్ ఈక్వేషన్స్, టాంజెంట్స్ వంటి ప్యూర్ మ్యాథ్స్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగానికి సంబంధించి వ్యాకరణంపై పట్టు సాధించాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొదలు ప్యాసేజ్ కాంప్రహెన్షన్ వరకూ.. అన్ని రకాల గ్రామర్ అంశాలను అభ్యసనం చేయాలి. ముఖ్యంగా యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, సినానిమ్స్, యాంటానిమ్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్‌లపై పట్టు సాధించాలి.
పునశ్చరణ, నమూనా పరీక్షలు
ప్రిపరేషన్ క్రమంలో అభ్యర్థులు నిరంతరం రివిజన్ కొనసాగించేలా ప్లాన్ చేసుకోవాలి. అదే విధంగా ఒక టాపిక్ చదవడం పూర్తయ్యాక నమూనా పరీక్షలు, మాక్ టెస్ట్‌లకు హాజరవ్వాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విషయంలో అర్థమెటిక్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ఇందుకోసం పదో తరగతి స్థాయిలోని గణిత పుస్తకాలతో తమ ప్రిపరేషన్ ప్రారంభించాలి. వాటి ద్వారా ముందుగా కాన్సెప్ట్‌లపై అవగాహన ఏర్పరచుకుని అప్లికేషన్ దృక్పథంతో ప్రాక్టీస్ చేయాలి.
ప్రీవియస్ పేపర్ల ఆధారంగా
సీహెచ్‌ఎస్‌ఎల్, సీజీఎల్ గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్షల్లో ఎస్‌ఎస్‌సీ అడిగే ప్రశ్నల తీరుపై అవగాహన వస్తుంది. పోస్ట్‌లకు దరఖాస్తు సమయంలోనే స్కిల్ టెస్ట్ విషయంలో స్పష్టత ఏర్పరచుకుని వాటికి సంబంధించి కూడా సన్నద్ధత పొందేలా అడుగులు వేయాలి.
చదవండి: SSC Recruitment 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 5369 పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: మార్చి 27, 2023
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: ఏప్రిల్ 3-5
- పరీక్ష: జూన్ లేదా జూలైలో
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చీరాల, కడప, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
- వెబ్‌సైట్: https://ssc.nic.in
Qualification | 10TH |
Last Date | March 27,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |