TS Police Jobs: పోలీసు రాత పరీక్షలో.. ఏవైనా కష్టమైన ప్రశ్నలు వస్తే..
దీంతో పోలీసు ఉద్యోగాలను సాధించేందుకు అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు మరింత పదును పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం హైదరాబాద్ సైబర్‌క్రైమ్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఎం.తిరుపతి సూచనలు.. సలహాలు మీకోసం..
కీలకమైన మ్యాథ్స్‌పై పట్టు సాధించండిలా..
పోలీసు నియామక పరీక్షల్లో గణిత అంశాలైన అర్థమెటిక్, రీజనింగ్ సబ్జెక్టులు ప్రధానమైనవి. మ్యాథ్స్ నేపథ్యం ఉన్నవారు ఈ విభాగాల్లో సులభంగా మార్కులు సాధించగలుగుతారు. అయితే కొద్దిపాటి సాధన చేస్తే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా అర్థమెటిక్, రీజనింగ్‌పై సులభంగా పట్టు పెంచుకోవచ్చు. ముందుగా గణిత అంశాలపై భయాందోళనలను వీడి ప్రాథమిక భావనలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చదివితే పోలీస్ ఉద్యోగం మీదే..!
కరెంట్ అఫైర్స్‌ను..
జనరల్ స్టడీస్ అంశాల్లో కరెంట్ అఫైర్స్ విభాగం ఎంతో ముఖ్యమైంది. కాబట్టి దీనిపై ఎక్కువ దృష్టి సారించాలి. గత ఏడాదిగా చోటుచేసుకున్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నాయ్.. జాగ్రత్తగా రాయండిలా..
పరీక్ష రాస్తున్నప్పుడు ఏవైనా క్లిష్టమైన ప్రశ్నలు వస్తే..
ఈసారి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు ముఖ్యపాత్ర వహించే అవకాశం ఉంది. 800 మీటర్ల పరుగును పురుషులకు 1600 మీటర్లకు పెంచారు. కాబట్టి అభ్యర్థులు ముందునుంచే ఎక్కువగా సాధన చేయాలి. దీనిలో రాణించగలిగితే ఫైనల్ రాత పరీక్షకు ముందే 70 శాతం విజయావకాశాలను సొంతం చేసుకున్నవారవుతారు. మాక్‌టెస్టులను రాస్తూ పరీక్ష హాలులో ఎదురయ్యే ఒత్తిడిని జయించేలా సన్నద్ధమవ్వాలి. పరీక్ష రాస్తున్నప్పుడు ఏవైనా క్లిష్టమైన ప్రశ్నలు వస్తే ఆందోళన చెందకుండా మిగతా ప్రశ్నలపై దృష్టిసారించాలి. పరీక్ష హాలులోకి వీలైనంత ముందుగా ప్రవేశించడం ద్వారా పరీక్ష వాతావరణానికి అలవాటు పడి పూర్తి ప్రశాతంగా పరీక్ష రాయొచ్చు. అప్పుడే పోలీసు కొలువు సొంతం చేసుకోవచ్చు.
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్(సివిల్): 4965
➤ కానిస్టేబుల్(ఏఆర్): 4423
➤ కానిస్టేబుల్(ఎస్‌ఏఆర్‌సీపీఎల్)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్): 390
➤ ఫైర్‌మన్ (డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్): 610
➤ వార్డర్(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్(ఐటీ అండ్ కమ్యూనికేషన్స్): 262
➤ కానిస్టేబుల్(మెకానిక్స్)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్(డ్రైవర్స్)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్ పోస్టులు: 16,027
TS Police Jobs: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. ఈ అర్హతలు తప్పనిసరి
ఎస్సై పోస్టుల వివరాలు ఇవే..
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(సివిల్): 414
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఆర్): 66
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఏఆర్ సీపీఎల్)(పురుషులు): 5
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్)(పురుషులు): 12
☛ స్టేషన్ ఫైర్ ఆఫీసర్(డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్): 26
☛ డిప్యూటీ జైలర్(పురుషులు): 8
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(ఐటీ అండ్ కమ్యూనికేషన్స్): 22
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(పోలీస్ ట్రాన్స్‌పోర్ట్)(పురుషులు): 3
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(ఫింగర్ ప్రింట్ బ్యూరో): 8
మొత్తం ఎస్సై పోస్టులు: 587
TS Government Jobs: మరో 677 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..
Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్