Skip to main content

Police Exam Tips: మూడు టెక్నిక్‌లు పాటిస్తే .. పోలీసు ఉద్యోగం మీదే..!

పోలీస్‌ ఉద్యోగం అన్ని ప్రభుత్వం ఉద్యోగాల మాదిరి కాదని, ప్రతీ క్షణం అప్రమత్తతతోపాటు చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పరిమళా హనా నూతన్‌ అభిప్రాయ పడ్డారు.
సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పరిమళా హనా నూతన్‌
సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పరిమళా హనా నూతన్‌

అందుకే అభ్యర్థులు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం అని భావించకుండా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనేలా, ఒత్తిడి తట్టుకొని పనిచేసేలా మానసికంగా దృఢంగా ఉండాలని ఆమె సూచించారు. పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, పోలీస్‌ అకాడమీలో జాయింట్‌ డైరెక్టర్‌గా అనుభవమున్న పరిమళా హనా నూతన్‌ పోలీస్‌ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పలు అంశాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. అవి మాటల్లోనే.. మీకోసం.. 

​​​​​​​తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

బలమైన సంకల్పంతో..
పోలీసు ఉద్యోగాలకు ప్రిపరేషన్‌ రెండు రకాలుగా ఉంటుంది. భయపడకుండా సమయాన్ని బట్టి రాతపరీక్షతోపాటు దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమవ్వాలి. ప్రతీ క్షణం ఉద్యోగం సాధిస్తామనే పాజిటివ్‌ దృక్పథంతో ఆలోచిస్తూ అడుగువేయాలి. బలమైన సంకల్పంతో ప్రతీ సబ్జెక్టును శ్రద్ధపెట్టి చదవాలి. రావడంలేదు.. అర్థంకావడంలేదు అనే భావనను దరిచేరనీయొద్దు.

ఇలా ప్రణాళిక వేసుకుంటే..
24 గంటలూ పుస్తకాలు పట్టుకొని వేలాడాల్సిన అవసరంలేదు. చదివిన కొద్ది గంటలైనా శ్రద్ధపెట్టి చదివితే సబ్జెక్టు అర్థమవుతుంది. గుర్తుండి పోతుంది. పర్ఫెక్ట్‌ (ఆయా అంశాలపై సందిగ్ధత లేకుండా స్పష్టతతో), నాలెడ్జ్‌ (బట్టిపట్టకుండా పరిజ్ఞానం పెంచుకోవడం), స్మార్ట్‌ (చాకచక్యంగా తక్కువ సమయంలో ఎక్కువ ప్రిపరేషన్‌ అయ్యేలా).. అనే మూడు టెక్నిక్స్‌తో ప్రణాళిక వేసుకుంటే ఉద్యోగాన్ని సులువుగా కొట్టొచ్చు.

​​​​​​తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి

ఆ ఒక్కటి గుర్తుపెట్టుకొని..
యావత్ ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతుండటంతో నేరాల నియంత్రణలో సాంకేతికత వినియోగం అత్యంత కీలకమైంది. అందువల్ల టెక్నాలజీ రంగం నుంచి వచ్చిన వారికి పోలీస్‌ ఉద్యోగం అదనపు బలమవుతుంది. అయితే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు ఉన్నంత వెసులుబాటు పోలీస్‌ ఉద్యోగాల్లో ఉండదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మానసికంగా సన్నద్ధులై ఉద్యోగంలోకి రావాలి. ఐటీసీ విభాగాలకు ప్రిపేరయ్యే వాళ్లు శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం అంశాల్లో బేసిక్స్‌తోపాటు ప్రొఫెషనలిజం అంశాలపై కొంత దృష్టి పెట్టాలి.

https://education.sakshi.com/ts-police/syllabus/ts-police-exams-syllabus-106919 

అర్థమెటిక్, రీజనింగ్‌ను ఇలా చ‌దివితే..
ఎస్‌ఐ ఉద్యోగమైనా, కానిస్టేబుల్‌ అయినా ఫండమెంటల్‌ బేసిక్స్‌పై దృష్టిసారించాలి. అర్థమెటిక్, రీజనింగ్‌లాంటి సబ్జెక్టులకు కొంత అధిక సమయం కేటాయించాలి. లాజికల్‌ ప్రశ్నలు ఉంటాయి కాబట్టి సమస్యను పరిష్కరించే టెక్నిక్‌ను పట్టగలిగితే ప్రిపరేషన్‌ సులభతరం అవుతుంది. బట్టిపట్ట కుండా కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోగలిగితే రాతపరీక్షను అనుకున్న సమయంలో తప్పులు లేకుండా రాయొచ్చు. అదేవిధంగా జనరల్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్‌ తదితర అంశాలపై కూడా ఫోకస్‌ చేయాలి. తెలంగాణ చరిత్ర, పోరాటం తదితర అంశాలనూ చదవాలి.

Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్‌ ఇదే.. ఇలా చదివితే..

ఒకేసారి 800 మీటర్లు వెళ్లొద్దు.. ఎందుకంటే..?

Police Running


పురుషులతో పోలిస్తే మహిళలు ఏ రంగంలోనూ వెనుకబడి లేరు. కాబట్టి ఇంట్లో పనులు, పిల్లలు, బాధ్యతలు ఎన్ని ఉన్నా గట్టి నిర్ణయంతో మహిళలు ముందడుగు వేస్తే తిరుగుండదు. ప్రిపరేషన్‌ కోసం ఒక షెడ్యూల్‌ పెట్టుకోవాలి, అవసరమైతే ఇంట్లో పనులను కుటుంబీకులకు అప్పజెప్పి పరీక్షలకు సన్నద్ధమవ్వాలి. దేహదారుఢ్య పరీక్షలు కూడా కీలకం కాబట్టి ఒక క్రమపద్ధతిలో ప్రాక్టీస్‌ చేయాలి. మొదటి రోజు 300 మీటర్ల నుంచి పరుగు పందెం ప్రారంభించి క్రమక్రమంగా పెంచాలి. అతి వేగంగా పరిగెత్తాలని భావించి ఒకేసారి 800 మీటర్లు వెళ్లకూడదు. మెల్లమెల్లగా దూరాన్ని పెంచుతూ ప్రయత్నిస్తే శరీరం కూడా సహకరిస్తుంది. 5 నిమిషాల 20 సెకన్లలో చేరేలాగా చూసుకుంటే సరిపోతుంది. లాంగ్‌ జంప్, షార్ట్‌ పుట్‌కు టెక్నిక్స్‌ అవసరముంటాయి, నిపుణుల వద్ద శిక్షణ తీసుకుంటే అవి పెద్ద సమస్య కాదు.

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..

TS Police

​​​​​​​
కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
➤ కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
➤ కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
➤ ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
➤ వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
➤ కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027 

చదవండి: TS Police Syllabus

ఎస్సై పోస్టుల వివరాలు ఇవే..
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సివిల్‌): 414
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఆర్‌): 66
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌)(పురుషులు): 5
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)(పురుషులు): 12
☛ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 26
☛ డిప్యూటీ జైలర్‌(పురుషులు): 8
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 22
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌)(పురుషులు): 3
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో): 8
మొత్తం ఎస్సై పోస్టులు: 587

TS Police Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు వయోపరిమితి ఇదే..

Published date : 30 Apr 2022 12:41PM

Photo Stories