CISF Recruitment 2022: సీఐఎస్‌ఎఫ్‌లో 1149 కానిస్టేబుల్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులయ్యాక ఎక్కువ మంది ఉన్నత విద్య వైపు వెళ్తుంటారు. కొంత మంది ఉద్యోగాల కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి వారి కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్).. ప్రతి ఏటా ఉద్యోగ నియామకాలు చేపడుతుంది. ప్రస్తుతం 2022 సంవత్సరానికి సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్/ఫైర్(మేల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. సీఐఎస్‌ఎఫ్ భర్తీ చేసే కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రత్యేకత, ఎంపిక ప్రక్రియ తదితర సమాచారం...
- మొత్తం పోస్టుల సంఖ్య: 1149
- తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ–39, ఆంధ్రప్రదేశ్–79.
సీఐఎస్‌ఎఫ్
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే సంస్థ.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్). మూడు బెటాలియన్లతో 1969లో సీఐఎస్‌ఎఫ్‌ను స్థాపించారు. ప్రభుత్వరంగ సంస్థలు(పీఎస్‌యూలు), దేశంలోని ప్రధాన మౌలిక వసతుల విభాగాలకు కట్టుదిట్టమైన భద్రతను అందించేలా ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా పవర్‌ప్లాంట్‌లు, న్యూక్లియర్ ఇన్‌స్టాలేషనల్‌లు,ఇండియన్ స్పేస్ సంస్థలు, ఓడ రేవులు, ఎయిర్‌పోర్ట్‌లు, ప్రభుత్వ భవనాలు, వారసత్వ కట్టడాలు వంటి వాటికి భద్రత కల్పిస్తుంది. అంతేకాకుండా వీఐపీలు, మెట్రోరైల్ కార్పొరేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్‌కు కూడా రక్షణ కల్పించే బాధ్యతను కూడా ఈ దళానికే అప్పగించారు.
అర్హతలు
- సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసి ఉండాలి. పురుషులు మాత్రమే ఈ పోస్టుల దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తుదారులు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
- వయసు: 2022.03.04 నాటికి 18–23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయో సడలింపు లభిస్తుంది.
వేతనం
- నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనంగా లభిస్తుంది. వీటితోపాటు ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.
ఎంపిక విధానం
- ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్‌టీ), రాత పరీక్ష , మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పీఈటీ, పీఎస్‌టీలో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే రాత పరీక్షకు అనుమతిస్తారు.
రాత పరీక్ష
- ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో పరీక్షను నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. పరీక్ష సమయం రెండు గంటలు.
- ఈ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు, జనరల్‌నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు, ఇంగ్లిష్/హిందీ భాషా నైపుణ్యానికి సంబంధించి 25 ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 04, 2022
- వెబ్‌సైట్: https://www.cisfrectt.in/
చదవండి: CISF Recruitment: 249 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | March 04,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |