TS Police SI & Constable Exams Dates : ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల తేదీ ఇవే.. ఈ సారి సిలబస్ మాత్రం ఇదే..
ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు ఆగస్టు 7వ తేదీ(ఆదివారం) ఉదయం 10:00 నుంచి మాధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించనున్నారు. అలాగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను మాత్రం ఆగస్టు 21వ తేదీ (ఆదివారం) ఉదయం 10:00 నుంచి మాధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించనున్నారు. వివిధ విభాగాల్లో పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల గడువు మే 26వ తేదీ (గురువారం) ముగిసిన విషయం తెల్సిందే.
హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోండిలా..
సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్‌ను జూలై 30వ తేదీ నుంచి డైన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్‌ను మాత్రం ఆగస్టు 10వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును.
TS Police Recruitment: ప్రిలిమ్స్ పరీక్ష విధానం.. విజయం సాధించడానికి మార్గాలు..
ఈ సారి 12,91,006 దరఖాస్తులు.. కానీ
పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, రవాణా, అబ్కారీ విభాగాల్లో 17,516 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 7,33,559 మంది అభ్యర్థుల నుంచి 12,91,006 దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. వివిధ విభాగాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దరఖాస్తుల గడువు మే 26తో ముగిసింది. 52 శాతం (3,55,679) మంది ఒకే ఒక్క ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. 29 శాతం మంది రెండు ఉద్యోగాలకు, 15 శాతం మంది మూడింటికి, 3 శాతం మంది నాలుగు ఉద్యోగాలకు, ఒక శాతం మంది ఐదు పోస్టులకు దరఖాస్తు చేయగా, 6 పోస్టులకు ఎలాంటి దరఖాస్తులు రాలేదన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 21 శాతం (2,76,311) మహిళా అభ్యర్థుల నుంచి వచ్చాయని వెల్లడించారు. కాగా, ప్రభుత్వం నోటిఫికేషన్ సమయంలో ఇచ్చిన మూడేళ్లు కాకుండా మరో రెండేళ్ల వయోసడలింపుతో 1.4లక్షల మంది అభ్యర్థులకు ఉద్యోగ పోటీలో అవకాశం దక్కింది. అలాగే ప్రిలిమినరీ రాతపరీక్షకు 67 శాతం మంది తెలుగు మీడియం, 32.8శాతం మంది ఆంగ్లం, 0.2శాతం మంది ఉర్దూ మీడియం ఎంచుకున్నారు.
TS Police Jobs: పోలీసు రాత పరీక్షలో.. ఏవైనా కష్టమైన ప్రశ్నలు వస్తే..
పోస్టులవారీగా దరఖాస్తులిలా...
☛ ఎస్ఐ సివిల్, తదితర సమాన పోస్టులు: 2,47,630
☛ సివిల్ కానిస్టేబుల్, తదితర సమాన పోస్టులు: 9,54,064
☛ ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ పోస్టులు: 14,500
☛ ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులు: 22,033
☛ కానిస్టేబుల్ డ్రైవర్ (పోలీస్),
☛ ఫైర్ పోస్టులు: 38,060
☛ మెకానిక్ కేటగిరీ పోస్టులు: 5,228
☛ పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ ఎస్ఐ: 3,533
☛ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఏఎస్ఐ: 6,010
తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష విధానం ఇలా :
- కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలతో 200 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు.
- మొత్తం ఎనిమిది విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి..ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, భారత దేశ చరిత్ర–సంస్కృతి–భారత జాతీయోద్యమం, భౌగోళిక శాస్త్ర సిద్ధాంతాలు–భారత భౌగోళిక శాస్త్రం–పాలిటీ–ఎకానమీ; జాతీయ–అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం కలిగిన అంశాలు.
- వీటిలో ఇంగ్లిష్ మినహా మిగతా విభాగాలకు తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇచ్చే వెసులుబాటు కల్పించారు.
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష విధానం :
- సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్‌లకు నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షను రెండు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు.
- అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి 100ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ స్టడీస్ నుంచి మరో 100 ప్రశ్నలు అడుగుతారు.
- మొత్తం మూడు గంటల వ్యవధిలో పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
- రెండు పోస్ట్‌లకు సంబంధించి కనీసం 30 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అదే విధంగా 20 శాతం నెగెటివ్ మార్కుల నిబంధన విధించారు.
- ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు పొందిన మార్కులు,దరఖాస్తుల సంఖ్య ఆధారంగా తదుపరి దశ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
- ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే కానిస్టేబుల్ ప్రిలిమ్స్, అదే విధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా జరిపే సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టత ఆయా పోస్ట్‌ల స్థాయికి అనుగుణంగా ఉంటుంది.
తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి
ఉమ్మడి అంశాలు ఇవే..
- రెండు పోస్ట్‌లకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలో ఉమ్మడి అంశాలు ఉన్నాయి. జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీలు రెండు పోస్ట్‌లలోనూ ఉన్నాయి.
- ఎస్ఐ పోస్ట్‌లకు మాత్రం ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం,తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం,తెలంగాణ ఉద్యమ దశలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. వాస్తవానికి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలో సైతం తెలంగాణ ప్రాధాన్యం గల అంశాలని క్లుప్తంగా పేర్కొన్నారు. వీటిలోనూ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమ దశలకు సంబంధించిన ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది.
- అర్థమెటిక్ కూడా రెండు పోస్ట్‌ల ప్రిలిమ్స్‌లో సిలబస్‌గా పేర్కొన్నారు.
Police Exam Tips: మూడు టెక్నిక్‌లు పాటిస్తే .. పోలీసు ఉద్యోగం మీదే..!
తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్(సివిల్): 4965
➤ కానిస్టేబుల్(ఏఆర్): 4423
➤ కానిస్టేబుల్(ఎస్ఏఆర్సీపీఎల్)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్(టీఎస్ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్): 390
➤ ఫైర్‌మన్ (డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్): 610
➤ వార్డర్(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్(ఐటీ అండ్ కమ్యూనికేషన్స్): 262
➤ కానిస్టేబుల్(మెకానిక్స్)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్(డ్రైవర్స్)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్ పోస్టులు: 16,027
Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్ ఇదే.. ఇలా చదివితే..
ఎస్సై పోస్టుల వివరాలు ఇవే..
☛ సబ్ ఇన్స్పెక్టర్(సివిల్): 414
☛ సబ్ ఇన్స్పెక్టర్(ఏఆర్): 66
☛ సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఏఆర్ సీపీఎల్)(పురుషులు): 5
☛ సబ్ ఇన్స్పెక్టర్(టీఎస్ఎస్పీ)(పురుషులు): 23
☛ సబ్ ఇన్స్పెక్టర్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్)(పురుషులు): 12
☛ స్టేషన్ ఫైర్ ఆఫీసర్(డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్): 26
☛ డిప్యూటీ జైలర్(పురుషులు): 8
☛ సబ్ ఇన్స్పెక్టర్(ఐటీ అండ్ కమ్యూనికేషన్స్): 22
☛ సబ్ ఇన్స్పెక్టర్(పోలీస్ ట్రాన్స్పోర్ట్)(పురుషులు): 3
☛ సబ్ ఇన్స్పెక్టర్(ఫింగర్ ప్రింట్ బ్యూరో): 8
మొత్తం ఎస్సై పోస్టులు: 587
TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నాయ్.. జాగ్రత్తగా రాయండిలా..
TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చదివితే పోలీస్ ఉద్యోగం మీదే..!