1411 Constable Posts: ఢిల్లీలో పోలీస్ జాబ్.. నెలకు రూ.40వేల వేతనం
దేశ రాజధాని ఢిల్లీలోని పోలీసు విభాగంలో.. కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ విద్యార్హతతో ఈ పోస్టులను దక్కించుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- మొత్తం పోస్టుల సంఖ్య: కానిస్టేబుల్(డ్రైవర్) పురుషులు–1411
- విభాగాల వారీగా ఖాళీలు: జనరల్–604, ఈడబ్ల్యూస్–142, ఓబీసీ–353, ఎస్సీ–262, ఎస్టీ–50.
- అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత(10+2) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే హెవీ మోటార్ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు వాహనాల నిర్వాహణపై అవగాహన ఉండాలి.
- ఎత్తు: 170 సెంటీమీటర్లు ఉండాలి. ప్రత్యేక వర్గాలకు ఎత్తులో 5 సెంటీమీటర్లు సడలింపు ఉంటుంది.
- వయసు: 01–07.2022 నాటికి 21–30ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
వేతనాలు
- పే లెవల్–3 ప్రకారం–రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనంగా పొందవచ్చు.
ఎంపిక విధానం
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) పరీక్ష, ఫిజికల్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సీబీటీ
ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలకు నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు–20 మార్కులు,జనరల్ ఇంటెలిజెన్స్ 20 ప్రశ్నలు–20 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 10 ప్రశ్నలు–10 మార్కులు, రోడ్‌సెన్స్, వెహికిల్ మెయింటనన్స్,ట్రాఫిక్ రూల్స్/ సిగ్నల్ వెహికిల్, పర్యావరణ కాలుష్యం తదితర అంశాల నుంచి 50 ప్రశ్నలకు–50 మార్కులుంటాయి. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమా«ధానానికి 0.25శాతం మార్కులను కోతగా విధిస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. సబ్జెక్ట్ పరమైన ప్రశ్నలన్నీ పదోతరగతి స్థాయి నుంచి వస్తాయి.
చదవండి: TS Police Jobs: ఇవి పాటిస్తూ.. చదివితే కచ్చితంగా పోలీసు ఉద్యోగం మీదే..
ట్రేడ్ టెస్ట్
- ఈ టెస్ట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో లైట్ మోటార్ వెహికిల్‌కు సంబంధించి ఫార్వడ్, రివర్స్ డ్రైవింగ్‌కు 40 మార్కులు, పార్కింగ్ టెస్ట్‌కు 10 మార్కులు చొప్పున కేటాయిస్తారు. అలాగే హెవీ మోటార్ వెహికిల్‌కు సంబంధించి కూడా ఫార్వడ్, రివర్స్ డ్రైవింగ్‌కు 40 మార్కులు, పార్కింగ్ టెస్ట్‌కు 10 మార్కులు చొప్పున కేటాయిస్తారు. దీంతోపాటు వాహన నిర్వహణకు సంబంధించి 25 మార్కులకు ట్రేడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
- మెడికల్ టెస్ట్ పరంగా ఎటువంటి దృష్టి లోపం ఉండకూడదు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు
- హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విజయవాడ, గుంటూరు, చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
- దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ పీడబ్ల్యూడీ, ఎక్స్–సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహయింపు ఉంది.
- దరఖాస్తులకు చివరి తేదీ: 29.07.2022
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30.07.2022
- సీబీటీ పరీక్ష తేదీ: 2022 అక్టోబర్‌లో
- వెబ్‌సైట్: https://ssc.nic.in/
చదవండి: Sub Inspector Posts: ఐటీబీపీలో 37 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | July 29,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |