Skip to main content

Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్‌ ఇదే.. ఇలా చదివితే..

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేసింది.
TS Police Exams Syllabus
TS Police Exams Syllabus

పోలీసు శాఖతోపాటు మరో 3 విభాగాల్లో 16,614 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏప్రిల్‌ 25న గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎస్సై పోస్టులు, ఇతరవిభాగాల్లో తత్సమాన హోదా ఉండే పోస్టులు కలిపి 587 ఖాళీలను.. కానిస్టేబుల్, తత్సమాన హోదా ఉండే 16,027 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం పరీక్ష సిలబస్‌ ఇలా..

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

సిలబస్‌ ఇదే..
➤ పోలీస్‌ కానిస్టేబుల్‌(సివిల్‌) ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్‌సైన్స్‌,భారతదేశ చరిత్ర, భారతదేశ సంస్కృతి,భారత జాతీయోద్యమం, భౌగోళిక సూత్రాలు,భారతదేశ భౌగోళిక శాస్త్రం, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఫైనల్‌ రాత పరీక్షలో ప్రిలిమినరీ పరీక్షలోని సిలబస్‌ అంశాలకు అదనంగా పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించిన విలువలు, సున్నితత్వం, బలహీన వర్గాలు,సామాజిక అవగాహన, భావోద్వేగ తెలివితేటలపై ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. 
➤ ఎస్సై (సివిల్‌/తత్సమానం) ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్థమెటిక్, రీజనింగ్‌ అంశాలతోపాటు జనరల్‌ స్టడీస్‌లో జనరల్‌ సై¯Œ ్స, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, భారత దేశ చరిత్ర, జాతీయోద్యమం, భౌగోళిక సూత్రాలు, భారతదేశ భౌగోళిక శాస్త్రం, ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. 
➤ ఎస్సై(సివిల్‌/ తత్సమానం) ఫైనల్‌ రాతపరీక్ష పేపర్‌–1లో ఇంగ్లిష్‌కు సంబంధించి యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్, ఇతర భాషా నైపుణ్యాలపై పదోతరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. డిస్క్రిప్టివ్‌ విధానంలో లేఖలు రాయడం, నివేదికలు, వ్యాసరూప, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌పై ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌–2లో తెలుగు/ఉర్దూ భాషా పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌–3లో అర్థమెటిక్, రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌–4 జనరల్‌ స్టడీస్‌లో జనరల్ సైన్స్‌, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు, భారత దేశ భౌగోళిక శాస్త్రం, ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ, వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన విలువలు, సున్నితత్వం, బలహీన వర్గాలు, సామాజిక అవగాహన, భావోద్వేగ తెలివితేటలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు వస్తాయి. 

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

ఇలా చదితే..

TS Police Exams


☛ అర్థమెటిక్‌ విభాగం నుంచి సరాసరి, గ.సా.భా., క.సా.గు.,సంఖ్యలు, దశాంశ భిన్నాలు, వర్గమూలాలు–ఘనమూలాలు, సూక్ష్మీకరణలు, నిష్పత్తి–అనుపాతం,భాగస్వామ్యం, వయసులు, శాతా లు, లాభ–నష్టాలు–తగ్గింపులు, సరళ వడ్డీ, చక్రవడ్డీ, మిశ్రమాలు,కాలం–పని, పంపులు–ట్యాంకులు, పనులు–వేతనాలు, కాలం–దూరం, రైళ్లు, పడవలు–ప్రవాహాలు, ఆటలు–పందేలు అంశాలనుంచి ప్రశ్నలను సాధన చేయాలి. 
☛ ప్యూర్‌ మ్యాథ్స్‌ విభాగం నుంచి వైశాల్యాలు, ఘనపరిమాణాలు, రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం,సంభావ్యత,త్రికోణమితి, మాత్రికలు మొదలైన∙అంశాలు ముఖ్యమైనవి. వీటితోపాటు పదోతరగతిలోపు ప్యూర్‌ మ్యాథ్స్‌ను కూడా చదవాలి.
☛ వెర్బల్‌ రీజనింగ్‌లో కేలండర్‌లు, గడియారాలు, టైమ్‌ సీక్వెన్స్, నంబర్‌ టెస్ట్, ర్యాంకింగ్‌ టెస్ట్, డైరెక్షన్‌ టెస్ట్, నంబర్‌ సిరీస్, మిస్సింగ్‌ నంబర్స్, మ్యాథమెటికల్‌ ఆపరేషన్స్, ఆల్ఫాబెటికల్‌ టెస్ట్, కోడింగ్‌–డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, పజిల్స్‌ టెస్ట్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, అర్థమెటికల్‌ రీజనింగ్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం తదితర అంశాలు ముఖ్యమైనవి.
☛ లాజికల్‌ రీజనింగ్‌లో లాజికల్‌ వెన్‌డయాగ్రమ్స్, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ ఆర్గుమెంట్స్, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ అసంప్షన్స్, అసర్షన్‌ అండ్‌ రీజన్, సిల్లోజియం, డేటా సఫిషియెన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. 
☛ నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌లో క్యూబ్స్‌ అండ్‌ డైస్, సిరీస్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం, మిర్రర్‌ ఇమేజెస్, వాటర్‌ ఇమేజెస్, కంప్లీషన్‌ ఆఫ్‌ ఫిగర్స్, పేపర్‌ ఫోల్డింగ్, పేపర్‌ కట్టింగ్, కౌంటింగ్‌ ఫిగర్స్‌ మొదలైనవి ముఖ్యమైనవి.

TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చ‌దివితే పోలీస్ ఉద్యోగం మీదే..!

​​​​​​​TS Police Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు వయోపరిమితి ఇదే..

Published date : 28 Apr 2022 05:17PM

Photo Stories